in

పెళ్లి చెసుకోవాలనుకున్నారు.కానీ విది అనుకూలించలేదు

ప్రేమించుకున్నారు, ఒకరికి ఒకరు అండగా నిలుస్తామని.. ఎప్పటికీ విడిపోమని.. ప్రేమ సాక్షిగా ప్రమాణం చేసుకున్నారు. కానీ విది వారి ప్రేమకు,పెళ్లి కిమధ్య అడ్డుగా నిలిచి వారి ప్రాణాలు తీసింది. కాలం మారింది కానీ మనుషుల ఆలోచనలు మారలేదని మరో సారి నిరూపించింది.

మెదక్ చెందిన ఖలీల్ ఆటో నడుపుతూ జీవిస్తుండే వాడు. ఈ క్రమంలో ఖలీల్ కల్పన అనే అమ్మాయితో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కొద్ది కొద్దిగా ఇష్టంగా మారింది. ఆ ఇష్టం తరువాత ప్రేమగా మారింది. ఈ క్రమంలోనే పెళ్లి చేసుకోవాలని కూడా నిర్ణయించుకున్నారు. ఐతే ఇంతలో వారి ప్రేమ విషయం ఇద్దరి ఇళ్లల్లో తెలిసిపోయింది. కానీ ఇద్దరి మతాలు వేరు కావడంతో వారి కుటుంబసభ్యులు పెళ్లి జరగడం అసాధ్యమని చెప్పేశారు. వాళ్ళు అన్నట్టుగానే కల్పనకు 2 నెలల క్రితం వేరే అబ్బాయితో పెళ్లి చేశారు. కల్పన ప్రేమించిన ఖలీల్ ను మనసులో పెట్టుకొనే పెద్దలు చూసిన అబ్బాయిని అస్సలు ఇష్టం లేకపోయినా పెళ్లాడింది. ఐతే ఎంతగానో ప్రేమించిన ఖలీల్ ను మాత్రం మరిచిపోలేకపోయింది.

ఫిబ్రవరి 9న శివరాత్రి పండుగ కోసం అత్తగారింటికి కల్పన వచ్చింది. కానీ సోమవారం నుంచి కనిపించకుండా పోయింది. ఈ విషయం ఇంట్లో తెలియడంతో కంగారు పడిన కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
వారి ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు కల్పన ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అక్కడి పరిసర ప్రాంతాల్లో ఉన్న సీసీ కెమెరాలను పోలీసులు పరిశీలించారు. మంగళవారం నార్సింగ్ లో బస్సు ఎక్కి రామాయంపేటలో దిగినట్లు గుర్తించారు. ఇక అక్కడి నుంచి ఓ యువకునితో బైక్ పై వెళ్లినట్లు గమనించి గాలింపు చేపట్టారు. ఈ గాలింపు చర్యల్లో నార్సింగ్ చెరువు వద్ద యువతీ యువకుల చెప్పులు కనిపించగా.. ఈ చెప్పులు ఖలీల్, కల్పనవే అని భావించిన పోలీసులు చెరువులో పడి ఆత్మహత్య చేసుకుని ఉంటారని అంచనా వేశారు. బుధవారం గజ ఈతగాళ్లతో చెరువు మొత్తం గాలించారు.

కానీ ఎక్కడా కూడా ఇద్దరి ఆచూకీ దొరకకపోవడంతో లాభం లేదనుకొని చెరువులో వెతకటం ఆపేశారు. అయితే ఆ మరుసటి రోజు ఫిబ్రవరి 16, గురువారం ఆ ఇద్దరి శవాలు చెరువులో తేలుతూ కనిపించాయి. దీంతో ఇష్టం లేని పెళ్లి చేయడంతోనే యువతి ప్రియునితో కలిసి పారిపోయి ఆత్మహత్యకు చేసుకుందని పొలీసులు నిర్దారించారు.

What do you think?

అంగవైకల్యం ఉన్నా అమెజాన్ లో జాబ్ కొట్టేసాడు.

ట్విట్టర్ తిప్పలు తప్పేదెప్పుడు?