in

అంగవైకల్యం ఉన్నా అమెజాన్ లో జాబ్ కొట్టేసాడు.

చిన్న చిన్న సమస్యలకే యువత కృంగిపోతున్న ఈ కాలంలో దృడ సంకల్పం ఉంటే ఏదైనా సాధించవచ్చని విజయనగరం జిల్లాకు చెందిన 24 ఏళ్ళ అమృత్ మరో సారి నిరూపించారు. తన అవిటి తనాన్ని లెక్క చేయకుండా “అమెజాన్” లో ఒక మంచి ఉద్యోగాన్ని సాధించి అందర్ని ఆశ్చర్యపరిచారు. తనను తల్లిదండ్రులకు అండగా నిలుస్తూ.. సభాష్ అనిపించుకున్నారు.

విజయనగరం జిల్లా చీపురుపల్లికి చెందిన దీప, ఎస్వీజీ శ్రీనివాసరావుల కుమారుడు అమృత్ పుట్టుకతోనే అవయవ లోపంతో జన్మించారు. ఈ లోపం కారణంగా అమృత్ తల, రెండు చూపుడు వేళ్ళు మాత్రమే కదిలించగలరు. ఆయనకు చికిస్త చేయించాలని, తను కూడా అందరిలా ఉండాలని ఆశించిన తల్లిదండ్రులు ఎన్నో ఆసుపత్రులు తిరిగినప్పటికీ అమృత్ అందరిలా ఉండడం అసాద్యమని, ఆయన తన మిగిలిన అవయవాలని ఎప్పటికీ ఉపయోగించలేడని వైద్యులు చెప్పేసారు. ఈ మాటలు వారికి బాధను కలిగించినప్పటికీ వారి ఆత్మవిశ్వాసం వారికి మనో దైర్యాన్ని ఇచ్చింది. ఆ ఆత్మ విశ్వాసంతోనే వారి బిడ్డకు దైర్యం చెబుతూ చదివించారు. అమృత్ కూడా వారు ఆశించినట్టే చదువులో బాగా రాణించారు.

పదో తరగతిలో 9.2 గ్రేడ్ పాయింట్స్ తో ఉత్తీర్ణత సాధించారు. ఇంటర్ ఎంఈసీలో 940 సాదించారు. ఆ తరువాత 2021లో బీకాం పూర్తి చేసి అమెజాన్ తో శాశ్వతంగా ఇంటినుంచి పని చేసేలా వప్పందం చేసుకుని, సాఫ్ట్ వేర్ ఇంజినీర్గా ఉద్యోగం సాదించారు. తల్లిదండ్రులకు ఆ స్తితిలో కూడా తనున్నానని దైర్యం చెబుతూ అందరితో సభాష్ అనిపించుకున్నారు.

What do you think?

పట్టాలు తప్పిన గోదావరి ఎక్స్ప్రెస్!

పెళ్లి చెసుకోవాలనుకున్నారు.కానీ విది అనుకూలించలేదు