in

క్రిప్టో కరెన్సీ కు తప్పని డిజిటల్ కష్టాలు….

టెర్రా-లూనా క్రిప్టో కరెన్సీ భారీ పతనం

క్రిప్టో కరెన్సీ అంటే డిజిటల్ రూపం లో కనిపించే కరెన్సీ. క్రిప్టో కరెన్సీ ని వేగం గ అడాప్ట్ చేసుకుంటున్న ఇరవై దేశాలలో భారత్ రెండో స్థానం లో ఉంది. మనదేశం లో సుమారు కోటి నుండి రెండున్నర కోట్ల మంది క్రిప్టో లావాదేవీలు చేస్తున్నారని అంచనా. Invstopedia గత ఏడాది చివరిలో ప్రచురించిన కథనం ప్రకారం క్రిప్టోలో పదివేలకు పైగా కరెన్సీలు ఉన్నాయట. క్రిప్టో కరెన్సీకున్న క్రేజ్ మామూలుది కాదు. అమాంతం ఈ కరెన్సీ విలువ దూసుకుపోవడంతో మరింత ఆసక్తి ఏర్పడింది. సడన్ గ క్రిప్టోకరెన్సీ మార్కెట్లో సంభవించిన ప్రళయం వలన అనేక డిజిటల్ కరెన్సీ లు తమ ప్రభావాన్ని కోల్పోయాయి. చాలా డిజిటల్ కాయిన్స్ భారీ నష్టాలను చవిచూశాయి. వీటిలో టెర్రా లూనా క్రిప్టోకరెన్సీ భారీ పతనం దిశగా సాగింది. దీని విలువ చాలా వేగంగా పడిపోయింది.

అంతర్లీనంగా ఎటువంటి పటిష్టతా లేకుండా కేవలం విశ్వాసం, ఊహాగానాల ఆధారంగా విలువను పొందే ఏ ఇన్ మెంటైనా అది చివరకు తీవ్ర అనిశ్చితికే దారితీస్తుంది. తాజాగా టెర్రా బ్లాక్చెయిన్కు చెందిన టెర్రా- లూనా క్రిప్టోకరెన్సీ భారీ పతనం దీనికి ఉదాహరణ.

…కష్టాలు పాలైన లూనా క్రిప్టో కరెన్సీ.. ఏడు రోజుల వ్యవధిలో ఏకంగా 100 శాతం క్రాష్ అయింది. దీంతో లూనా కరెన్సీ విలువ ఒక్కసారిగా సున్నాకు పడిపోయింది.
మార్కెట్ వర్గాల అంచనాల ప్రకారం ఈ లూనా క్రిప్టో కాయిన్ మార్కెట్ విలువ దాదాపు 40 బిలియన్ డాలర్ల నుంచి 6 మిలియన్ డాలర్లకు తగ్గిపోయింది. లూనా కంటే దాని సిస్టర్ టోకెన్ యూఎస్టి పైనే ఆధారపడి పెట్టుబడిదారులు పెట్టుబడి పెట్టారు. అయితే లూనా కరెన్సీ యూఎస్టి నుంచి బయటకు రావడంతో లూనాపై అపనమ్మకం పెరిగిపోయి మార్కెట్ ఒక్కసారిగా దెబ్బతిన్నది. క్రమక్రమంగా పతనం ప్రారంభమై ఇప్పుడు సున్నాకు పడిపోయింది.

క్రిప్టోకరెన్సీ భారీ పతనానికి దారితీసిన అంశాలు:

> ఫండమెంటల్స్ లేని సాధనాలు
> స్థిరత్వం తక్కువ.. ఆటుపోట్లు ఎక్కువ
> నియంత్రణలేని చోట రిస్క్ అపరిమితం
> అంత రిస్క్ భరించే రిటైల్ ఇన్వెస్టర్లు తక్కువ
> ఈక్విటీ మార్కెట్లతో పోల్చుకోవద్దు.
> నియంత్రిత సాధనాలే మెరుగైన మార్గం

ఇవి స్వేచ్ఛా మార్కెట్లు కావాలంటే ఒకే రోజు నూరు శాతం పెరగగలవు. పడిపోగలవు. వీటిపై ఏ దేశ నియంత్రణ సంస్థకు నియంత్రణ లేదు. కొన్నివారాల కిందట బాగా ట్రేడ్ అయిన కరెన్సీ ఒక్కసారిగా పతనం అవడంతో పెట్టుబడి దారులు భారీగా నష్టపోయారు.

క్రిప్టో ఇన్వెస్టర్లు ఇప్పుడు అయోమయ పరిస్థితి ఎదుర్కొంటున్నారు. క్రిప్టో కరెన్సీలు భారీగా పడిపోవడం వల్ల లాభాల సంగతేమో కానీ, నష్టాలపాలైన వారే ఎక్కువగా ఉన్నారు. ఈక్విటీల మాదిరి మూలధన నష్టాలను, మూలధన లాభాలతో సర్దుబాటుకు క్రిప్టోల్లో అవకాశం లేదు. ఒక లావాదేవీలో లాభపడి, మరో లావాదేవీలో నష్టపోతే.. లాభం వచ్చిన మొత్తంపై 30 శాతం పన్ను కట్టాలని నూతన నిబంధనలు చెబుతున్నాయి.

క్రిప్టో కరెన్సీలు ఈ స్థాయిలో పడిపోతాయని ఒక్క ఇన్వెస్టర్ కూడా ఊహించి ఉండడు. ప్రధాన క్రిప్టో కరెన్సీలు గరిష్టాల నుంచి మూడింట రెండొంతుల మేర విలువను కోల్పోయాయి. ఇక చిన్న క్రిప్టోలు, మీమ్ కాయిన్ల పరిస్థితి మరింత దారుణం. 2017లో క్రిప్టో కరెన్సీల మార్కెట్ విలువ 620 బిలియన్ డాలర్లు. అక్కడి నుంచి 2021 నవంబర్ నాటికి అమాంతం 3 లక్షల కోట్ల డాలర్లకు దూసుకెళ్లింది. ఆ బెలూన్ బ్లాస్ట్ అవడం తో 2022 జూన్ నాటికి లక్ష కోట్ల డాలర్లకు కుప్పకూలింది
దీంతో ప్రపంచంలోనే అతిపెద్ద క్రిప్టో ఎక్స్చేంజ్ అయిన బినాన్స్ లూనాను డీలిస్ట్ చేసింది. గ్లోబల్ ఎక్స్చేంజీల నిర్ణయం తర్వాత లూనాతో పాటు వజీర్ఎక్స్, కాయిన్సీఎక్స్, కాయిన్స్వచ్ కుబేర్ లాంటి క్రిప్టో కరెన్సీలను ఇండిన్ ఎక్సేంజ్లు డీలిస్ట్ చేశాయి. క్రిప్టో కరెన్సీలో ఉన్న సంస్థలు అన్నీ ఇప్పుడు ఇబ్బందుల్లో ఉన్నాయి. బిట్ కాయిన్ రేటు రూ.22.85 లక్షలకు పడిపోయింది.

ప్రపంచంలోనే అతిపెద్ద క్రిప్టో కరెన్సీ బిట్ కాయిన్ ఇప్పుడు ఏకంగా 35 శాతం కుప్పకూలింది. కిందటి ఏడాది ఆల్ టైం రికార్డు సృష్టించిన 69 వేల డాలర్లు పలికిన బిట్ కాయన్ పతనం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. దీంతో యాక్టివ్ యూజర్ల సంఖ్య కూడా 19 శాతానికి తగ్గిపోయింది.

మరో క్రిప్టో కరెన్సీ అయిన ఇథీరియం రూ.1.66 లక్షల వద్ద పలుకుతోంది. టెథర్ ధర రూ.77 వద్ద ట్రేడ్ అవుతోంది. కార్డానో క్రిప్టో విలువ రూ.44 వద్ద కొనసాగుతోంది. బినాన్స్ కాయిన్ రేటు రూ.23.974 వద్ద కొనసాగుతోంది. ఎక్స్ట్రార్పి రేటు రూ.35 వద్ద పలుకుతోంది. ఇక డోజికాయిన్ ధర రూ.7 వద్ద కొనసాగుతోంది.
క్రిప్టో కరెన్సీలు, డెఫీలను అచ్చమైన ఫైనాన్షియల్ ఆవిష్కరణలుగా చూడడం కంటే.. నియంత్రణపరమైన మధ్యవర్తిత్వం అవసరం. అవి మరింత వికేంద్రీకృతమైతే, నియంత్రణ లేకపోతే.. అందరి దగ్గర ఉన్నవి ఎవరో ఒకరు లాగేసుకునే ప్రపంచంగా మారిపోవచ్చు.

ద్రవ్యోల్బనాన్ని నియంత్రిత స్థాయికి తీసుకొచ్చేందుకు సమీప కాలంలోనూ వడ్డీ రేట్లు ఇంకా పెరిగే అవకాశాలే ఉన్నాయి. దీంతో వ్యవస్థలో లిక్విడిటీ మరింత తగ్గుతుంది. దీనివల్ల ఇన్వెస్టర్లలో రక్షణాత్మక ధోరణి కనిపించొచ్చు. 2021లో క్రిప్టోలను కొనుగోలు చేసినట్టయితే ఇప్పటికే సగం మేర వారి పెట్టుబడి కరిగిపోయి ఉంటుంది.

బిట్కాయిన్, ఎథీరియం, సొలానా, కొన్ని మీమ్ కాయిన్లకు ఇనిస్టిట్యూషన్స్ మద్దతు అయితే ఉంది. మిగిలిన వాటిని ఎవరు నడిపిస్తున్నారు, ఎవరు ఇన్వెస్ట్ చేస్తున్నారు? ఎవరికీ తెలియదు. ప్రపంచవ్యాప్తంగా ఏ ప్రముఖ ఆర్థిక వ్యవస్థ కూడా క్రిప్టోకరెన్సీలను అనుమతించడం లేదు. క్రిప్టోలు, నాన్ ఫం డబుల్ టోకెన్లకు నేపథ్యంగా ఉన్న బ్లాక్చైన్ సాంకేతికత ద్వారా పనిచేస్తున్నాయి.

క్రిప్టోలు అనియంత్రిత సాధనాలు. వీటిపై ప్రపంచవ్యాప్తంగా కేంద్ర బ్యాంకులు, ప్రభుత్వాల చర్యల ప్రభావం ఉంటుంది. ఆ మధ్య చైనా సైతం క్రిప్టో మైనింగ్పై కఠిన ఆంక్షలు పెట్టడం గుర్తుండే ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం విధించిన పన్ను కూడా ఇన్వెస్టర్లలో నిరుత్సాహానికి దారితీసినట్టు మార్కెట్ పరిశీలకులు చెబుతున్నారు. క్రిప్టో మార్కెట్లలో ఈ విధమైన ధోరణి కొంత కాలం పాటు కొనసాగుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు అందుకే పెట్టుబడులను ఎప్పుడూ జూదం కోణంలో చూడకూడదు. దీర్ఘకాల దృష్టిలో, తమ రిస్క్ సామర్థ్యం ఆధారంగా సరైన సాధనాల్లో పెట్టుబడులు పెట్టుకుంటేనే సంపద సాధ్యపడుతుంది.
ఇవి క్రిప్టో కరెన్సీకు తప్పని డిజిటల్ కష్టాలు.

What do you think?

మీకు టెర్మినల్ మాన్ తెలుసా? అతనిక లేడు.

సారూ!ఈ తిండి ఎలా తింటారు? – పోలీస్.