in

దెయ్యాలు ఉంటాయా? సైన్స్ చెబుతున్న సమాధానం..

దెయ్యాలు ఉంటాయా? సైన్స్ చెబుతున్న సమాధానం..

దెయ్యాలు ఉంటాయా? ఈ ప్రశ్న మనుషుల అందరి మనసుల్లో ఎప్పట్నుంచో ఉన్న ప్రశ్న. దీనికి రకరకాల సమాధానాలు వస్తుంటాయి. కొందరు దేవుడు ఉంటే దెయ్యం కూడా ఉంటుంది కదా అని అంటే.. ఇంకొందరు ఇదంతా మన బ్రమ మాత్రమే సైన్స్ ప్రకారం దెయ్యాలు లేవు అంటారు. అలా అని దెయ్యాలు లేవని లేదా ఉన్నాయని ఎవరి దగ్గరా సరైన సమాధానాలు లేవు. మరి దెయ్యాలను నామ్మాలా? వాద్దా? అంటే తప్పకుండా చెప్పలేము కానీ మనము ఎదుర్కొనే కొన్ని దెయ్యాలు ఉండే ఉంటాయి అనిపించే సందర్భాలను సైన్స్ ప్రకారం అర్ధం చేసుకోవచ్చు. ఎందుకంటే ఏదైనా నిజం అని నిరూపించాలి అంటే సైన్స్ మనుషులకు ఉన్న ఒకే ఒక్క ఆయుధం కద.

స్లీప్ పెరాలిసిస్ (sleep paralysis)

కొందరు కొన్ని సమయాల్లో దెయ్యాల్ని చూశాము అంటారు. నిద్రపోయినప్పుడు తమ పై ఎవరో ఎక్కి కూర్చున్నారని అంటుంటారు. కొంత మంది పొడుకున్నప్పుడు సీలింగ్ మీద ఎవరో వెలాడుతూ కనిపించారు అంటుంటారు. ఇంకొందరైతే ఒక వింత ఆకారాన్ని లేదా జీవిని చూశామని చెబుతుంటారు. ఈ అనుభవాలన్నీ స్లీప్ పెరాలిసిస్ కిందకి వస్తాయి. మామూలుగా మనకి కలలు మనం పూర్తిగా నిద్రలో ఉన్నప్పుడు వస్తాయి. కానీ ఈ స్లీప్ పెరాలిసిస్ లో మనం మెలుకువగా ఉన్నపుడు వస్తుంటాయి. అంటే మన మైండ్ యాక్టివ్ గా ఉంటుంది మన కళ్ళు కదులుతూనే ఉంటాయి. కానీ మన బాడీ మాత్రం పారలైజ్ అయ్యి ఉంటుంది. ఈ సమయంలో మన నిద్రలో వచ్చే కలలన్నీ మన కళ్ళెదుట జరుగుతున్నట్టు కనిపిస్తాయి. ఆ సమయంలో కలలో కనిపించే దెయ్యాలు, వింత ఆకారాలు కనిపిస్తాయి.మనం వాటిని నిజంగానే జరుగుతున్నట్లు అనుకుంటాం. ఇది మన బ్రమ (hallucination). ఈ కలలు వచ్చే స్టేజ్ ని రాపిడ్ ఐ మూవ్మెంట్ (rapid eye movement) లేదా రెం (REM) స్లీప్ అంటారు.

అయితే మన బాడీ ఈ సమయంలో మన కంట్రోల్లో ఉండదు కాబట్టి చిన్న చిన్న దెబ్బలు తగలడం, దేనికైనా గుద్దుకోవడం జరుగుతుంది. ఇలా జరగకుండా చూడడానికే మన మైండ్ మన బాడీని పారలైజ్ (paralyze) చేస్తుంది. మనకు మెలుకువ వచ్చిన తరువాత మళ్ళీ మన బాడీకి మామూలు కదలిక వచ్చేస్తుంది.

ఇప్పటివరకు చెప్పింది సులువుగా అర్ధం అయ్యే విధంగా చెప్పాలి అంటే స్లీప్ పెరాలిసిస్ అనేది ‘కళ్ళు తెరిచి కలలు కనడం’ అనమాట.

పరేడోలియా (pareidolia)

రోజు మన చుట్టూ చాలా జరుగుతుంటాయి. రకరకాల పరిస్థితులు, ఎన్నో అనుభవాలు వాటన్నిటినీ మన బ్రెయిన్ స్టోర్ చేసుకుంటుంది. అయితే ఇది అనుకున్నంత సులువైన పని కాదు. మన కళ్లు చూడడం, చెవులు వినడం, చర్మం ప్రతి దాన్ని ఫీల్ అవ్వడం, ఇలా మన బాడీలో చాలా జరుగుతుంటాయి. వీటి ద్వారా వచ్చిన సమాచారాన్ని మన బ్రెయిన్ మనకి అర్ధం అయ్యేలా చేయాలి. ఈ సమయంలో మన బ్రెయిన్ ముఖ్యం అయిన విషయాల్ని మాత్రం ఎక్కించుకుని మిగిలిన గ్యాప్ ని నింపుతుంది. దీని వల్ల మనకు కనిపించిన వాటికి మన బ్రెయిన్ ఒక ఆకారం ఇస్తుంది. దీన్ని శ్రాస్త్రవేత్తలు పరేడోలియా అంటారు.

మనం ఆకాశంలో చూసినప్పుడు మనుషులు, కుందేళ్ళు లేదా ఏదైనా వింత జీవుల ఆకారం ఇందు వల్లే కనిపిస్తుంది. మనకు దూరంలో ఉన్న దాన్ని చూసినప్పుడు లేదా చీకటిలో ఏదైనా చూసినప్పుడు మనకు వింత ఆకారాలు, కొన్ని సార్లు మనం అనుకునే దెయ్యాలు కనపడతాయి. ఇది కూడా మన బ్రమే (hallucination).

మనం ఏదైనా పాట విన్నప్పుడు మనకు ఆ పాట సరిగ్గా అర్ధం కాకపోయినా అర్ధం అయ్యే పదాలతో మన బ్రెయిన్ నింపుతుంది.
ఇంకా సులువుగా చెప్పాలి అంటే మన బ్రెయిన్ అర్ధం లేని వాటిలో కూడా అర్ధం వెతుకుతుంది.

ఘోస్ట్ హంటర్స్/ పారానార్మల్ ఇన్వెస్టిగేటర్స్ దెయ్యాల గురించి ఇన్వెస్టిగేట్ చేసేటప్పుడు కొన్ని శబ్దాలను రికార్డు చేస్తారు. మామూలుగా వింటే అవి ఏ అర్ధం లేని శబ్దాలు. కానీ శబ్దంలో మాటలు ఉన్నాయి అనుకుంటే ఆ శబ్దంలో మనం అనుకుంటున్న మాటలు వినిపిస్తాయి.
మనకు జీవితంలో ఎదురైన లేదా ఎదురైయే చాలా అనుభవాలను పైన చెప్పిన స్లీప్ పెరాలిసిస్, పరేడోలియా ద్వారా చాలా వరకు సాల్వ్ చేయొచ్చు.

అలా అని ప్రతి దానికి సైన్స్ సమాధానం అని చెప్పలేము. ఎందుకంటే మనం ఎందుకు నిద్రపోతామో, కలలు ఎందుకు కంటామో సైన్స్ కి ఇప్పటి వరకూ తెలీదు. టైం ఏంటో, ఎందుకు ఉందో, అది ఒకే విధంగా ఎందుకు నడుస్తుందో ఇప్పటికీ సైన్స్ దగ్గర సరైన సమాధానం లేదు.

What do you think?

సెలవుపై వచ్చిన సైనికుడ్ని కిడ్నాప్ చేసిన ఉగ్రవాదులు

పెట్రోల్ బంకు సిబ్బందిని చితకబాదిన వాహనదారులు