in

నిర్మాణ సంస్థ స్థాపించబోతున్న యంగ్ టైగర్ ఎన్టీఅర్

నిర్మాణ సంస్థ స్థాపించబోతున్న యంగ్ టైగర్ ఎన్టీఅర్

చాలా మంది తెలుగు హీరోలు ఇప్పటికే నిర్మాతలుగా మారి కొత్త కథలతో వచ్చే సినిమాలను ప్రోత్సహిస్తున్నారు. కొత్త దర్శకులకు అవకాశాలిచ్చి వారి జర్నీలో మొదటి అడుగు వేయడానికి సహాయ పడుతున్నారు. ఇప్పటికే హీరో నానీ, ప్రభాస్, మహేష్ బాబు, రామ్ చరణ్ లు నిర్మాతలుగా మారి కొత్త కథలను తెరపైకి తెస్తుండగా.. ఇప్పుడు ఈ జాబితాలోకి యంగ్ టైగర్ ఎన్టీఅర్ కూడా చేరబోతున్నారు.

ఎన్టీఆర్ ఒక కొత్త నిర్మాణ సంస్థను స్థాపించనున్నట్లు తెలుస్తుంది. తన మొదటి సినిమాను న్యాచురల్ స్టార్ నానితో చేయబోతున్నారని టాక్ కూడా నడుస్తుంది. అయితే ఇంకా దీనిపై అధికారికి ప్రకటన రావాల్సి ఉండగా.. ఎన్టీఆర్ రామ్ చరణ్ న్ను చూసి తను కూడా నిర్మాణ సంస్థను పెట్టాలని డిసైడ్ అయినట్టు అనుకుంటున్నారు.

ఎదేమైనా ఎన్టీఆర్ ఎలాంటి సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తారా? అని ఇటు ప్రేక్షకులు, అటు ఆయన అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

What do you think?

విడుదలైన టీఎస్పీఎస్సీ గ్రూప్‌-1 హాల్ టికెట్లు.

ఇప్పటికీ ఓ కొలిక్కి రాని ఎలిజబెత్ హత్య కేసు!