in

పంచ్ ప్రసాద్ సహాయానికి ముందుకొచ్చిన ఏపీ ప్రభుత్వం

పంచ్ ప్రసాద్ సహాయానికి ముందుకొచ్చిన ఏపీ ప్రభుత్వం

 

జబర్దస్త్ కమెడియన్ పంచ్ ప్రసాద్ కొద్ది రోజులుగా కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నారన్న విషయం సంగతి తెలిసిందే. ఇటీవల ఆయన ట్రీట్మెంట్ కోసం సోషల్ మీడియా వేదికగా ప్రజలను సాయం చేయమని ఆయన కుటుంబం కోరింది. ఎవరికి తోచిన సాయం వారిని చేయమంటూ ఫోన్ పే, బ్యాంక్ అకౌంట్లు కూడా ఇచ్చారు.

అయితే ఇప్పుడు ఆయనకు సహాయం చేయడానికి ఏపీ ప్రభుత్వం ముందుకు వచ్చింది. ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఆయనకు నిధులు విడుదల చేసేందుకు ఆంద్రప్రదేశ్ సర్కార్ కసరత్తు చేస్తోంది. ఈ మేరకు సీఎంఆర్ఎఫ్ (CMRF) ప్రత్యేక కార్యదర్శి మామిడి హరికృష్ణ, పంచ్ ప్రసాద్ కుటుంబసభ్యులతో టచ్‌లో ఉన్నారు. వారితో ఎల్ఓసీ (LOC) అప్లై చేయిస్తున్నారు. త్వరలోనే సీఎంఆర్ఎఫ్ నిధులతో ప్రసాద్‌కు సర్జరీ జరగనుంది. ఇలా ఏపీ ప్రభుత్వం తమకు సహాయం చేయడం ముందుకు రావడంతో పంచ్ ప్రసాద్, ఇంకా ఆయన కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

What do you think?

ఆర్బీఐ మళ్ళీ రూ.500 నోట్లను రద్దు చేయబోతోందా?

ప్రియురాలిని చంపి పోలీసులకు పిర్యాదు చేసిన పూజారి!