in

తమిళ స్టార్ తలపథి విజయ్ రాజకీయాల్లోకి?

తమిళ స్టార్ తలపథి విజయ్ రాజకీయాల్లోకి?

సినిమా వాళ్లు రాజకీయాల్లోకి రావడం అనేది సాధారణ విషయం. సినిమాల్లో సక్సెస్ అయిన వాళ్ళు రాజకీయాల్లో కూడా అడుగుపెట్టి అదృష్టం పరీక్షించుకుంటారు. అలా ఈ బాటలో నడిచిన స్టార్ హీరోలు కూడా ఉన్నారు. సీనియర్ ఎన్టీఆర్, చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కల్యాణ్, కమల్ హాసన్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది. ఇప్పుడు ఈ జాబితాలోకి తమిళ్ స్టార్ హీరో విజయ్ కూడా చేరబోతున్నారని ప్రచారం తెలుస్తుంది.

విజయ్ 2026 అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా పావులు కదుపుతున్నారని చర్చ జరుగుతోంది. ఆయన ఈ నెల 17న టెన్త్, ఫ్లస్-2లో మంచి మార్కులు సాధించిన విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశం కానున్నారు. ఇటీవల ఆయన తమిళనాడులోని పలు జిల్లాల్లోని ఫ్యాన్స్ ప్రెసిడెంట్లతో సమీక్షలు కూడా నిర్వహించారు. దీంతో ఆయన రాజకీయ ఆరంగేట్రం పై వస్తున్న వాదనలు నిజమేనని ఆయన రాజకీయాల్లో అడుగు పెట్టబోతున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది.

ఇదే కనుక నిజం అయితే ఆయన అభిమానుల ఆనందానికి అవధులు ఉండవనే చెప్పాలి.

What do you think?

కోర్టులో జడ్జి ముందే గ్యాంగ్‌స్టర్‌ ని కాల్చేశారు!

ఆర్బీఐ మళ్ళీ రూ.500 నోట్లను రద్దు చేయబోతోందా?