in

సారూ!ఈ తిండి ఎలా తింటారు? – పోలీస్.

సారూ!ఈ తిండి ఎలా తింటారు?- పోలీస్.

పోలీస్ అంటే ఎలా ఉండాలి ? కటౌట్ చూడగానే సెల్యూట్ చేయాలనిపించాలి. పరుగుపెట్టి వెంబడించాడంటే దొంగోడు దొరికి తీరాల్సిందే. బాడీ ని చూసి దొంగోళ్ళు కు చుక్కలు కనిపించాల్సిందే. మరి ఆలా తయారవ్వాలంటే మామూలు విషయం కాదుగా. బలం ఉన్న తినాలి, బాడీ లో స్ట్రెంగ్త్ పెంచుకోవాలి. ఇదంతా ఎందుకంటే… తిండి.

ప్రతి మనిషి పొద్దుటనుండి సాయంత్రం వరకు కష్టపడినా, పని చేసినా.. ఉద్యోగం చేసినా ఎందుకు ? కడుపునిండా అన్నం తినేందుకే కదా. ఉన్నంత లో మంచి పౌష్టికాహారం తినాలనుకుంటాడు. ఇక పోలీస్ డిపార్ట్మెంట్ లో లేదా ఆర్మీ లో ఉద్యోగం చేసే వాళ్లకయితే తిండి ఖచ్చితంగా అవసరం. అది కూడా మంచి ప్రోటీన్ ఫుడ్ అవసరం. అలాంటిది ఆ తిండి సరిగ్గా పెట్టకపోతే ఎన్ని ఇబ్బందులు పడతారో.

 

ఉత్తరప్రదేశ్ లో జరిగిందీ ఘటన…..

పెద్ద ఇబ్బంది ఎదురైంది ఉత్తరప్రదేశ్ లోని ఈ పోలీస్ కి. అధికారులను ఎంత వేడుకున్నా కనికరించలేదేమో తన ఆవేదనను కన్నీళ్ల రూపం లో బయటపెట్టాడు సారూ! ఈ తిండి ఎలా తింటారు? అంటూ రోడ్ పైకి వచ్చి ఎక్కి ఎక్కి ఏడ్చాడు.

ఫిరోజాబాద్ లో పోస్ట్ చేయబడిన అలీఘర్ నివాసి అయిన మనోజ్ కుమార్ ఫిరోజాబాద్ లోని పోలీస్ మెస్ లో తమకు అందించే ఆహారం అస్సలు బాగుండలేదంటూ పిర్యాదు చేసినా ఉన్నతాధికారులు పట్టించుకోవట్లేదని ఆవేదన వ్యక్తం చేసాడు కోర్టు వద్ద భద్రతా విధులు నిర్వర్తిస్తున్న కానిస్టేబుల్ మనోజ్ కుమార్ తన భోజనం ప్లేట్ తో రోడ్ పైకి వచ్చి తన గోడు వెళ్లబోసుకున్నాడు. పోలీస్ డిపార్ట్మెంట్ లో వినడానికి ఎవరూ లేరు. పోలీసు ఉన్నతాధికారులు తమ సమస్యలు వినడం లేదు అందుకే ఇక్కడ నిరసన తెలుపుతున్నాను అని ఆయన పేర్కొన్నారు.

 

కానిస్టేబుళ్లకు పోషకాహారం కోసం 1875 రూపాయలు ఇస్తామన్న యూపి.సి ఎం యోగి ఆదిత్యనాథ్ హామీ ఏమైందని ప్రశ్నించాడు? ఇదంతా సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ మరియు డిసిపి చేసిన స్కామ్ అంటూ సంచలన ఆరోపణలు చేశాడు.. వారివల్లే పోలీసు సిబ్బందికి నాణ్యత లేని ఆహారం అందించబడుతుందని కానిస్టేబుల్ తీవ్ర ఆవేదనతో పేర్కొన్నాడు తనకు మరియు ఇతర తక్కువ స్థాయి సిబ్బందికి అందించే ఆహారం నాణ్యత గురించి ఫిర్యాదు చేయడంతో మెస్ మేనేజర్ తనను ఉద్యోగం నుండి తొలగిస్తానని బెదిరించాడని పేర్కొన్నాడు.

 

రోజుకు పన్నెండు గంటలు కష్టపడి డ్యూటీ చేస్తున్న మాకు ఇలాంటి భోజనం పెడతారా ? దీన్ని ఎవరైనా తినగలరా ? అంటూ నడి రోడ్ పై బోరున విలపించాడు. ఈ వీడియో వైరల్ కాగా సీనియర్ ఎస్ పి ఆశిష్ తివారి దర్యాప్తునకు ఆదేశించారు.

మనోజ్ కుమార్ పై క్రమశిక్షణా రాహిత్యం, విధులకు గైర్హాజరు సహా మొత్తం పదిహేను కేసులు పెండింగ్ లో ఉన్నాయని వాటి సంగతి కూడా తేల్చాలని సి ఐ ను ఆదేశించారు. ఇక ఈ వీడియో చూసిన నెటిజెన్ లు వీడియో షేర్ చేస్తున్నారు. కష్టపడి డ్యూటీ లు చేసేది ఆ తిండి కోసమే కదా. అదికూడా పెట్టకపోతే ఎలా సారూ? అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

What do you think?

క్రిప్టో కరెన్సీ కు తప్పని డిజిటల్ కష్టాలు….

ఈడి, సిఐడి, ఐటీలు ప్రభుత్వ రాజకీయ బ్రహ్మాస్త్రాలా?