in

ట్విట్టర్ తిప్పలు తప్పేదెప్పుడు?

ట్విట్టర్ ను సొంతం చేసుకున్నప్పటి నుండి ఎలోన్ మస్క్ తీసుకుంటున్న నిర్ణయాలు అందర్నీ అవాక్కయేలా చేస్తున్నాయి. ట్విట్టర్ మనుగడపై సందేహాలు లేవనెత్తుతున్నాయి. ఇప్పుడు ఇలాంటి మరో సంచలన నిర్ణయాన్ని ఎలోన్ మస్క్ ఇంకో సారి తీసుకున్నట్టు వార్తలు వస్తున్నాయి.

గత ఏడాది అక్టోబర్ లో మస్క్ ట్విటర్ ను 44 బిలియన్ డాలర్ల భారీ మొత్తంతో కొనుగోలు చేసి తన సొంతం చేసుకున్నాడన్న విషయం తెలిసిందే.
ఐతే అప్పటి నుంచి వాణిజ్య ప్రకటనలు తగ్గిపోవడంతో ఆదాయం గణనీయంగా పడిపోయింది. దీంతో ట్విటర్ ను ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కించేందుకు మస్క్ అనేక చర్యలు చేపట్టారు. ఉద్యోగుల సంఖ్యను సగానికి తగ్గించారు. ట్విటర్ బ్లూ సబ్స్క్రిప్షన్ను ప్రారంభించారు. విలువైన వస్తువులను వేలం వేశారు. భారత్లో ఈ సంస్థలో సుమారు 200 మందికిపైగా ఉద్యోగులు పనిచేస్తుండేవారు. ఈ 200 మంది ఉద్యోగులలో మస్క్ గత నవంబర్లో 90 శాతం మందిని తొలగించారు.

ఈ చర్యల్లో భాగంగా ఇప్పుడు మస్క్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారన్న వార్తలు వస్తున్నాయి. దేశ రాజధాని డిల్లీ, ఆర్థిక రాజధాని ముంబయిలలో ఉన్న కార్యాలయాలను మస్క్ మూసివేసినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. అందులోని సిబ్బందిని ఇంటి నుంచి పనిచేయమని సూచించినట్లు పేర్కొన్నాయి. ఐతే ఎక్కువమంది ఇంజినీర్లు పనిచేస్తున్న బెంగళూరు కార్యాలయంలో మాత్రం ఇంకా సేవలు కొనసాగిస్తున్నట్లు తెలుస్తుంది.

What do you think?

పెళ్లి చెసుకోవాలనుకున్నారు.కానీ విది అనుకూలించలేదు

రాజమౌళి పై చెలరేగిన ట్రోల్స్! కంగనా ఘాటు ట్వీట్.