కొత్త మలుపు తిరిగిన మధ్యప్రదేశ్ ఆదివాసీ ఘటన
భాజాపా నేత ఒకరు ఓ ఆదివాసీ యువకుడి పై మూత్రం పోసిన ఘటన మధ్యప్రదేశ్ లో కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కూడా స్పందించి స్వయంగా ఆయనే బాధితుడిని తన నివాసానికి పిలిపించి అతని కాళ్లు కడిగి క్షమాపణలు కూడా కోరారు.
అయితే ఇప్పుడు ఈ ఘటనలో ఒక కొత్త మలుపు వెలుగు చూసింది.
ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ కాళ్లు కడిగిన వ్యక్తి దశమత్ రావత్ అసలైన బాధితుడిని తాను కాదని పేర్కొన్నారు. నిందితుడు ప్రవేశ్ శుక్లా తనతో బలవంతంగా సంతకం చేయించారని దశమత్ చెప్పుకొచ్చాడు.
దీంతో సీఎం శివరాజ్ సింగ్ అసలైన బాధితుడి కాళ్లు కడగకుండానే నాటకమాడుతున్నారాని, ప్రజల మెప్పు పొందడం కోసం ఎవరివో కాళ్లు కడిగి విషయాన్ని తప్పు దారి పట్టిస్తున్నారని కాంగ్రెస్ నాయకులు విమర్శిస్తున్నారు.