in

ఘరానా దొంగ కింగ్ ‘ ఫినిషర్ ‘ – మాల్యా

ఘరానా దొంగ కింగ్ ‘ ఫినిషర్ ‘ – మాల్యా

లక్ష కోట్లకు పైగా ఆస్తులున్నా విజయమాల్యా ఎందుకింతలా దిగజారిపోయాడు. ఒకప్పుడు కింగ్ ల వెలిగినోడు ఎందుకిలా దివాళా అయ్యాడు.

అసలు కింగ్ ఫిషర్ సృష్టి కర్త దాని’ ఫినిషర్’ గ ఎందుకు మారాడు?

కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్, యునైటెడ్ బెవరీస్, రాయల్ చాలెంజర్స్ అఫ్ బెంగళూరు. F1 రేస్ లో వాటా ఇలా చెప్పుకుంటూ పోతే విజయమాల్యా ఆస్తులు ఎన్నో అనిపిస్తుంది. ఎన్ని ఆస్తులున్నా అంతకు మించి క్రిమినల్ బ్రెయిన్ కూడా ఉంది. దాంతోనే బ్యాంకు లను బురిడీ కొట్టించాడు. అసలు బ్యాంకులను ఎలా ముంచాడు డీఫాల్టర్ గ ఎలా మారాడు. శిఖరం నుండి అధః పాతాళానికి ఎలా జారాడు.

విజయ్ మాల్యా ఒక పెద్ద బిజినెస్ ఫామిలీ లో పుట్టాడు. తండ్రి పేరు విట్టల్ మాల్యా. 1983 లో విట్టల్ మాల్యా చనిపోయిన తర్వాత యూ బి గ్రూప్ లో తన తండ్రి స్థానం లో 350 కోట్ల టర్నోవర్ కంపెనీ కి చైర్మన్ అయ్యారు. కింగ్ ఫిషర్ కేలండర్లు, లైఫ్ స్టైల్, ఈవెంట్స్ ఇలా చాలా టెక్నీక్స్ యూస్ చేసి పబ్లిక్ అటెన్షన్ ను తన వైపుకు తిప్పుకున్నారు. సక్సెస్ దిశగా కంపెనీని నడిపించారు. మార్చ్ 2005 లో యూ బి గ్రూప్ వరల్డ్ సెకండ్ లార్జెస్ట్ లిక్కర్ మేకర్ గా ఎదిగింది. 2007 లో విజయ్ మాల్యా పేరు ఫోర్బ్స్ లిస్ట్ 40 th వరల్డ్ రిచెస్ట్ పర్సన్ గా ప్రచురించింది. విజయ్ మాల్యా ఈ సక్సెస్ వలన విదేశీ యూనివర్సిటీ డాక్టరేట్ కూడా ఇచ్చింది.

2005 వరకు విజయ్ మాల్యాకు బిజినెస్ రంగం లో తిరుగు లేకుండా పోయింది ఆ తర్వాత అయన ఎయిర్లైన్స్ రంగం లో కి అడుగుపెట్టడం అతని పతనానికి కారణం అయింది.

2005 లో కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ ను స్టార్ట్ చేసారు. కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ ఎక్సపాండబుల్ కాకుండా ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్ స్టార్ట్ చేసారు ఇది ఎంతో ఖర్చుతో కూడినదవటం వలన నష్టాల ఊబిలో కూరుకు పోయింది కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్. 2012 లో కింగ్ ఫిషర్ లైసెన్స్ ను కూడా రద్దు చేసారు. ఆలా కింగ్ ఫిషర్ బిజినెస్ క్లోజ్ అయ్యింది. దీనితో మొత్తం 9 వేల కోట్ల రూపాయలు బ్యాంకు లకు అప్పుపడ్డారు. బ్యాంకు లతోసంప్రదింపుల అనంతరం 6,600 కోట్లు ఇవ్వడానికి రెడీ అయ్యారు. బ్యాంక్స్ ఈ ఆఫర్ ను రిజెక్ట్ చేసింది. 2016 లో బ్రిటన్ కు పారిపోయారు.

ఇంతలా నష్టాలు రావడానికి పరోక్షం గ కూడా అతనే కారణం. ఎందుకంటే కార్పొరేట్ పార్టీ లు, అందమైన మోడల్స్ తో జల్సాలు ఇలా చెప్పుకుంటూ పోతే మన దేశం లో మాల్యా ను మించిన విలాస పురుషుడు మరొకరు ఉండరనే అనిపిస్తుంది.

2017లో విజయ్ మాల్యా సుప్రీం కోర్ట్ తీర్పును ఉల్లంఘిస్తూ 40మిలియన్ డాలర్లను తన పిల్లలకు ట్రాన్స్ఫర్ చేశారు. ఆ సమాచారాన్ని కోర్ట్కు చెప్పే ప్రయత్నం చేయలేదు. అయినప్పటికీ మాల్యా సుప్రీం కోర్టుకు హాజరవ్వలేదు. ఈ తరుణంలో కోర్ట్ ధిక్కారం కేసుకు సంబంధించి సుప్రీం కోర్ట్ తుది తీర్పు ఇచ్చింది. తన పిల్లలకు బదిలీ చేసిన 40 బిలియన్ డాలర్ల మొత్తాన్ని నాలుగు మాసాల్లో వడ్డీతో సహా తిరిగి చెల్లించాలని, లేనిపక్షంలో ఆస్తుల్ని అటాచ్ చేయాల్సివస్తుందని అత్యున్నత న్యాయస్థానం. హెచ్చరించింది.

కానీ, అప్పటికే విజయ్ మాల్యా లండన్ పారిపోయారు. ఆ తర్వాత ఆయన భారత్కు తిరిగి రాలేదు. అదే సమయంలో విజయ్ మాల్యాను దివాలాదారుగా ప్రకటించింది లండన్ కోర్టు. మాల్యాకు సంబంధించిన ఆస్తులను జప్తు చేసుకునేందుకు బ్యాంకుల కన్సార్షియంకు అనుమతి ఇచ్చింది. దీంతో నిలువ నీడ లేని పరిస్థితికి చేరుకున్నారాయన. ఇన్ని సంవత్సరాలు ఆయన తలదాచుకుంటూ వస్తోన్న లండన్లోని విలాసవంతమైన బంగళా కూడా మాల్యా చేజారిపోయింది. అటు వేల కోట్ల రుణాలు ఎగవేసిన కేసుల్లో నిందితుడిగా ఉన్న మాల్యాను భారత్కు అప్పగించేందుకు అంగీకారం తెలిపింది.

బ్రిటన్ ప్రభుత్వం. కానీ పలు కారణాలు చెబుతూ విజయ్ మాల్యా అక్కడే తలదాచుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.

What do you think?

కేసీఆర్ వరాల జల్లు..గిరిజనులకు 10% రిజర్వేషన్ బంధు

బడా చోర్ ల బిగ్గెస్ట్ అడ్డా … లండన్