in

యువకుడిని 50 మీటర్లు లాకెల్లిన టాటా ఎస్ డ్రైవర్.

50 మీటర్లు లాకెల్లి ప్రాణాలు తీసిన టాటా ఎస్ డ్రైవర్ – కరీమ్ నగర్ జిల్లా

ఈ ఏడాది మొదట్లో ఢిల్లీలో ఒక యువతిని 12 కిలో మీటర్లు ఈడ్చుకెల్లిన సంఘటన, ఆ తరువాత ఒక వృద్ధుడిని కారుతో ఈడ్చుకు వెళ్లిన సంఘటన మరువక మునుపే మరో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.

ఈ సంఘటనలో డ్రైవర్ నిర్లక్ష్యం ఒక యువకుడి ప్రాణం తీసింది. క్షణాల్లో ఆ యువకుడి ప్రాణం గాల్లో కలిసిపోయింది. ఈ దారుణమైన సంఘటన కరీంనగర్ జిల్లాలో చోటు చేసుకుంది.

కరీంనగర్ జిల్లాలోని కొండపల్క గ్రామానికి చెందిన శ్రీకాంత్ మిషన్ భగీరథలో పంప్ ఆపరేటర్ గా పనిచేస్తున్నాడు.ఐతే ఇటీవల రాత్రి బైక్ పై వెళ్తున్న శ్రీకాంత్ ను ఒక టాటా ఏస్ వచ్చి ఢీకొట్టింది. దీనికి తోడు ఢీకొట్టిన తరువాత కూడా డ్రైవర్ బ్రేక్ వెయ్యకుండా 50 మీటర్లు వాహనాన్ని పోనిస్తూ.. శ్రీకాంత్ ను ఈడ్చుకుపోవడంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో శ్రీకాంత్ స్పాట్లోనే మరణించాడు. శ్రీకాంత్ మరణం గురించి తెలిసిన స్థానికులు, సన్నిహితులు ఆవేదన వ్యక్తం చేయగా.. పోలీసులు కేసును దర్యాప్తు చేశారు.

What do you think?

న్యాయమూర్తి నే బురిడి కొట్టించబోయారా?!

మళ్ళీ పెళ్ళి పీటలెక్కిన హార్దిక్ పాండ్య!