in

ఆర్బీఐ మళ్ళీ రూ.500 నోట్లను రద్దు చేయబోతోందా?

ఆర్బీఐ మళ్ళీ రూ.500 నోట్లను రద్దు చేయబోతోందా?

 

ఇటీవల రూ.2000 నోట్లు రద్దయిన విషయం తెలిసిందే. అయితే 2016 లో డీమోనిటైజేషన్ జరిగినప్పుడు ప్రజలు నోట్ల మార్పిడికి తిప్పలు పడినట్లు ఈ సారి పడలేదు.
అందులోనూ ధనవంతుల దగ్గర తప్ప ఎక్కువ శాతం సామాన్యుల దగ్గర ఈ రూ. 2000 నోట్లు లేకపోవడంతో ఈ సారి నోట్ల రద్దు ప్రభావం వారిపై అంతగా పడలేదు. అయితే ఇప్పుడు రూ.500 నోట్లను కూడా ఆర్బీఐ రద్దు చేస్తోందని.. రూ.1000 నోట్లను తిరిగి ప్రవేశపెడుతుందని ప్రచారం జరుగుతోంది. దీంతో మునుపటిలా మళ్లీ నోట్లు మార్చుకోవడం కోసం తిప్పలు పడాల్సి వస్తుందేమో అని సామాన్యుడు ఆందోళన చెందుతున్నాడు.

మరో వైపు ఈ వార్త నెట్టింట వైరల్ అయ్యి చెక్కర్లు కొడుతుండడంతో వారి ఆందోళన మరింత ఎక్కువైంది. దీంతో ఈ విషయం పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పందించి క్లారిటీ ఇవ్వక తప్పలేదు.

రూ.500 నోట్లను ఎట్టి పరిస్థితుల్లో రద్దు చేసి, రూ.1000 నోట్లను తిరిగి ప్రవేశపెట్టే ఆలోచన లేదని ఆర్బీఐ వెల్లడించింది. ఇక ఇప్పటికే రూ.2000 నోట్లు 50 శాతం బ్యాంకులకు చేరుకున్నాయని.. వీటి విలువ రూ.1.80 లక్షల కోట్లు ఉంటుందని తెలిపింది. 85 శాతం రూ.2 వేల నోట్లు డిపాజిట్ల రూపంలోనే వచ్చే అవకాశాలు ఉన్నాయని ఆర్బీఐ పేర్కొంది.

ఇదిలా ఉండగా కొన్ని నెలల కిందట రెండు వేల నోట్లు రద్దు చేయబోతున్నారని వచ్చిన వార్తలను కొట్టి వేస్తూ ఆర్బీఐ అప్పట్లో పేర్కొంది. కానీ ఆ మాట చెప్పిన రెండు మూడు నెలలకే రూ. 2000 నోట్లను రద్దు చేసి అందరికీ షాక్ ఇచ్చింది. దీంతో ఆర్బీఐ చెప్పిన మాటలు నమ్మడానికి లేదని.. రూ.500 నోట్లను ఎప్పుడైనా రద్దు చేయవచ్చని.. ప్రజలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

What do you think?

తమిళ స్టార్ తలపథి విజయ్ రాజకీయాల్లోకి?

పంచ్ ప్రసాద్ సహాయానికి ముందుకొచ్చిన ఏపీ ప్రభుత్వం