in

రూ.1000 కోట్లు దాటిన విరాట్ కోహ్లీ నికర ఆస్తి!

రూ.1000 కోట్లు దాటిన విరాట్ కోహ్లీ నికర ఆస్తి!

 

విరాట్ కోహ్లీ నికర ఆస్తి విలువ ఇప్పుడు రూ.1000 కోట్లు దాటింది. ఈ విషయాన్ని ఇన్వెస్టింగ్ రీసెర్చ్ కంపెనీ స్టాక్ గో ఇటీవలే వెల్లడించింది.

కోహ్లీ టీమ్ ఇండియా కాంట్రాక్టుల్లో ఏ ప్లస్ (A+) కేటగిరీలో ఉండడంతో బీసీసీఐ ఆయనకి ఏడాదికి రూ.7 కోట్లు చెల్లిస్తోంది. దీంతో పాటు విరాట్ ప్రతి టెస్టుకి రూ.15 లక్షలు, టీ20 కి రూ.3 లక్షలు, వన్ డే కి రూ.6 లక్షలు పొందుతున్నారు. ప్రతి సంవత్సరం ఐపీఎల్ లో కోహ్లీకి రాయల్ ఛాలెంజర్స్ ఆఫ్ బెంగుళూరు (ఆర్వీబీ) రూ.15 కోట్లు ఇస్తుంది. ఇది కేవలం క్రికెట్ ఆడటం వల్ల విరాట్ కు వస్తున్న డబ్బు.

ఇక ఎంఆర్ఎఫ్, మింత్రా, వీవో, ఉబెర్ వంటి పెద్ద పెద్ద బ్రాండ్ లకు ఎండార్స్ మెంట్లు చేస్తూ కోహ్లీ ఏడాదికి రూ. 175 కోట్లు ఆర్జిస్తున్నారు.

మరో వైపు 25 కోట్ల ఫాలోవర్లు ఉన్న సోషల్ మీడియా అకౌంట్ ఇన్స్టా గ్రామ్ (Instagram) నుంచి పోస్టుకు 8.9 కోట్లు, 5 కోట్ల ఫాలోవర్లు ఉన్న ట్విట్టర్ నుంచి పోస్టుకు 2.5 కోట్లు పొందుతున్నారు.
దీంతో ఆయన ప్రస్తుత నికర ఆస్తి విలువ రూ.1,050 కోట్లకు చేరింది.

What do you think?

బాపట్ల అమర్నాథ్ కుటుంబానికి రూ.10 లక్షలు పరిహారం..

గత జన్మ గురించి చెబుతూ ఆశ్చర్య పరుస్తున్న బాలుడు