in ,

మిస్టరీ స్టోరీ వర్ణ – చాప్టర్ 3 – కథ మొదలైంది

మిస్టరీ స్టోరీ వర్ణ – చాప్టర్ 3 – కథ మొదలైంది

జులై 17, ఉదయం 11

విక్రమ్ తన రూంలో బెడ్ ఉన్నా ఫ్లోర్ మీద పొడుకున్నాడు. రాత్రి కూడా నిద్రలేదని తన కళ్ళలో కనిపిస్తుంది. తిరగలేక తిరుగుతున్న సీలింగ్ ఫ్యాన్ను చూస్తూ విక్రమ్ ఆలోచనల్లో మునిగిపోయాడు.

“కళ్లు మూసుకుంటే నువ్వు అన్న ఆ మాటలే గుర్తుకొస్తున్నాయి అమ్మ. భయం వేస్తుందని చెప్పావు. నా మనసులో కూడా అదే ఫీలింగ్ ఉన్నా నేను పట్టించుకోలేదు. నిన్ను నాన్నని తీసుకుని అప్పుడే ఈ సిటీ వదిలి వెళ్లిపోవాల్సింది. కనీసం ఆ రోజు నీతో ఉండాల్సింది అమ్మ. “ఆ ఒక్క రోజు.”

ఇదే మాట తన మనసులో పదే పదే వినిపిస్తుంది. కుడి చేతి పిడికిలి తనకి తన మీదే కోపం వచ్చి బిగుసుకుంది. చేతి వేళ్ళు అరచేతిలో చొచ్చుకుపోవాలి అనేంత గట్టిగా విక్రమ్ చేతిని బిగించాడు. ఆ వేళ్ళ గోళ్లు అరచేతిలో గుచ్చుకుని వస్తున్న నొప్పి విక్రమ్ కి తెలుస్తుంది. కానీ తన గుండెల్లో మండుతున్న గిల్టీ అనే మంటకి ఆ నొప్పి సరిపోలేదు. “ఆ ఒక్క రోజు.. ఆ ఒక్క రోజు.. ఆ ఒక్క రోజు…” అంటూ పిడికిలిని ఇంకా గట్టిగా బిగించి ఎవర్నో పంచ్ చేయాడానికి అన్నట్లు ఒక్కసారి పిడికిలిని గాల్లో పైకి విసిరాడు.

తను చేతి మీద పెట్టిన ప్రెజర్ (pressure) కి రాత్రి మణికట్టు దగ్గర గాయం అయిన చోట నుంచి మళ్లీ రక్తం కారడం మొదలైంది. ఆ గాయం నుంచి ఓ చిన్న రక్తపు బొట్టు కుడి కంటి రెప్ప కింద పడింది.

అమ్మ చనిపోయిన రాత్రి షాక్ వల్ల విక్రమ్ కంట కన్నీళ్లు రాలేదు. ఆ షాక్ నుంచి తేరుకున్న తరువాత తన కన్నీళ్లకి అదుపు లేదు.

ఏడ్చి ఏడ్చి ఇక ఆ కన్నీళ్లు కూడా ఇంకిపోయిని. ఇప్పుడు ఇంకిపోయిన ఆ కన్నీళ్ళ స్థానాన్ని ఈ రక్తపు బొట్టు నింపింది.

విక్రమ్ ఆ రక్తాన్ని ఎడమ చేత్తో తుడుచుకుని, గాల్లో ఎత్తిన పిడికిలిని నేలకు కొట్టాడు. అది నేలకి వేగంగా పడడం వల్ల వేళ్ళ ఎముకలకు కొట్టుకుని దెబ్బ గట్టిగా తగిలింది. వళ్ళంతా ఒక్కసారి షాక్ తగిలినట్లైంది. కానీ ఆ నొప్పి కూడా తన మనసులో బాధకు సరిపడలేదు.

“ఇప్పుడే ఈ క్షణమే చచ్చిపోతే బావుండు” అనుకున్నాడు. గుండెల్లో పాతుకుపోయిన జ్ఞాపకాలు, అలుపు లేకుండా పరుగెడుతున్న పిచ్చి ఆలోచనలు మళ్లీ మెల్లమెల్లగా మనసుకి చేరుకుంటున్నాయి.

ఈ లోపు వాటిని చెదరగొడుతూ ఫోన్ రింగ్ అయ్యింది. విక్రమ్ తనకు ఎడమ వైపు నేల మీద ఉన్న ఫోన్ను తలెత్తకుండా తిప్పి చూశాడు. ఫోన్ స్క్రీన్ మీద “నాన్న” అని కాంటాక్ట్ కనిపించింది.

ఆ రోజు అమ్మ చనిపోయినప్పటి నుంచి నాన్న నాన్నలా లేరు. ఎప్పుడూ చిరు నవ్వుతో కనిపించే అమ్మ మొహం లేకపోవడంతో నిత్యం నవ్వించే నాన్న గొంతు మూగబోయింది.
ఇంకా ఇక్కడే ఉంటే ఆయనకు కూడా ఏమైనా అవుతుందని వేరే సిటీలో ఉంటున్న వాళ్ళ బాబాయి ఇంటికి పంపేశాడు. తను మాత్రం ఇక్కడ నుంచి వెళ్ళలేక పోయాడు. అమ్మ జ్ఞాపకాలతోనో.. అమ్మను చంపిన వాడి మీద పగతోనో.. తనకు సమాధానం తెలీదు. కానీ తన మనసులో చల్లారని ఆవేశం, హంతకుడ్ని చంపినాకే పోతుందేమో..

******
అరగంట తరువాత,

విక్రమ్ ఆలోచనల్లో మునిగిపోయి నడుస్తున్నాడు. అప్పుడే ఒక్కసారి గట్టిగా కారు హార్న్ (car horn) మోగింది. విక్రమ్ ఆలోచనల్లో నుంచి బయటికి వచ్చాడు. తను నడి రోడ్లో నడుస్తున్నాడు. ఎక్కడికో వెళ్ళడానికి ఇంటి నుంచి బయలు దేరాడం గుర్తుంది. కానీ ఆలోచనల్లో పడి ఎంత దూరం వచ్చాడో గమనించలేదు.

వెంటనే కారుకు అడ్డు తప్పుకుని పక్కకి వచ్చి నిలబడి చుట్టూ చూశాడు. తను బ్యాక్ వార్డు స్ట్రీట్ లో ఉన్నాడు. అక్కడ సూది నుంచి సిల్వర్ చైన్స్ వరకు అన్ని దొరుకుతాయి. అది కూడా చాలా తక్కువ ప్రైస్ కి.

అక్కడ కొంచం దూరంలో ఒక డంపింగ్ యార్డ్ ఉండడం వల్ల ఆ స్ట్రీట్ అంతా ఒక దారుణం అయిన గ్యాస్ స్మెల్ కొడుతుంది. మరి ఇలాంటి చోటే ఈ షాప్స్ ఎందుకు ఉన్నాయి అని అడిగితే ఇక్కడ అమ్మేవి కొన్ని కొన్నవైతే కొన్ని కొట్టు కొచ్చినవి. పొలీసులు బయట ఎక్కడైనా ఏమైనా జరిగతే పట్టించుకుంటారు. కానీ ఆ స్ట్రీట్ లో వచ్చే ఆ ఘోరమైన స్మెల్ కి అక్కడికి రావడానికి ఇష్టపడరు. సీరియస్ ఇష్షూ (issue) కానంత వరకు ఆ స్ట్రీట్ ను అవాయిడ్ చేస్తారు. దీంతో అక్కడ అన్ని లీగల్ అండ్ ఇల్లీగల్ పనులు సాఫీగా, సేఫ్ గా సాగిపోతాయి.

విక్రమ్ తను నిల్చున్న ప్లేస్ నుంచి కొంచెం ముందుకు నడిచి లెఫ్ట్ (left) తీసుకున్నాడు. ఆ సందు కూడా షాపులతో నిండిపోయుంది. తన కుడి చేతి వైపు ఒక చిన్న ఐస్ క్రీం పార్లర్ ఉంది. విక్రమ్ ఆ పార్లర్ లోకి వెళ్ళాడు.

పార్లర్ అంతా కాళీగా ఉంది. ఓనర్ చైర్ లో కూర్చుని ఫోన్ లో రీల్స్ చూస్తున్నాడు. విక్రమ్ చుట్టూ చూస్తూ నెమ్మదిగా నడుచుకుంటూ ఓనర్ దగ్గరకు వెళ్ళాడు. అప్పుడే రీల్స్ చూడడం ఆపి లోపలికి వచ్చిన విక్రమ్ ని ఓనర్ గమనించాడు.

నెమ్మదిగా కుర్చీలో నుంచి లేస్తూ “ఏం కావాలి సార్?” అని అడిగాడు.

విక్రమ్ 2-3 సెకన్లు ఓనర్ నే చూస్తూ ఉన్నాడు.

తనకు వినిపించలేదేమోనని “సార్.. ” అని మళ్ళీ కొంచం పెద్దగా పిలిచాడు ఓనర్.

” ఒక గన్ కావలి..” అన్నాడు విక్రమ్.

“ఏంటి? తాగొచ్చారా… ఇది ఐస్ క్రీం పార్లర్ .” అని వెటకారంగా అన్నాడు ఓనర్.

” నీ దగ్గర ఉండదని తెలుసు. ఎక్కడ దొరుకుతుందో నీకు తెలుసని తెలుసు.” అని విక్రమ్ సూటిగా చెప్పాడు.

“అవునా.. గన్స్ ఎక్కడుంటాయో తెలుసని నేనెప్పుడూ నీకు చెప్పనట్లు గుర్తు లేదే.. సారీ వెళ్తే రీల్స్ చూసుకుంటా” అంటూ చెయ్యి ఎక్సిట్ డోర్ వైపు చూపించాడు.

“ఒక్క నిమిషం నేను చెప్పేది విను. ఆ తరువాత నేనే వెళ్లిపోతా.. ఇది.. ఇస్ క్రీం పార్లర్ కద.”

“కనపడట్లేద..”

“మరి ఇక్కడ నుంచి ఐస్ క్రీమ్స్ వెళ్ళాలి కానీ వాటికి బదులు డ్రగ్స్ వెళ్తున్నాయి.” అని అడిగాడు విక్రమ్.

విక్రమ్ ఈ బాక్ వార్డ్ స్ట్రీట్ కి చాలా సార్లు వచ్చాడు. ఆ సమయంలో ఒక సారి అసలు జనలాకు కనిపించని, గమనించలేని ఒక సందులో ఓ చిన్న ఐస్ క్రీం పార్లర్ ను చూశాడు. కానీ దాన్ని పెద్దగా పట్టించుకోలేదు.

మరో సారి వచ్చినప్పుడు. ఆ పార్లర్ లో నుంచి ఒక వ్యక్తి చేతిలో చిన్న చిన్న ప్యాకెట్స్ ను ఎవరికి కనిపింకూడదని దాచుకుని తీసుకువెళ్ళడం గమనించాడు.

విక్రమ్ కి అంతలా దాచుకుని ఏం తీసుకువెళ్తున్నాడా అని అనుమానం వచ్చింది. ఈ లోపు అదేసమయంలో ఎవరో ఇద్దరు మాట్లాడుకుంటున్న మాటలు విక్రమ్ చెవిన పడ్డాయి. తను ఉన్న ప్రదేశంలోనే కదలకుండా నిల్చుని వాళ్ళ మాటలు శ్రద్ధగా విన్నాడు.

ఆ ఇద్దరిలో ఒకడు “వాడి పనే బావుంది రా. అలా అమ్ముతాడు. ఇలా లక్షలు లక్షలు తీసుకుంటాడు. ” అన్నాడు.

అతని పక్కనున్న ఇంకొకడు ” ఏం చేస్తాడు రా.. లక్షలు రావడానికి” అని అడిగాడు.
“డ్రగ్స్” అని మొదటి వ్యక్తి నెమ్మదిగా చెప్పాడు.

ఆ మాటలు విన్న విక్రమ్ తనకెందుకులే అని అప్పుడు అక్కడి నుంచి పట్టించుకోకుండా వెళ్లిపోయాడు.

కానీ ఇప్పుడు ఆ మాటలే తనకు హెల్ప్ చేసిని. ఎందుకో అక్కడ బ్యాక్ వార్డ్ స్ట్రీట్ లో గన్స్ దొరుకుతాయని విక్రమ్ కి అనిపించింది. కానీ ఎవరు అమ్ముతారు. ఈ విషయాన్ని తెలుసుకోడానికి ఐస్ క్రీం పార్లర్ కి వెళ్ళాడు.

“డ్రగ్సా..?” అంటూ ఓనర్ కొంచం భయంగా అడిగాడు.

” ఇక్కడ డ్రగ్స్ అమ్ముతున్నావు అంటగా.. దానికి ప్రూఫ్ కూడా నా దగ్గర ఉంది” అన్నాడు విక్రమ్.

నిజానికి తన దగ్గర ప్రూఫ్ ఏమీ లేదు. ఓనర్ ని ఇంకా భయపెట్టాలని అలా చెప్పాడు.

“ఏం చెప్పాలో తెలియక” ఓనర్ సైలెంట్ అయ్యి అలా విక్రమ్ ని చూస్తూ ఉన్నాడు.

“నేను పోలీసుల దగ్గరకు వెళ్ళకూడదనుకుంటే హెల్ప్ చెయ్యి. నాకు ఒక గన్ కావాలి. ” అన్నాడు విక్రమ్.

“నా దగ్గర లేదు.” ఓనర్ సూటిగా సమాధానం ఇచ్చాడు.

” చెప్పేది విను. దానికి ఎంత డబ్బైనా ఇస్తా” అన్నాడు విక్రమ్.

ఓనర్ విక్రమ్ మాటలకి భయపడలేదు కానీ తను ఇస్తా అన్న డబ్బుకి ఆశపడ్డాడు.

“ఎంతిస్తావు? అని అడిగాడు ఓనర్.

“నీకు ఎంత కావాలో చెప్పు” అన్నాడు విక్రమ్.

“5 లక్షలు” అన్నాడు ఓనర్.

విక్రమ్ అంత ఇవ్వడానికి ఒప్పుకున్నాడు. కానీ తనకు గన్స్ ఎక్కడ అమ్ముతారో ఓనర్ చూపించలేదు.

“ఓకే. డబ్బు తీసుకుని ఒక గంటలో రా.” అని అక్కడి నుంచి విక్రమ్ ని పంపేశాడు.

సరిగ్గా గంట తరువాత విక్రమ్ మళ్ళీ ఐస్ క్రీం పార్లర్ కి చేరుకున్నాడు. ఓనర్ విక్రమ్ ను లోపలికి తీసుకెళ్లి ఒక గన్ చేతులో పెట్టాడు.

” లేదన్నావు? .” అని అడిగాడు విక్రమ్.

“నిజంగానే లేదు. తెప్పించా..” అని సమాధానం ఇచ్చాడు ఓనర్.

*****

రాత్రి 10 గంటలు.

రవీంద్ర ప్లాన్ చేసిన విధంగానే 20 మంది టీమ్ తో వర్ణ సిటీ నలువైపులా స్ప్రెడ్ అయిపోయాడు.
తన నలుగురి టీమ్ తో సిటీ ఔట్ కట్స్ లో చీమ చిటుక్కుమన్న శబ్దాన్ని కూడా జాగ్రత్తగా గమనిస్తూ తిరుగుతున్నాడు.

“అందరూ అలెర్ట్ గా ఉండండి. Hold your guns in your hands.” అని టీమ్ కి చెప్పాడు రవీంద్ర.

విక్రమ్ టీమ్ లో వినయ్ -30, కిషోర్ -28, షేకర్ – 27, నవీన్ -30 ఉన్నారు.

రవీంద్ర కి “Yes. Sir” అని నలుగురు ఒకేసారి సమాధానం ఇచ్చారు.

రవీంద్ర ముందు నడుస్తుంటే టీమ్ మెంబర్స్ తనకు కొంచెం వెనుక నడుస్తున్నారు.

“నైట్ ఇన్వెస్టిగేషన్ మానేసాం కద బ్రో. మళ్లీ ఏంటి? ” అని రవీంద్ర కు వినిపించకుండా పక్కనున్న షేకర్ ను అడిగాడు నవీన్.

“ఓ.. నువ్వు నిన్న మీటింగుకి రాలేదు కద. హోమ్ మినిస్టర్ 10 డేస్ టైమే ఇచ్చాడు. ఈ కేసు సాల్వ్ చేయడానికి” అని సమాధానం ఇచ్చాడు షేకర్.

“చచ్ఛాం పో.. ” ఓ చిన్న నెర్వస్ నవ్వుతో అన్నాడు నవీన్.

రవీంద్ర వాళ్ళకి కొంచం దూరంలో రోడ్డు మీద ఓ లైట్ ఫ్లికర్ అవుతూ ఆగి వెలుగుతూ ఉంది. వాళ్ళకి ముందు కనుచూపు మేరలో ఆ ఒక్క లైట్ తప్ప వెలుగుతున్న ఇంకో లైట్ కనిపించలేదు.

ఆ చుట్టు పక్కల ఎక్కువ వెల్తురు లేకపోవడంతో రవీంద్ర అలెర్ట్ గా ఉండమని టీమ్ కి మళ్ళీ చెప్పాడు.

ఏం జరుగుతోందో అన్న చిన్న భయంతో అందరూ ఒకరికి ఒకరు దగ్గరగా వచ్చేశారు. వాళ్ళు నెమ్మదిగా ఫ్లికర్ అవుతున్న లైట్ దగ్గరగా వెళ్ళారు. ఆ లైట్ ఒక్కసారిగా పేలినట్లు ఓ చిన్న శబ్దం చేసి ఆగి మళ్ళీ వెలిగింది. ఆ శబ్దానికి వెంటే బుల్లెట్ షూట్ అయిన శబ్దం వచ్చింది.

అందరూ ఒక్కసారిగా కొంచం దూరం దూకి వెనక్కి తిరిగారు. కానీ షేకర్ మాత్రం ఎక్కడున్నాడో అక్కడే ఉన్నాడు.

“సారీ సార్. బై మిస్టేక్ షూట్ అయ్యింది” అని సిల్లీగా నవ్వుతూ అన్నాడు షేకర్.

” ఇడియట్. ట్రిగ్గర్ మీద వేలు పెట్టి క్యారీ చేస్తున్నావా?” అని షేకర్ ని తిట్టాడు రవీంద్ర.

షేకర్ వెంటనే ట్రిగ్గర్ నుంచి వేలు తీసేసాడు.

ఏమీ జరగలేదని అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కానీ ఈలోపే వాళ్ళకి కొంచం దూరంలో ఎవరో కదులుతున్నట్లు వెనక నుంచి శబ్దం వినిపించింది.

రఘు ఆపర్చునిటీ మిస్ అయిపోతుంది అన్నట్లు ఒక్కసారిగా వెనక్కు తిరిగి ముందుకు దూకి పరుగెట్టాడు.
తనని సార్ అని పిలుస్తూ టీమ్ కూడా వెనకే పరుగెట్టింది.

అలా పరుగెడుతూ కొంత దూరం వెళ్ళగానే రవీంద్రకి చీకట్లో ఓ మనిషి ఆకారం కనిపించింది వెంటనే గన్ ని గన్ హోల్స్టర్ (gun holster) లో పెట్టి మరుక్షణం ఆలోచించకుండా ఆ ఆకారం మీదకి దూకేశాడు.

10 నిమిషాల ముందు.

విక్రమ్ ఆకాశంలో చంద్రుడ్ని చూస్తూ నడుస్తున్నాడు. ఆకాశం ఫ్రీగా ఒక్క మబ్బు కూడా లేకుండా కనిపించింది. అది ఎప్పుడూ తన మనసు పరిస్థితిని ఎలా చూపిస్తుందా అని ఆశ్చర్యపోతూ ఆలోచిస్తున్నాడు. ప్రస్తుతం తన మనసు కూడా ఏ ఫీలింగ్ లేకుండా అలాగే బ్లాంక్ గా లైఫ్ లెస్ గా ఉంది.

ఆ ఆలోచన నుంచి బయటకి వచ్చి ఆగి తన వెయిస్ట్ దగ్గర చెయ్యి పెట్టి చూశాడు. గన్ అక్కడే ఇంచు కదలకుండా ఉంది. మళ్ళీ నడక మొదలు పెట్టాడు.

అప్పుడే ఎదో గట్టి శబ్దం వచ్చింది. వెంటనే పరుగెట్టి కొంచం దూరం వెళ్ళి ఆగాడు. ఇంకో సెకండ్ లో ఎవరో తన మీదకు దూకారు. ఇద్దరూ కింద పడిపోయారు. విక్రమ్ తన ప్యాంట్ నుంచి గన్ తీయడానికి చూశాడు. కానీ ఆ వ్యక్తి దానికి అవకాశం ఇవ్వలేదు. ఇద్దరూ ఒకరి మీద ఒకరు ఎక్కుతూ కొట్టుకున్నారు. ఒక వైపు నుంచి రెండు దెబ్బలు కొడితే ఇంకో వైపు నుంచి రెండు దెబ్బలు పడిని. ఇద్దరూ ఒకరిని ఒకరు గుండెల మీద తన్నుకున్నారు. చేతులు విరుచున్నారు.

విక్రమ్ వెనక నుంచి ఆ వ్యక్తి మెడను బిగించబోయాడు. కానీ అతను అవకాశం ఇవ్వకుండా విక్రమ్ ను అవతలకు నెట్టి పక్కకి వచ్చాడు. ఆ సమయంలో వెనక్కి పడిన విక్రమ్ వెంటనే నిల్చుని గన్ ని తీసి తన చేత్తో పట్టుకున్నాడు.

ఆ వ్యక్తి జంకి రెండడుగులు వెనక్కి వేశాడు. విక్రమ్ రెండడుగులు ముందుకు వేశాడు. ఇద్దరూ లైట్ వెల్తురులోకి వచ్చారు. విక్రమ్ కి ఎవరో పరుగెడుతూ వస్తున్న శబ్దం వినిపించింది ఒక సెకండ్ తల తిప్పాడు. అంతే ఆ వ్యక్తి విక్రమ్ చేతిని కొట్టి గన్ లాక్కున్నాడు. తన చేతిని వెన్నకి విరిచి కాలు మీద తన్ని మోకాళ్ళ మీద కూర్చో బెట్టాడు. ఇదంతా విక్రమ్ కళ్ళు తిప్పిన రెండు సెకండ్లలో జరిగిపోయింది.

“are you ok sir.” అంటూ అప్పుడే అక్కడికి వచ్చిన నవీన్ ఆయాస పడుతూ అడిగాడు. షేకర్, వినయ్, కిషోర్ కూడా అప్పుడే వచ్చి ఆయాస పడుతున్నారు.

రవీంద్ర విక్రమ్ ముందుకొచ్చి విక్రమ్ నుంచి తీసుకున్న గన్ ని తనకే ఎయిం చేసి ” కిల్లర్ ..” అన్నాడు.

విక్రమ్ తల పైకెత్తి రవీంద్రని చూసాడు.

విక్రమ్ రవీంద్ర ఎదురుపడ్డారు.

కథ మొదలైంది.

To be continued.

What do you think?

దగ్గినందుకు జైలు శిక్ష విధించిన సింగపూర్ కోర్టు

80 ఏళ్లు పైబడిన వారికి ఇంటి నుంచే ఓటు వేసే సదుపాయం