పెన్షన్ కోసం తల్లి మృతదేహాన్ని దాచి పెట్టిన కొడుకు
ఓ కొడుకు సొమ్ము కోసం దారుణానికి వడి కట్టాడు. చనిపోయిన తల్లిని పెన్షన్ కోసం ఎవరికీ తెలియకుండా బ్యాగ్ లో దాచిపెట్టాడు. ఈ దారుణం ఇటలీలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే ఇటలీలో హెల్గా అనే మహిళ ఆరు నెలలు క్రితం చనిపోయింది. అయితే ఆమె చనిపోయిందని తెలిస్తే పెన్షన్ ఇవ్వరని ఆమె కొడుకు ఆమె మృతదేహాన్ని బెడ్ కింద బ్యాగులో దాచాడు. ఆమె చనిపోయిందన్న విషయం ఎవరికీ తెలియనివ్వకుండా ఆరు నెలల పాటు పెన్షన్ తీసుకుంటూ వచ్చాడు. అలా 1.59 కోట్లు పొందాడు.
అయితే ఎమర్జెన్సీ సర్వీస్ కోసం ఆమెను సంప్రదించేందుకు పోలీసులు ఆమె ఇంటికి వచ్చారు. ఈ సమయంలో పోలీసులకు అనుమానం రావడంతో తనిఖీలు చేశారు. అలా చేసిన ఆ తనికీలలో హెల్గా మృతదేహం బయటపడింది. బెడ్ కింద బ్యాగులో ఆమె మృత దేహం దొరికింది. దీంతో కుమారుడ్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు తమదైన శైలిగా విచారించి అసలు విషయం బయటకు లాగారు.