in

ఇప్పటికీ ఓ కొలిక్కి రాని ఎలిజబెత్ హత్య కేసు!

ఇప్పటికీ ఓ కొలిక్కి రాని ఎలిజబెత్ హత్య కేసు!

1947, కాలిఫోర్నియాలోని లాస్ ఏంజిల్స్ నగరంలో జనవరి 15 ఉదయం వాతావరణం చల్లటి గాలులతో అప్పుడే రోడ్డెక్కిన జనాల మనసులకు ఆనందం కలిగిస్తోంది. ఒక వైపు బళ్ళు, మరో వైపు చిన్నారుల చిరునవ్వులు ఆ ప్రదేశం ప్రశాంతపు పరిమళలాలను వెదజల్లుతోంది.

అటువంటి ఉదయాన ఓ తల్లి తన చిన్నారి కూతుర్ని తీసుకొని రోడ్డుపై నడక్కి వచ్చింది. తను తన కూతురితో మాట్లడుతూ నవ్వుతూ నడుస్తూ ఉంది. అలా నడుస్తున్న ఆమెకు కొంచెం దూరంలో ఫుట్ పాత్ పక్కన ఓ చిన్న బొమ్మ లాంటి ఆకారం కనిపించింది. అది బొమ్మ అయుంటుందని అనుకున్న ఆమె దానికి దగ్గరగా వెళ్లి చూసింది. అలా దాన్ని దగ్గరగా చూసిన ఆమెకు అదేంటో తెలిసింది. అది ఓ మహిళ మృత దేహం. నడుము దగ్గరకు నరికేసి పడి ఉంది. కానీ ఆ మృత దేహం మీద కానీ, చుట్టు పక్కల కానీ చిన్న రక్తపు చుక్క కూడా లేదు. అంటే ఆ మహిళను ఎవరో ఎక్కడో చంపేసి అక్కడకు తీసుకు వచ్చి పడేసారని తెలుస్తుంది. మృత దేహంపై ఒక చిన్న గుడ్డ ముక్క కూడా లేదు. ఫుట్ పాత్ కి దానికి కొన్ని అడుగుల ఎత్తు తేడా మాత్రమే ఉంది. ఆ మహిళ అంతే ఎత్తు ఉందా అన్నట్టు. ఇది చూసిన తల్లి భయంతో గుండె ఆగిపోయినంత గట్టిగా అరిచింది. కొంత సేపటికి ఆ భయంకరమైన ఘటన నుంచి తేరుకుని లాస్ ఏంజిల్స్ పోలీసులకు ఈ విషయాన్ని తెలియ చేసింది.

ఆ మృత దేహాన్ని చూసిన లాస్ ఏంజిల్స్ పోలీసులు ఇంకో 56 నిమిషాలలోనే అది ఎవరిదనేది కనిపెట్టేసారు.

ఆ మృత దేహం 22 ఏళ్ల ఎలిజబెత్ అనే అమ్మాయిది. ఎప్పటికైనా పెద్ద నటి అవుతాను అనే ఆశతో నటిస్తూ తన సమయం కోసం వేచి చూస్తున్న ఓ చిన్న నటిది.

ఈ కేసును పరిష్కరించడానికి ఎల్ ఏ పోలీసులు ఎఫ్బీఐ సాయం తీసుకున్నారు. హంతకుడిని పట్టుకోవడం కోసం వేట మొదలు పెట్టారు. అనుమానం ఉన్న ప్రతి ఒక్కరిని ప్రశ్నించారు. ఎలిజబెత్ కు సంబంధించిన సమాచారం మొత్తం సేకరించారు. అలా ఆమె గురించి తెలుసుకుంటున్న సమయంలో ఎలిజబెత్ ఒక సారి అరెస్టు అయ్యిందని తెలుసుకున్నారు. శాంటా బార్బరా పోలీసులు ఆమెను అండర్ ఏజ్ లో తాగుతుందన్న నేరం కింద అరెస్టు చేశారని తెలుసుకున్నారు. 1943 లో ఎలిజబెత్ కాలిఫోర్నియాలో ఆర్మీలో కుక్ జాబ్ కోసం దరఖాస్తు చేసుకుందని తెలుసుకున్నారు.
ఇలా ఆమె ప్రతి విషయాన్ని పోలిసులు తెలుసుకున్నారు కానీ ఆమె హత్యకు లీడ్ గా పనిచేసే ఒక్క విషయాన్ని కూడా కనిపెట్టలేకపోయారు.

ఆమె మృతదేహం చాలా నీట్ గా కట్ అయ్యి దొరకడంతో ఈ పని ఎవరో శరీరాన్ని నైపుణ్యంగా కట్ (డైసెక్ట్) చేయగలిగిన వారే చేసుంటారని భావించి యూనివర్శిటీ ఆఫ్ సౌత్రెన్ కాలిఫోర్నియా మెడికల్ స్కూల్ లోని స్టూడెంట్స్ ను కూడా విచారించారు. కానీ అక్కడ కూడా పోలీసులకు హంతకుడు దొరకలేదు. కనీసం హంతకుడిని పట్టుకోవడంలో సహాయ పడే ఆధారాల కూడా లభించలేదు.
ఇక చివరి ప్రయత్నంగా ఓ అనామక లేఖ పై ఉన్న వేలి ముద్రల ద్వారా హంతకుడిని పట్టుకునే ప్రయత్నం చేశారు. కానీ ఆ ప్రయత్నం కూడా ఫలించలేదు.

ఏ కోణంలో పోలీసులు ఎలిజబెత్ కేసును పరిష్కరించాలని ప్రయత్నించినా వారికి చుక్కెదురురవుతూన్నే వచ్చిందని. అలా ఈ కేసు ఎటువంటి ఆధారాలు దొరక్క మూలాన పడిపోయింది. హంతకుడు ఎవరనేది తెలియకుండానే పోయింది.

ఇప్పటికీ ఎలిజబెత్ ను ఎవరు చంపారు? ఎందుకు చంపారు? అన్న విషయాలు మిస్టరీగానే మిగిలిపోయాయి.

అంటే ఇది ఎప్పటికే ఓ మిస్టరీనే అన్నమాట..

 

What do you think?

నిర్మాణ సంస్థ స్థాపించబోతున్న యంగ్ టైగర్ ఎన్టీఅర్

పెన్షన్ కోసం తల్లి మృతదేహాన్ని దాచి పెట్టిన కొడుకు