in ,

ఈడి, సిఐడి, ఐటీలు ప్రభుత్వ రాజకీయ బ్రహ్మాస్త్రాలా?

ఈడి, సిఐడి, ఐటీ

దక్షిణాది రాష్ట్రాలలో గత కొంత కాలం గ నిశితంగా గమనిస్తే బి.జె.పి రాజకీయ వ్యూహం స్పష్టం గా అర్ధమవుతుంది. తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ సహా మహారాష్ట్ర, వెస్ట్, బెంగాల్ లో ఈ డి సి బి ఐ హల్ చల్ చేస్తున్నాయి. బి జె పి చేతుల్లో పావులుగా మారిన కేంద్ర దర్యాప్తు సంస్థలు సెలెక్టివ్ గ కొందరు నేతలను టార్గెట్ చేస్తున్నాయి. నేషనల్ హెరాల్డ్ కేస్ లో ఈ డి సోనియా, రాహుల్ గాంధీ ని గంటలు గంటలు విచారించడం తో వేడి మొదలైంది. దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తున్నారన్న అంశం పై మరో సారి దేశం లో చర్చ మొదలైంది.

కర్ణాటక కాంగ్రెస్ ప్రెసిడెంట్ డి కె శివకుమార్ ను అవినీతి కేసుల పేరుతో ఈ డి వేధిస్తుంది. ఇటీవల రాహుల్ గాంధీ ప్రారంభించిన భారత్ జోడో యాత్రలో పాల్గొన్న మర్నాడు. అతనిని ఈ డి విచారించింది.

ఢిల్లీ డిప్యూటీ సి ఎం సిసోడియా నివాసం లో సోదాలు మొదలుకుని బీహార్ లో నితీష్ కుమార్ ప్రభుత్వం బల పరీక్షకు సిద్ధమయిన కొన్ని గంటల ముందు ఆర్ జె డి సీనియర్ నేతల నివాసాల పై సి బి ఐ దాడులు చేయడం వరకు ఏది చుసిన అలానే అనిపిస్తుంది. సి బి ఐ, ఈ డి రాజకీయ అస్త్రాలుగా కేంద్రం చేతిలో కీలు బొమ్మలవుతున్నాయా? గతం లో కాంగ్రెస్ కూడా అదే చేసిందా..?

సాధారణం గ దర్యాప్తు సంస్థలు ఎం చేస్తాయి. అన్యాయాలకు , అక్రమాలకు తావులేకుండా ప్రజాస్వామ్యం నాలుగు పాదాలపై నడిచేందుకు సహకరిస్తాయి. వాస్తవం గ చూస్తే దర్యాప్తు సంస్థల ప్రభుత్వాల చేతిలో బ్రహ్మాస్త్రాలుగా మారుతున్నాయనే సంకేతాలు కనిపిస్తున్నాయి. గత కొంత కాలం గ దక్షిణాది రాష్ట్రాల లోని పలువురు నేతలపై జరుగుతున్న ఈ డి దాడులే ఇందుకు నిదర్శనం. మరో వైపు ఢిల్లీ లోను లిక్కర్ స్కాం పై సి బి ఐ, ఈ డి దాడులు దేశవ్యాప్తం గ కల కలం సృష్టిస్తున్నాయి. దీనికి లింక్ లు ఢిల్లీ తో పాటు పంజాబ్, ఏ పి, తెలంగాణ లోను ఉన్నాయన్నది బి జె పి నేతల ప్రధాన ఆరోపణ. ఈ నాలుగు రాష్ట్రాల లోను బి జె పి ప్రతిపక్షం లోనే ఉంది.

అందులో భాగం గానే దక్షిణాది రాష్ట్రాలను టార్గెట్ చేసింది. దక్షిణాదిన పాగా వేసేందుకు ప్రాంతీయ పార్టీలను లక్ష్యం గ చేసుకుంది. తెలంగాణ రాష్ట్రము లో బలమైన నేతగా పేరుగాంచిన ఎంఎల్ సి కవితను టార్గెట్ చేసింది. గతం లో నిజామాబాద్ ఎం పి గ ఎన్నో సమస్యల పై పార్లమెంట్ లో గళమెత్తారు. అందుకే ఇప్పుడు కేంద్రం లోని బి జె పి సర్కార్ ఎం ఎల్ సి కవిత పై అక్రమ కేసులు బనాయించి, లిక్కర్ స్కాం లో ఇరికించి బ్లాక్ మెయిల్ రాజకీయాలకు పాల్పడుతుంది.

లిక్కర్ స్కాం బయట పడిన తర్వాత ఇలాంటి అంశాలు చాలానే బయటకు వచ్చాయి. అలాగని లిక్కర్ స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారి మాటలు నిజాలై పోవు.

తమిళనాడు లో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి డి ఎం కె అధినేత స్టాలిన్ ను సైతం పరోక్షం గ ఎటాక్ చేస్తుంది. అందులో భాగం గానే స్టాలిన్ మేనల్లుడైన శబరీషన్ కు సంబంధించి కంపెనీ లు ఇళ్లల్లో ఐ టీ శాఖ దాడులు నిర్వహించింది. దక్షిణాదిన మరొక బలమైన నేతగా పేరుగాంచిన కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్ ను కూడా బి జె పి టార్గెట్ చేసింది.

అటు పశ్చిమ బెంగాల్ ఈస్టర్న్ గోల్డ్ ఫీల్డ్ కు సంబంధించిన కేసులో మమతా బెనర్జీ మేనల్లుడు పై సి బి ఐ 2020 లో ఎఫ్ ఐ ఆర్ నమోదు చేస్తే ఈ కేస్ దర్యాప్తు ఈ డి మొదలు పెట్టింది.కేంద్రాన్ని ఢీకొడుతున్న అందరి పైన ఆటోమాటిక్ గ సి బి ఐ , ఈ డి దాడులు జరుగుతున్నాయి. పాత కేస్ లు దుమ్ము దులిపి మరీ కొత్త కేస్ లు నమోదు చేస్తున్నారు. ఇదంతా చూస్తుంటే దర్యాప్తు సంస్థల దర్యాప్తు పక్క దోవ పడుతుందని అనుమానం రాక మానదు..

బిజెపి అధికారం లోకి రాకముందు 2005 నుండి 2014 వరకు జరిగిన ఈ డి రైడ్స్ నూట పన్నెండు అయితే బి జెపే అధికారం లోకి వచ్చిన తర్వాత అంటే 2014 నుండి 2022 వరకు పెట్టిన కేస్ ల సంఖ్య మూడువేలకు పైగా ఉందనేది టీ ఆర్ ఎస్ వాదన. ఇవన్నీ వింటుంటే అసలు ప్రతిపక్ష నేతలంతా మిస్టర్ క్లీన్ గ ఉంటారా. అసలు తప్పు చేయకపోతే బయపడాలసిన అవసరం ఏముంది.

ఈ డి ని పంపిస్తే ఏంటి, సి బి ఐ ని పంపిస్తే ఏంటి. ఐటీ ని పంపిస్తే ఏంటి కేస్ లు పెట్టగలరు కానీ ఆధారాలనైతే సృష్టించలేరు కదా కాకపోతే ఈ కేస్ లో విచారణ సమయం లో ఆయా ప్రత్యర్థులకు జరగలసిన డామేజి జరిగి పోతుంది. మరి ఇలాంటి తప్పులు ప్రస్తుత ప్రభుత్వం మాత్రమే చేస్తుందా. అంటే కానే కాదు కాంగ్రెస్ హయం లోను సి బి ఐ పంజరం లో చిలుక అనే వాదన బలం గ వినిపించింది. అంటే దొందు దొందే నన్నమాట. ప్రజాస్వామ్యం లో ఇలాంటి పరిణామాలు ఏమాత్రం మంచివి కావు. దర్యాప్తు సంస్థలను తమ స్వార్ధ రాజకీయ ప్రయోజనాల కోసం వినియోగించుకుంటే రేపొద్దున అధికారం చేజారినపుడు అదే బూమ్ రంగ్ అవుతుంది.

What do you think?

సారూ!ఈ తిండి ఎలా తింటారు? – పోలీస్.

మహా నవలా రాజం – వీరగాథ– ‘పొన్నియిన్ సెల్వన్’