in

2 వేల కేజీల టమాటాలు చోరీ. టమాటానే బంగారమాయెనే..

2 వేల కేజీల టమాటాలు చోరీ. టమాటానే బంగారమాయెనే..

ప్రస్తుతం టమాటాల ధర ఆకాశాన్ని అంటుతుందన్న విషయం తెలిసిందే. ఏపీ, తెలంగాణలలో ఈ టమాటాల ధర ఇప్పటికే రూ.100 దాటేసి సామాన్యుడికి భారంగా మారింది. కర్ణాటకలో ఏకంగా రూ.120 నుంచి రూ.150 పలుకుతోంది. దీంతో సామాన్యుడు వాటి వైపు చూడడానికి కూడా భయపడుతున్నాడు. మరో వైపు దేశంలో డబ్బు, బంగారం దోపిడీల కన్నా టమాటాల చోరీలు ఎక్కువైపోయాయి. కొన్ని రోజుల క్రితం కర్ణాటకలో 60 బస్తాల టమాటాలను ఓ రైతు పొలంలో నుంచే ఎత్తుకుపోయారు. ఇప్పుడు తాజాగా బెంగుళూరులో మరో చోరీ చోటు చేసుకుంది. ముగ్గురు దుండగులు ఏకంగా 2 వేల కేజీల టమాటాలను దోచుకుపోయారు.

పొలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చిత్రదుర్గలోని ఓ రైతు కోలార్ మార్కెట్ కు 2 వేల కేజీల టమాటాలను తరలిస్తున్న సమయంలో కారులో ముగ్గురు దుండగులు వారిని అనుసరించారు. కారును ఢీకొట్టారాని ఆరోపిస్తూ.. టమాటాల వాహనాన్ని పక్క దారి పట్టించారు. రైతు, డ్రైవర్ల పై దాడి చేసి కొంత డబ్బును ఆన్లైన్ లో తమ ఖాతాకు బదిలీ (ట్రాన్స్ఫర్) చేయించుకున్నారు. రైతు, డ్రైవర్లను రోడ్డు పై వదిలేసి టమాటాల వాహనంతో పరారయ్యారు. చోరికి గురైన రైతు వెంటనే పోలీసులను ఆశ్రయించగా పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దుండగులు కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

ఇలాంటి చాలా ఘటనలు ఇప్పటికే పలు చోట్ల వెలుగు చూశాయి. దీంతో భయపడిపోయిన రైతులు, వ్యాపారులు పొలాలు, షాపుల వద్ద నిత్యం కాపలా కాస్తున్నారు. ఓ వ్యాపారి అయితే చోరీకి భయపడి టమాటాలకు రక్షణగా బాడీ గార్డులను నియమించుకున్నాడు. ఆ వీడియో కాస్తా వైరల్ అయ్యి నెట్టింట చక్కర్లు కొడుతోంది.

What do you think?

అనిరుధ్ రవిచందర్, జోనితా గాంధీల పెళ్లా..?!

కొత్త మలుపు తిరిగిన మధ్యప్రదేశ్ ఆదివాసీ ఘటన