in

ముకేష్ అంబానీ జీతం ఎంతో తెలుసా? కోట్లు కాదు O.

ముకేష్ అంబానీ జీతం ఎంతో తెలుసా? కోట్లు కాదు O.

దేశంలో అత్యంత సంపన్నులు ఎవరు? అన్న ప్రశ్న వస్తే ముందుగా వినిపించే పేరు ముఖేష్ అంబానీ. ఆయన ప్రస్తుతం మన దేశంలోని సంపన్నులలో అగ్రస్థానంలో ఉన్నారు. అలాంటి ఆయన వార్షిక వేతనం ఎన్ని కోట్లు ఉంటుందో అని అందరూ అనుకుంటుంటారు. కానీ ఆయన అసలు వేతనం తీసుకోవడం లేదట.

ముఖేష్ అంబానీ 2020 వరకు రూ.15 కోట్లు వార్షిక జీతం తీసుకునే వారు. అయితే కరోనా తర్వాత ఆయన జీతం తీసుకోవడం మానేశారు. అలా 2021 కరోనా సమయం నుంచి ఇప్పటివరకు ఆయన ఎటువంటి వేతనం తీసుకోలేదు. ఇక మీదట కూడా ఇదే కొనసాగిస్తారని తెలుస్తోంది.

అయితే ప్రస్తుతం రిలయన్స్‌కు చైర్మన్‌గా కొనసాగుతున్న ముకేష్ పదవీకాలం త్వరలోనే ముగియనుండగా.. ఆయన ఇంకో ఐదేళ్లు పదవిలో కొనసాగాలని వాటాదార్లు కోరుతున్నట్లు సమాచారం.

What do you think?

వారికి రూ. 5 లక్షలు ఇవ్వనున్న ఏపీ సీఎం జగన్!

భారత్లోని ఆ సిరప్ సురక్షితం కాదు-డబ్ల్యూహెచ్వో