in

భారీ వర్షాల కారణంగా ముంబైలో రైలు రాకపోకలకి ఆటంకం

భారీ వర్షాల కారణంగా ముంబైలో రైలు రాకపోకలకి ఆటంకం

ఎడతెరిపి

లేకుండా కురుస్తున్న వర్షం కారణంగా ట్రాక్‌లపై నీరు నిలిచిపోవడంతో గురువారం ముంబైలో స్థానిక రైలు సర్వీసుకు కొంతసేపు ఆటంకం కలిగింది. వర్షం కారణంగా పట్టాలు మునిగిపోవడంతో సెంట్రల్ రైల్వే 20 సర్వీసులను రద్దు చేయడంతో పాటు వాడాలా – మాన్‌ఖుర్డ్ స్టేషన్ మధ్య రాకపోకలను నిలిపివేసింది.
ఈ దారిలోని సర్వీస్ ను మధ్యాహ్నం 2.45 గంటలకు నిలిపివేసిన రైల్వే, మళ్ళీ 3.10 గంటలకు తిరిగి పునః ప్రారంభించింది. అయితే సర్వీసుల పునరుద్ధరణ తర్వాత హార్బర్ లైన్‌లో 20-30 నిమిషాల పాటు రైళ్లు ఆలస్యంగా నడిచాయి.

హార్బర్ లైన్‌లో మొత్తం 20 రైళ్ల సర్వీసులను రద్దు చేసినట్లు సీఆర్‌సీ చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ డాక్టర్ శివరాజ్ మనస్‌పురే తెలుపగా.. మెయిన్‌లైన్‌లో రైళ్లు యథావిధిగా నడుస్తున్నాయి.

భారీ వర్షాల కారణంగా పశ్చిమ రైల్వే సబర్బన్ సెక్షన్‌లో రైళ్లు ఆలస్యంగా నడుస్తుండడంతో గురువారం దాదాపు 77 రైళ్ళ సర్వీసు ఆలస్యం అయ్యింది. అయితే, ఈ పరిస్థితుల వల్ల ట్రైన్ లు ఆలస్యం అయినప్పటికీ సేవలను రద్దు చేయలేదని సెంట్రల్ రైల్వే పేర్కొంది.

What do you think?

రిటైర్మెంట్ ప్రకటించిన లంక క్రికెటర్ తిరుమాన్నే

అత్యాచారానికి గురై శవమై తేలిన మైనర్ బాలిక.