in

మళ్ళీ పెళ్ళి పీటలెక్కిన హార్దిక్ పాండ్య!

టీిండియా ఆల్ రౌండర్ హర్డిక్ పాండ్య మళ్ళీ పెళ్ళి పీటలు ఎక్కాడా? అదేంటి?! హర్డిక్కు పెళ్ళయి పిల్లాడు కూడా ఉన్నాడు కదా.. ఇప్పుడు మళ్ళీ పెళ్లేంటి ? రెండో పెళ్ళి కాదు కదా?! అనుకోకండి. ఇది హార్దిక్ మొదటి పెళ్లే.. కానీ రెండో సారి జరగింది.

ఆసలు విషయం ఏంటంటే తన మనసుకు నచ్చిన, తను మెచ్చిన సెర్బియా నటి నటాషా స్టాంకోవిచ్ (Natasa Stankovic) ను హార్దిక్ పాండ్య లాక్ డౌన్ కారణంగా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాడు. అయితే తన పెళ్ళి ఆత్మీయులు, బంధుమిత్రుల సమక్షంలో సంప్రదాయబద్ధంగా మరోసారి చేసుకోవాలని పాండ్య ఎప్పట్నుంచో భావిస్తున్నాడట.

ఈ క్రమంలోనే ఫిబ్రవరి 14న ప్రేమికుల రోజు సందర్భంగా హార్దిక్ – నటాషా జోడీ ఘనంగా పెళ్లి చేసుకున్నారు.ఈ వేడుకకు రాజస్థాన్లోని ఉదయ్పూర్ వేదిక అయింది. ఫిబ్రవరి 14న వీరిద్దరు మరోసారి పెళ్ళి పీటలు ఎక్కారు. బంధుమిత్ర సపరివార సమేతంగా వారి పెళ్ళిని మరోసారి ఆనందంగా జరుపుకున్నారు. దీనికి సంబందించిన ఫొటోలను ఇన్ స్టాగ్రామ్లో పంచుకున్నారు.

What do you think?

యువకుడిని 50 మీటర్లు లాకెల్లిన టాటా ఎస్ డ్రైవర్.

పెట్రోల్ ధరలను జిఎస్టీలోకి తెస్తాం-మంత్రి నిర్మలా