in

ఏపీలో ఏ పార్టీ గెలిచినా బీజేపీ వెంటే…. బీజేపీనే బలమైన పార్టీ – ఉండవల్లి అరుణ్ కుమార్

ఒకప్పుడు ఉండవల్లి అరుణ్ కుమార్ కాంగ్రెస్ పార్టీ లో కీలక వ్యక్తిగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ కి చెందినటువంటి రాజకీయనేత అయినప్పటికీ కూడా కేంద్రం లెవెల్లో చక్రం తిప్పినటువంటి రాజకీయ నాయకుడు ఉండవల్లి అరుణ్ కుమార్. ఇప్పటికి కూడా అడపా దడపా రాజకీయ విశ్లేషణలు, రాజకీయ కామెంట్స్ కూడా చేస్తుంటారు. ఈ నేపథ్యం లో అయన, దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలనుకుంటున్న తెలంగాణ సి ఎం కే సి ఆర్ తో భేటీ అయినతరువాత జరిగిన పరిణామాల అనంతరం అయన మాటల్లో .. “ఇండియాలో ఉన్న అన్ని రాష్ట్రాలలో కంటే ఏపీ లోనే బీజేపీ స్ట్రాంగ్ గా ఉంది తెలుసా” – నిజమేనా?

ఏపీలో బలోపేతం అయ్యేందుకు బీజేపీ గత రెండు దశాబ్దాలుగా ప్రయత్నాలు చేస్తూనే ఉంది. కానీ ఆ పార్టీలోని కొందరు నేతల కారణంగా బీజేపీ ఇప్పటికీ నామమాత్రంగానే కనిపిస్తోంది. గత ఎన్నికల్లో పోటీ చేసి డిపాజిట్లు కోల్పోయిన బీజేపీ, మరోసారి 2024లోనూ అదే ఫీట్ రిపీట్ చేసేలా కనిపించింది. కానీ ఇప్పుడు ఉండవల్లి చేసిన వ్యాఖ్యలు నిజమే అన్నట్లుగా కనిపిస్తుంది.

ఏపీలో బీజేపీ పరిస్థితి కేంద్రంలో వరుసగా రెండుసార్లు భారీ మెజారిటీతో అధికారం దక్కించుకున్న బీజేపీ ఉత్తరాది రాష్ట్రాలతో పాటు తమకు అస్సలు పట్టు లేని ఈశాన్య రాష్ట్రాలు, దక్షిణాదిన కర్ణాటక వంటి రాష్ట్రాల్లోనూ పాగా వేయగలిగింది. కానీ ఏపీ, తమిళనాడు, కేరళ, ఒడిషా వంటి దక్షిణాది రాష్ట్రాల్లో మాత్రం అస్సలు పట్టు చిక్కడం లేదు. ముఖ్యంగా ఏపీలో కనీసం సొంతంగా ఓ ఎమ్మెల్యే సీటు గెల్చుకునే పరిస్థితుల్లో కూడా బీజేపీ లేదు.

మరి ఏపీలో అత్యంత బలంగా బీజేపీ ?

ఏపీలో కనీసం కార్పోరేటర్ సీటు కూడా గెల్చుకోలేని పరిస్థితుల్లో ఉన్నప్పటికీ బీజేపీ మాత్రం అత్యంత బలంగా ఉందనే ఓ వాదన వినిపిస్తోంది. అదెలా అంటే తమకు ఏమాత్రం జనం మద్దతు, ప్రజాప్రతినిధులు లేనప్పటికీ కేంద్రంలో తమ పార్టీకి ఇక్కడి ప్రాంతీయ పార్టీలన్నీ ఏకతాటిపైకి వచ్చి మద్దతుగా నిలుస్తుండమే. దీంతో పార్లమెంటులో కీలక బిల్లులైనా, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలైనా బీజేపీ ఏపీ నుంచి సునాయాసంగా మద్దతు పొందుతోంది. ఇక్కడి రాజకీయ పార్టీలు కూడా బీజేపీతో పోరాడి లాభం లేదని గ్రహించి కాషాయ గూటిలో అనధికారికంగా చేరిపోయాయి.

ఈ సందర్భంగా ఉండవల్లి కీలక వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. తెలంగాణ సీఎం కేసీఆర్ జాతీయ పార్టీకి సంబంధించి చర్యలు జరిపేందుకు హైదరాబాద్ వెళ్లిన కాంగ్రెస్ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్.. బీజేపీకి వ్యతిరేకంగా బలమైన విపక్షం అవసరమని చెప్పారు. అదే క్రమంలో దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీలో బీజేపీ అత్యంత బలంగా ఉందన్నారు. ఇక్కడి అధికార వైసీపీ, విపక్ష టీడీపీ, జనసేన మద్దతుతో బీజేపీ పటిష్టంగా కనిపిస్తోందన్నారు. జాతీయస్థాయిలో కీలక అంశాల్లో ఏపీ సాయం బీజేపీకి సులువుగా దొరుకుతోందన్నారు. దీంతో బీజేపీ గూటిలో వైసీపీ, టీడీపీ ఎలా చేరిపోయాయో ఉండవల్లి స్పష్టంగా చెప్పినట్లయయింది.

రాష్ట్రపతి ఎన్నికలతో మరోసారి

గతంలో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలతో పాటు పార్లమెంటులో వివాదాస్పద వ్యవసాయ చట్టాల విషయంలోనూ వైసీపీ, టీడీపీ బీజేపీకి అండగా నిలిచాయి. ఆ తర్వాత ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత రావడంతో మౌనంగా ఉండిపోయాయి. ఇప్పుడు మరోసారి రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లోనూ వైసీపీ, టీడీపీ ప్రజాప్రతినిధులు బీజేపీ నిలబెట్టే అభ్యర్థికి మద్దతిచ్చాయి. తద్వారా బీజేపీ అభ్యర్థి రాచమార్గంలో గెలిచారు. దీంతో ఏపీలో తనకున్న బలాన్ని జాతీయ స్థాయిలో బీజేపీ మరోసారి నిరూపించుకునేందుకు కూడా వీలు దొరికింది.

ఇంకా ఉండవల్లి అరుణ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ బీజేపీ విధానాలు దేశానికి నష్టం కలిగిస్తాయని చెప్పారు. బీజేపీకి వ్యతిరేకంగా ఎవరూ మాట్లాడలేని పరిస్థితులు తెచ్చారని వాపోయారు. ఎవరైనా మాట్లాడితే దర్యాప్తు సంస్థలను పంపుతున్నారని పేర్కొన్నారు. ఇలాంటి సమయంలో బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్న కేసీఆర్ కు బీజేపీ వ్యతిరేకులంతా మద్దతివ్వాల్సిన అవసరం ఉందన్నారు.

ఏపీలో ఏ పార్టీ గెలిచినా బీజేపీ వెంటే ఉంటాయని తెలిపారు. ఏపీలో బీజేపీని వ్యతిరేకించే పార్టీలు లేవన్నారు. ఏపీలో అన్ని పార్టీల కంటే బీజేపీనే బలమైన పార్టీగా చెప్పిన ఉండవల్లి.. ఏపీలోని పాతిక మంది ఎంపీలు ఏ పార్టీ వారైనా సరే.. వారందరిని బీజేపీ ఎంపీలుగానే ఉండవల్లి అభివర్ణించటం విశేషం.

ప్రధానమంత్రి మోడీని వ్యతిరేకించే వారిలో తెలంగాణ సీఎం కేసీఆరే బలమైన నేతగా ఉన్నారన్న ఉండవల్లి.. తాను బీజేపీకి వ్యతిరేకం కాదని.. ఆ పార్టీ విధానాల్ని మాత్రమే తాను వ్యతిరేకిస్తానని స్పష్టం చేశారు.

ఇప్పుడున్నట్లుగా బీజేపీ విధానాలు ఇదే తీరులో పెరిగితే మున్ముందు ప్రమాదమని.. ఈ అంశం మీదనే ప్రధానంగా చర్చ జరిగినట్లు వెల్లడించారు. కేంద్రంలో బీజేపీకి వ్యతిరేకంగా పని చేసే దిశగా కేసీఆర్ సుదీర్ఘ కసరత్తే చేసినట్లుగా కితాబు ఇవ్వటం గమనార్హం. కీలక భేటీకి సంబంధించిన విషయాల్ని పూస గుచ్చినట్లుగా చెప్పిన ఉండవల్లి వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి.

What do you think?

98 Points
Upvote Downvote

ఈడి, సి ఐ డి, ఐటీ వంటి స్వతంత్ర దర్యాప్తు సంస్థలు ప్రభుత్వ రాజకీయ బ్రహ్మాస్త్రాలా?

“ఏటీఎమ్”తో హరీష్ శంకర్ ఓ.టీ.టీ లోకి..