in

సెలవుపై వచ్చిన సైనికుడ్ని కిడ్నాప్ చేసిన ఉగ్రవాదులు

సెలవుపై వచ్చిన సైనికుడ్ని కిడ్నాప్ చేసిన ఉగ్రవాదులు

కాశ్మీర్ లో ఓ సైనికుడిని కొందరు కిడ్నాప్ చేశారు. ఈ ఘటన ఇప్పుడు అక్కడ కలకలం రేపుతోంది.

జమ్మూకాశ్మీర్ లైట్ ఇన్ఫాంట్రీ రెజిమెంట్కు చెందిన రైఫిల్ మ్యాన్ జావేద్ అహ్మద్ ఈద్ సందర్భంగా సెలవుపై ఇంటికి వచ్చాడు. అహ్మద్ రేపు అంటే జులై 31న తిరిగి డ్యూటీలో చేరాల్సి ఉంది.

నిన్న సాయంత్రం (జులై 29) 6.30 గంటల సమయంలో అహ్మద్ మార్కెట్లో కొన్ని వస్తువులు కొనేందుకు బయటకు వెళ్లాడు. అయితే రాత్రి 9 అవుతున్నా అహ్మద్ ఇంటికి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు అతన్ని వెతుక్కుంటూ వెళ్ళగా మార్కెట్ సమీపంలో వాళ్ళకి అహ్మద్ కారు కనబడింది. ఆ కారులో రక్తపు మరకలు కూడా ఉన్నాయి.
దీంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు కాశ్మీర్ పోలీసులను ఆశ్రయించారు. పొలీసులు కేసు నమోదు చేసి కొందరు అనుమానితుల్ని అదుపులోకి తీసుకున్నారు.
అయితే గతంలో సెలవుపై ఇంటికి వచ్చిన కొంత మంది సైనికులను కూడా కొందరు ఉగ్రవాదులు ఇలానే కిడ్నాప్ చేసి హతమార్చారు.

దీంతో అహ్మద్ ను కూడా ఉగ్రవాదులు కిడ్నాప్ చేశారని అనుమానిస్తున్న కుటుంబ సభ్యులు, అతన్ని విడుదల చేయమని కోరుతూ ఓ వీడియో స్టేట్మెంట్ను రికార్డ్ చేసి విడుదల చేశారు.

“దయచేసి మమ్మల్ని క్షమించండి. నా కొడుకును విడుదల చేయండి, నా అహ్మద్ ను విడుదల చేయండి. మేము ఇక అతన్ని ఆర్మీలో పని చేయనివ్వము, కానీ దయచేసి అతన్ని విడుదల చేయండి” అని సైనికుడి తల్లి ఆ వీడియోలో రోద్దించింది.
అహ్మద్ తండ్రి మహ్మద్ అయూబ్ మాట్లాడుతూ, “నా కొడుకు ఈద్ కోసం ఇంటికి వచ్చాడు. మళ్ళీ రేపు డ్యూటీలో చేరాల్సి ఉంది. అహ్మద్ మార్కెట్ నుండి వస్తుండగా కొందరు వ్యక్తులు కిడ్నాప్ చేసారు. నేను వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నాను, దయచేసి నా కొడుకును విడుదల చేయండి.” అని వేడుకున్నాడు.

What do you think?

లాటరీ రూపంలో అదృష్టం! ప్రతి నెలా రూ.5.5 లక్షలు

దెయ్యాలు ఉంటాయా? సైన్స్ చెబుతున్న సమాధానం..