in

న్యాయమూర్తి నే బురిడి కొట్టించబోయారా?!

50 లీటర్ల కెపాసిటీ ఉన్న కారు ట్యాంక్ లో 57 లీటర్ల పెట్రోల్ కొట్టామంటూ ఒక పెట్రోల్ బంకులోని నిర్వాహకులు 57 లీటర్ల పెట్రోల్ బిల్ ను ఇచ్చారు. తమాషా విషయం ఏంటంటే అక్కడ పెట్రోల్ కొట్టించుకుంది ఒక హై కోర్ట్ న్యాయమూర్తి. ఈ సంఘటన మధ్య ప్రదేశ్ లోని జబల్పూర్ లో చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే ఇటీవల మధ్యప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి కారులో వెళ్తున్న సమయంలో ఓ పెట్రోల్ బంకులో ఆగి, కారు పెట్రోల్ ట్యాంక్ను ఫుల్ చేయించమని డ్రైవర్కు చెప్పారు. అయితే పెట్రోల్ కొట్టించుకున్న తరువాత బంకు నిర్వాహకులు ఇచ్చిన బిల్లు చూసి కంగుతిన్నారు. కారు ట్యాంకు సామర్థ్యం 50 లీటర్లు ఉంటే 57 లీటర్లు పోసినట్లు చూపించడంతో ఆయన అవాక్కయ్యారు. ఆ తరువాత ఈ విషయాన్ని వెంటనే జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.

దీంతో వెంటనే రంగంలోకి దిగిన అధికారులు ఆ పెట్రోల్ బంకును సీజ్ చేయడంతో పాటు ఆ ప్రాంతంలోని ఇతర పెట్రోల్ బంకులు కూడా ఈ తరహా మోసానికి పాల్పడుతున్నాయా? అన్న విషయాన్ని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. అదే విధంగా అన్నిటినీ పూర్తిగా తనిఖీ చేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. దానికోసం ప్రత్యేకంగా నలుగురు సభ్యులతో కూడిన ఒక కమిటీని కూడా ఏర్పాటు చేశారు.

What do you think?

జడేజాకు జరిమానా విధించిన ఐసీసీ.ఫీజ్లో 25% కోత!

యువకుడిని 50 మీటర్లు లాకెల్లిన టాటా ఎస్ డ్రైవర్.