in

బడా చోర్ ల బిగ్గెస్ట్ అడ్డా … లండన్

బడా చోర్ ల బిగ్గెస్ట్ అడ్డా … లండన్

బిజినెస్ టైకూన్, కింగ్ ఫిషర్ మాజీ అధినేత విజయ్ మాల్యా లక్షల కోట్ల ఆస్తులు ఉన్నా తాను మాత్రం కొత్త కంపెనీ పెట్టాలంటే బ్యాంకు ల నుండి అప్పులు తీసుకుంటాడు. ఇదే రూట్ లో బ్యాంకు నుండి 6, 900 కోట్లు అప్పుతీసుకుని కింగ్ ఫిషర్ అనే సంస్థను స్థాపించాడు. చివరకు నాలుగేళ్లు తిరక్కుండానే కింగ్ ఫిషర్ కు నష్టాలొచ్చాయని చేతులెత్తేశాడు. బ్యాంకు లోన్ తీర్చకుండా ఆఖరికి ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వకుండా తప్పించుకున్నాడు. ఇంత పబ్లిక్ గ బ్యాంకు లను దోచేసిన విజయమాల్యా ఇపుడు దర్జా గ లండన్ లో తిరుగుతున్నాడు.

బ్యాంకు లోన్ లు తిరిగి కట్టకపోతే అది మాల్యా, బ్యాంకుకె తెలియకుండా దోచేస్తే అది నీరవ్ మోడీ. పైసా పెట్టుబడి పెట్టకుండా చిన్న లెటర్ ను అడ్డం పెట్టుకుని బ్యాంకింగ్ వ్యవస్థలోని లోపాలను ఆసరాగా చేసుకుని, అన్నింటిని మించి బ్యాంకర్ ల అత్యాశను కాష్ చేసుకుని 30 బ్యాంకు లలో అక్షరాలా 12 వేల కోట్లు నొక్కేసాడు నీరవ్ మోడీ. ఈ సంగతి బయట పడుతుందని తెలిసి తెలియగానే లండన్ పారిపోయాడు.

మాల్యా, నీరవ్ లు నేరుగా బ్యాంకు లను దోచేస్తే ఆటలను అడ్డుపెట్టుకుని దేశం లో వేల కోట్లు దోచేసిన మరో చోర్ లలిత్ మోడీ. ఇండియా లో క్రికెట్ ఫీవర్ ను కాష్ చేసుకుని పారిపోయిన బడా చోర్.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ కు తెర లేపాడు. ఐ పి ఎల్ సాక్షి గా వేల కోట్ల బ్లాక్ మనీ లావాదేవీలు చేసాడు. తన ఫ్రాంచైజ్ లో రాజకీయనాయకులకు భాగస్వామ్యం పంచి యథేచ్ఛగా వేలకోట్లు దోచేశాడు. కానీ కొచ్చిన్ ఐ పి ఎల్ టీం లో బయటపడ్డ లుక లుకలతో మొత్తం గా మూడు వేల కోట్ల రూపాయలకు పైగా ఉల్లంఘనలు జరిపి హుటా హుటిన ఇంగ్లాండ్ పారిపోయాడు.
ఒక్క లలిత్ మోడీయే కాదు, ఈ రాయల్ కేటు గాళ్ళ జాబితా చాలా పెద్దది. ఇందులో మరో గజదొంగ పేరు దీపక్ తల్వార్. చాలా కార్పొరేట్ కంపెనీ లకు సలహా దారుడిగా పనిచేసి న దీపక్. వర్జిన్ ఐలాండ్, మారిషస్ వంటి వాటినుండి లావాదేవీ లు జరిపి భారీగా దేశాని కి రావాల్సిన ఆదాయాన్ని దారి మళ్ళించాడు. విదేశాల్లో పెద్ద పెద్ద విమానయాన సంస్థలతో కలిసి వారి ఆదాయాన్ని ట్రస్ట్ లకు పంపించి పన్నులు ఎగ్గొట్టి తిరిగి సంస్థలకు అప్పగించడం లో దిట్ట. ఈ డి, ఐటీ శాఖలు తనపై కన్నేశాయని తెలియగానే ఫామిలీ తో కలిసి యూ ఏ ఈ చెక్కేసాడు. ఇప్పటి వరకు దీపక్ వెయ్యి కోట్ల కు పైగా అక్రమాలకు పాల్పడినట్లు తేలింది.

ఇక సంజయ్ భండారి విషయానికొస్తే ఆయుధ వ్యాపార రంగంలో, దేశ రక్షణ వ్యవస్థలో పై స్థాయిలో ఉన్న పరిచయాలతో వేల కోట్లకు మోసాలు చేసాడు. ఆయుధాల అమ్మకాల్లో భారీగా పన్నులు ఎగ వేసాడు. ఇలా దేశానికి రావాల్సిన ఐ టీ ఆదాయాన్ని విదేశాలకు దారి మళ్ళించాడు.. భారత్ బయట వందల కోట్ల ఆస్తులు సమకూర్చుకున్నాడు. బడా చోర్ ల బిగ్గెస్ట్ అడ్డా … లండన్ ఎలా ?
మన దేశం లో చట్టాల్లో ఉండే డొల్ల తనం, లండన్ వంటి విదేశాల్లో ఉండే వెసులు బాటు వెరసి ఆర్ధిక నేరగాళ్లు లండన్ లో తలదాచు కోవటం సులువైంది. మనీ లాండరింగ్ మనదేశం లో నేరమయితే లండన్ లో చట్టాలకు సంబంధించినంత వరకు కొన్నిలొసుగులున్నాయి. న్యాయ పరం గా దౌత్య చట్టాలు అద్దిస్తాయి.

ఒకపుడు మనల్ని పాలించిన బ్రిటన్, దేశ విభజన సమయం లో నేరస్థులు మార్పిడి విషయం లో కొన్ని ఒప్పొందాలు చేసుకుంది. ఆ దౌత్య ఒప్పొందాల ప్రకారం అక్కడ తలదాచుకున్న ఈ ఘరానా దొంగల్ని బలమైన సాక్ష్యాలు లేకపోతే మన దేశం రప్పించడం దాదాపు అసాధ్యం. ఇవి బ్రిటిష్ దేశాల్లో చాలా దేశాలకు వర్తిస్తుంది. ఇది తెలుసు కాబట్టే ఈ మోసగాళ్లు లండన్, ఇంగ్లాండ్, యూరప్, స్విజ్జర్లాండ్ వంటి దేశాలు లో దాక్కుంటున్నారు. ఇప్పటికే ఇలాంటి నేరాలు చేసిన వాళ్ళు అంతా లండన్ లో సెటిల్ అయ్యేలా ముందు జాగ్రత్తగా వ్యాపారాలు చేయడం, పెట్టుబడులు పెట్టడం చేస్తారు. దీనితో వాళ్లకు ఆ దేశ చట్టాలు రక్షణ కల్పిస్తాయి. అందుకే లండన్ ‘ బడా చోర్ ల బిగ్గెస్ట్ అడ్డా’ గా మారింది.

What do you think?

ఘరానా దొంగ కింగ్ ‘ ఫినిషర్ ‘ – మాల్యా

భారతీయ నౌకాదళ బాహుబలి- ఐ ఎన్ ఎస్ విక్రాంత్