in

మీకు టెర్మినల్ మాన్ తెలుసా? అతనిక లేడు.

టెర్మినల్ మాన్

మీరు ఎప్పుడైనా ఎక్కడైనా విమానంలో ప్రయాణించవలసి వచ్చినట్లయితే, మీ ఫ్లైట్ చాలా గంటలు ఆలస్యం కావడం ఎలా అనిపిస్తుందో మీకు తెలిసి ఉండవచ్చు.

అయితే 18 ఏళ్లుగా ఎయిర్పోర్టులో చిక్కుకుపోయారనుకోండి!

సరే, ఊహించనవసరం లేదు ఎందుకంటే ఒక వ్యక్తి కి సరిగ్గా
అదే జరిగింది….

ఆ కథేంటో చూద్దాం

మెహ్రాన్ కరీమి నస్సేరి, అతని కథ తెలిసిన వ్యక్తి అంత తేలికగా మర్చిపోలేని పేరు, మెహ్రాన్ ఇరాన్ జాతీయుడు, 1943లో జన్మించాడు, అతను 1973లో చదువు కోసం UK వెళ్ళాడు, అతను ఒక రకమైన దేశ వ్యతిరేకి కాబట్టి అతను UKలో ఇరాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు ప్రారంభించారు. 1977లో తన చదువును పూర్తి చేసిన తర్వాత అతను ఇరాన్కు తిరిగి వచ్చాడు, కానీ UKలో ఇరాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అతని నిరసనల కారణంగా అతను అరెస్టు చేయబడ్డాడు. అంతేకాదు అతని పౌరసత్వం రద్దు చేయబడింది. ఇప్పుడు అతను ప్రపంచంలోని ఏ దేశానికీ చెందిన వాడు కాదు. అతను ఐరోపాలోని అనేక దేశాలలో పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకున్నాడు, కానీ అతని ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి, చివరకు 4 సంవత్సరాల తర్వాత అతను శరణార్థ హెూదాను పొందేందుకు ఐక్యరాజ్యసమితిని సంప్రదించాడు, బెల్జియం అతనికి 1981లో శరణార్థ హెూదాను ఇచ్చింది, బెల్జియంలో నివసించిన తర్వాత తన తల్లి UKకి చెందినదని, అందువల్ల అతనికి UK పౌరసత్వం ఇవ్వాలని చాలా సంవత్సరాలు అతను పోరాడాడు, దీని ఆధారంగా, అతను UK పౌరసత్వం కోసం దరఖాస్తు చేసి UKకి వెళ్లాడు.

 

UKకి అతని విమానం ఎక్కి బెల్జియం నుండి పారిస్ ల్యాండ్ అయ్యాడు, పారిస్లో, అతని పాస్పోర్ట్ మరియు ID ఉన్న బ్యాగ్ దొంగిలించబడింది. దీని కారణంగా అతన్ని పారిస్కు తిరిగి పంపించారు. అతనికి ఎలాంటి గుర్తింపు లేకపోవడంతో పారిస్లో కూడా అతన్ని అరెస్టు చేశారు. అతను మొదట చట్టబద్ధంగా విమానాశ్రయంలోకి ప్రవేశించినందున తరువాత విడిచి పెట్టారు. అతను విమానాశ్రయం నుండి బయటకు రాకూడదనే షరతుపై విమానాశ్రయం లో ఆశ్రయం పొందాడు.

దీనితో, విమానాశ్రయంలో అతని ప్రయాణం ప్రారంభమైంది. రోజులు, నెలలు, సంవత్సరాలు గడచిపోయాయి. అతనికి విమానాశ్రయంలోనే కొంత పని దొరికింది, ఆలా అతను బతకడానికి కొంత డబ్బు సంపాదించాడు.
ఒకసారి జర్నలిస్ట్ అయిన ఒక యాత్రికుడు అతని కథను విని దానిని ప్రచురించాడు, దాని కారణంగా అతను ప్రజాదరణ పొందాడు.

పారిస్ నగరానికి చెందిన ఒక న్యాయవాది అతని కేసును
స్వీకరించి అతనికి సహాయం చేయాలని నిర్ణయించుకున్నాడు, అతను శరణార్థి ధృవీకరణ పత్రాలు మరియు ఇతర ముఖ్యమైన పత్రాలను తిరిగి జారీ చేయమని బెల్జియం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాడు. 5 సంవత్సరాల నిరంతర పోరాటానికి బెల్జియం ప్రభుత్వం మళ్లీ సర్టిఫికేట్ను జారీ చేసింది.

మెహ్రాన్ సర్టిఫికేట్ చూసినప్పుడు, అతను ఇంతకుముందు పేర్కొన్న తన పేరు ముందు SIR పేర్కొనబడలేదని అంతేకాదు అతనికి ఎటువంటి గౌరవం ఇవ్వలేదని వాదించాడు, ఈ న్యాయవాది కూడా అతనికి ఆసక్తి లేదని. భావించిన తరువాత అతని UK పౌరసత్వం కోసం ఎటువంటి వత్తిడి చేయలేదు. ఒక న్యాయవాది చేసిన పోరాటం తర్వాత కూడా, మెహ్రాన్ వెర్రి కారణాల వల్ల తిరిగి వెళ్ళడానికి సిద్ధంగా లేడు, చాలా మంది అతను తన మానసిక స్థితిని కోల్పోయాడని అనుకున్నారు.

కొంతకాలం తర్వాత అతని వైద్య పరిస్థితి మరింత దిగజారింది, పారిస్లోని స్థానిక ఆసుపత్రిలో అతను కోలుకున్నాక 2006లో విమానాశ్రయం నుండి బయలుదేరినప్పుడు, విమానాశ్రయం సమీపంలోని హోటల్లో నివసించడానికి, నగరం చుట్టూ తిరగడానికి అనుమతించబడ్డాడు.. చివరిగా  2022 లో పారిస్ ఎయిర్ పోర్ట్ లో టెర్మినల్ మాన్ మరణించినట్టుగా అక్కడ అధికారులు తెలిపారు.

అతని జీవితం నుండి ప్రేరణ పొంది ది టెర్మినల్ అనే ఒక సినిమా కూడా తీయబడింది. ఇది ఒక మనిషి కథ… టెర్మినల్ మాన్ కథ

What do you think?

భార్య సీమంతంలో మోసాన్ని బయట పెట్టిన భర్త..

క్రిప్టో కరెన్సీ కు తప్పని డిజిటల్ కష్టాలు….