జండా పీకేసి కాంగ్రెస్ లో కలిసిపోతున్న షర్మిల!
వైఎస్ షర్మిల తన పార్టీ జండాను పీకేస్తున్నారట. తన వైఎస్సార్‌టీపీ పార్టీని మరో పార్టీలో విలీనం చేయబోతున్నారట.
ఏపీ సీఎం వైఎస్ జగన్ సోదరి, వైఎస్సార్‌టీపీ (ysrtp) పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తన పార్టీని మరో పార్టీలో విలీనం చేస్తున్నారని సమాచారం. 2021లో నెలకొల్పిన ఈ వైఎస్సార్‌టీపీని ఇప్పుడు షర్మిల కాంగ్రెస్ పార్టీ లో విలీనం చేస్తున్నారట. ఇప్పటికే కాంగ్రెస్ అధిష్టానం షర్మిలకు లైన్‌క్లియర్ చేసినట్లు తెలుస్తుండగా.. కేవీపీ రామచంద్రరావు మధ్యవర్తిత్వంలో ఈ ప్రక్రియ కొనసాగిందట. వైఎస్ షర్మిల ఖమ్మం జిల్లా పాలేరు నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేయనున్నారని సమాచారం. దీనికి కాంగ్రెస్ హైకమాండ్ కూడా గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
అయితే ఇదిలా ఉండగా మరో పక్క తెలంగాణ జన సమితి (TJS) పార్టీ అధ్యక్షుడు ప్రొ.కోదండరామ్ కూడా ఆ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయనున్నారని సమాచారం.