in

బాపట్ల అమర్నాథ్ కుటుంబానికి రూ.10 లక్షలు పరిహారం..

బాపట్ల అమర్నాథ్ కుటుంబానికి రూ.10 లక్షలు పరిహారం..

 

అమర్నాథ్ మృత దేహాన్ని రాజవోలు తరలిస్తుండగా టీడీపీ నేతలు, స్థానికులు అడ్డుకుని రాస్తారోకో నిర్వహించారు. బాధిత కుటుంబానికి రూ.10 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

వివరాల్లోకి వెళ్తే బాపట్ల జిల్లా ఉప్పలవారిపాలంలో పదో తరగతి చదువుతున్న అమర్నాథ్ అనే బాలుడిని పెట్రోల్ పోసి కాల్చి చంపిన విషయం తెలిసిందే. తన సోదరిని వేధిస్తున్నాడని ప్రశ్నించినందుకు వెంకటేశ్వర రెడ్డి అనే యువకుడు బాలుడి పై పెట్రోల్ పోసి చంపిన ఘటన సంచలనం సృష్టించింది.

ఆయితే బాలుడి మృతదేహాన్ని రాజవోలు తీసుకువస్తుండగా మార్గం మధ్యలో చెరుకుపల్లి దగ్గర టీడీపీ నేతలు, స్థానికులు అడ్డుకుని మృతదేహాన్ని జాతీయ రహదారిపై ఉంచి ఆందోళనకు దిగారు. బాధిత కుటుంబానికి రూ.25 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ వాహన రాకపోకలను అడ్డుకున్నారు. 3 గంటలపాటు జాతీయ రహదారిపై వాహనాలు నిలిచివేశారు. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ అవ్వడంతో రేపల్లె ఆర్డీవో పార్థసారథి చెరుకుపల్లి చేరుకొని కలెక్టర్‌తో ఫోన్‌లో ఆందోళన గురించి మాట్లాడారు.

బాధిత కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ.10 లక్షల ఆర్థిక సాయం, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, ఇంటి స్థలం ఇస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు. కలెక్టర్ హామీతో టీడీపీ నేతలు, స్థానికులు ఆందోళన విరమించారు. బాలుడి మృతదేహాన్ని ఉప్పాలవారిపాలం తరలించి అంతిమ సంస్కారాలు నిర్వహించారు.

What do you think?

జండా పీకేసి కాంగ్రెస్ లో కలిసిపోతున్న షర్మిల!

రూ.1000 కోట్లు దాటిన విరాట్ కోహ్లీ నికర ఆస్తి!