in

పట్టాలు తప్పిన గోదావరి ఎక్స్ప్రెస్!

విశాఖపట్నం నుంచి హైదరబాద్ వెళ్తున్న ట్రైన్ ఘట్కేసర్ రైల్వేస్టేషన్ పరిధిలోని అంకుషాపూర్ సమీపంలో పట్టాలు తప్పడంతో ఒక్క సారిగా ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. తరువాత పెద్ద ప్రమాదం ఏమీ లేదని తెలుసుకొని ఊపిరి పీల్చుకున్నారు.

వివరాల్లోకి వెళ్తే ఇటీవల విశాఖపట్నం నుంచి హైదరబాద్ వెళ్తున్న 12727 గోదావరి ఎక్స్ప్రెస్ మేడ్చెల్ జిల్లా ఘట్కేసర్ రైల్వేస్టేషన్ పరిధిలోని అంకుషాపూర్ సమీపంలో పట్టాలు తప్పింది. దీంతో నాలుగు బోగీలు పక్కకు జరగడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. కానీ ఆ తరువాత ప్రమాదం ఏమీ లేదని తెలియడంతో మళ్ళీ ఊపిరి పీల్చుకున్నారు. ఈ ప్రమాదంపై స్పందించిన రైల్వే అధికారులు రైలు వేగం తక్కువగా ఉండడం వల్ల పెద్ద ప్రమాదం ఏమీ జరగలేదని, ప్రయాణికులు కూడా సురక్షితంగా ఉన్నారని తెలియచేశారు. పట్టాలు తప్పిన బోగీలను వేరు చేశామని అదే రైలులో ప్రయాణికులను పంపిస్తున్నట్లు వెల్లడించారు. ఈ ఘటన నేపథ్యంలో 040-27786666 నంబరుతో హెల్ప్ లైన్ ఏర్పాటు చేశామని అధికారులు తెలిపారు.

ఇదిలా ఉండగా మరో వైపు ఇలా గోదావరి ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పడంతో వివిధ రైల్వేస్టేషన్లలో రైళ్లను నిలిపివేశారు. బీబీనగర్ స్టేషన్లో విశాఖ- మహబూబ్ నగర్ ప్రత్యేక రైలును, తిరుపతి- పూర్ణా (నాందేడ్) స్పెషల్, దిబ్రూగఢ్-సికింద్రాబాద్ స్పెషల్ రైళ్లను నిలిపేశారు.
ట్రాక్ మరమత్తులు పూర్తైన తరువాత అవి కదులుతాయని అధికారులు తెలిపారు.

What do you think?

పెట్రోల్ ధరలను జిఎస్టీలోకి తెస్తాం-మంత్రి నిర్మలా

అంగవైకల్యం ఉన్నా అమెజాన్ లో జాబ్ కొట్టేసాడు.