in

భారత్లోని ఆ సిరప్ సురక్షితం కాదు-డబ్ల్యూహెచ్వో

భారత్లోని ఆ సిరప్ సురక్షితం కాదు-డబ్ల్యూహెచ్వో

భారత్ లో తయారైన ఓ దగ్గు మందు సురక్షితం కాదని ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ వో హెచ్చరికలు జారీ చేసింది. ఆ మందులో డైథిలీన్, ఇథలీన్ గ్లైకాల్లు మోతాదు పరిమితికి ఉన్నట్లు తెలిపింది.

వివరాల్లోకి వెళ్తే ‘కోల్డ్ అవుట్ ‘ పేరుతో జలుబు, దగ్గు నివారణ కోసం రూపొందించిన సిరప్ లో పరిమితికి మించి డైథిలీన్, ఇథలీన్ గ్లైకాల్లు ఉన్నట్లు డబ్ల్యూహెచ్వో తెలిపింది.

చెన్నైకి చెందిన ఫోర్బ్స్ లేబోరేటరీస్ (Fourrts Laboratories), ఇరాక్ లోని డాబిలైఫ్ ఫార్మా కోసం ఈ దగ్గు మందును తయారు చేసింది. ఇరాక్ లో ఉపయోగిస్తున్న ‘కోల్డ్ అవుట్’ నమూనాల్లో డైథిలీన్, ఇథలీన్ గ్లైకాల్లు పరిమితికి మించి ఉన్నట్లు గుర్తించామని డబ్ల్యూహెచ్ వో వెల్లడించింది. దీని వినియోగం ఏ మాత్రం సురక్షితం కాదని, ముఖ్యంగా చిన్నపిల్లలు ఈ మందును ఉపయోగిస్తే తీవ్ర అస్వస్థతకు గురై చనిపోయే అవకాశం ఉందని డబ్ల్యూహెచ్వో హెచ్చరించింది.

అయితే అంతకముందు కామెరూన్లో చిన్నారుల మృతికి కారణమైన దగ్గు మందు తయారు చేసిన రీమాన్ ల్యా సిరప్ తయారీలో నాణ్యత పాటించలేదని విచారణలో తేలగా.. గతంలో కూడా భారత్ లో తయారైన దగ్గు మందుల మూలంగా ఉజ్బెకిస్థాన్లోని గాంబియాలో 89 మంది చిన్నారులు మృతి చెందారు. దీంతో సిరప్ ను ఉజ్బెకిస్థాను సరఫరా చేసిన మరియోన్ బయోటెక్ కంపెనీ అనుమతులను భారత్ ప్రభుత్వం రద్దు చేసింది.

What do you think?

ముకేష్ అంబానీ జీతం ఎంతో తెలుసా? కోట్లు కాదు O.

బిడ్డను విసిరేస్తామని బెదిరించి అత్యాచారానికి పాల్పడిన కామాంధులు