పెట్రోల్ బంకు సిబ్బందిని చితకబాదిన వాహనదారులు
తెలంగాణలోని ఓ పెట్రోల్ బంకులో సిబ్బందిని వాహనదారులు చితకబాదారు. పెట్రోల్ బంక్ లో పెట్రోల్ కి బదులు నీళ్ళు రావడంతో ఈ ఘటన చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే తెలంగాణాలోని మంచిర్యాలలోని హైటెక్ సిటీ వద్ద ఉన్న హిందుస్తాన్ పెట్రోలియమ్ బంకులో ఓ వాహనదారుడు పెట్రోల్ కొట్టించాడు. అయితే అతనికి పెట్రోల్ కొట్టేటప్పుడు పెట్రోల్ కి బదులు నీళ్ళు వచ్చాయి. ఇలానే చాలామంది వాహనదారులకు అక్కడ పెట్రోల్ బదులు నీళ్ళు వచ్చాయి.
దీంతో వాహనదారులు యాజమాన్యాన్ని నిలదీశారు. ఈ క్రమంలో కోపోద్రిక్తులైన వాహనదారులు యజమానిపై, బంక్ సిబ్బందిపై దాడికి దిగి, వారిని చితకబాదారు. ఇందుకు సంబంధించిన ఓ ప్రస్తుతం సోషల్ వీడియోలో వైరల్‌గా మారింది.