in ,

తెలుగు మిస్టరీ స్టోరీ ‘వర్ణ’- చాప్టర్ 1- మర్డర్స్

తెలుగు మిస్టరీ స్టోరీ ‘వర్ణ’- ఎపిసోడ్ 1 – మర్డర్స్

2025, జులై 15
రాత్రి 8 గంటలు.

వర్ణ సిటీ మూగబోయుంది. అంతా నిర్మానుష్యంగా, నిశబ్దంగా ఉంది. వీదుల్లోని రోడ్లు లైట్ల వెలుగులతో మెరుస్తుంటే, సిటీలోని ఇళ్లు చీకటితో నిండిపోయిని.

ఆ ఇళ్లలో నవ్వులు లేవు. ప్రతి ఒక్కరి కళ్ళలో చావు భయం తప్ప. “ఈ రాత్రి బ్రతికితే చాలు.” అందరిదీ ఇదే కోరిక. నిద్రపోయి ఎన్ని రోజులయ్యిందో వాళ్ళకి గుర్తులేదు. ఇంకెన్ని రోజులుండదో తెలీదు.

ఆ చీకటి రాత్రి నిశబ్దంలో సిటీ ఔట్ కట్స్ (out – cuts) లో ఓ పెద్ద అరుపు వినిపించింది. ఇంకో ప్రాణం పోయిందని ఆ చుట్టు పక్కల వారికి అర్థం అయ్యింది.

******

తరువాత రోజు – జులై 16,
ఉదయం 7 గంటలు.

స్పెషల్ ఆఫీసర్ రవింద్ర, ఓ అమ్మాయి చావుని ఇన్వెస్టిగేట్ చేస్తున్నాడు. ముందు రోజు రాత్రి వినిపించింది ఆ అమ్మాయి అరుపే. ఆ అమ్మాయికి 25 ఏళ్లు ఉంటాయి. ఇంట్లో ఆమె ఒక్కతే ఉంటుంది. జాబ్ కోసం ఈ వర్ణ సిటీకి వచ్చిందని ఇన్వెస్టిగేషన్ లో తెలిసింది. తను చనిపోయిందని ఆమె పేరెంట్స్ కి ఇన్ఫాం (inform) చేశారు.

తనని ఎవరో కూర్రంగా చంపారు. ఆమె బాడీ అ డ్డంగా రెండు ముక్కలయ్యి ఉంది. ఆమెను చంపిన విధానం చూస్తే ఎదో వైల్డ్ యానిమల్ (animal) చంపిందా? అనుకునేలా ఉంది.

రవింద్ర ఆమె రూమంతా చుట్టి చూశాడు. ప్రతి మూలని జాగ్రత్తగా గమనిస్తూ తిరిగాడు. అంతా నీట్ గా ఉంది. కొన్ని జతల బట్టలు, ఒక లాప్టాప్ (laptop), ఒక ఐ ఫోన్, ఒక రైస్ కుక్కర్ (rice cooker) ఆ అమ్మాయికి సంభందించిన వస్తువులు ఇవే ఉన్నాయి.

తను చనిపోయి పడున్న ప్లేస్ లో తప్ప ఇంకా ఎక్కడా బ్లెడ్ మార్క్స్ లేవు. సో (So) కిల్లర్ కి, ఆమెకి మధ్య స్ట్రగుల్ (struggle) జరిగినట్లు కనిపించడం లేదు. అంటే కిల్లర్ ని చూసిన మరు క్షణమే ఆమె చనిపోయింది.

రవింద్ర ఆమె ప్రతి బాడీ పార్ట్ ని జాగ్రత్తగా పరిశీలించాడు. ఒక్కసారి కాదు. అక్కడ తిరుగుతున్నంత సేపు చూస్తూనే ఉన్నాడు. మళ్ళీ మళ్ళీ పరిశీలిస్తూనే ఉన్నాడు. కానీ ఈ సారి కూడా ఒక్క సరైన క్లూ కూడా దొరక లేదు. రవీంద్ర నిస్పృహ (despiration) తో ఇంట్లో నుండి బయటకి వచ్చి ఒక సిగరెట్ వెలిగించుకున్నాడు. ఆలోచనలలో మునుగుతూ ఆకాశంలోకి చూశాడు.

ఇది మొదటి హత్య కాదు. చివరి హత్యని ఎవరూ చెప్ప లేరు. ఎందుకంటే ఈ హత్యలకు కారణం ఏంటో ఇంకా తెలీదు. రాత్రి పూట ఒకరు వంటరిగా ఉన్నపుడు, చుట్టు పక్కల ఎవరూ లేనప్పుడు చంపుతున్నారు. ఇప్పటి వరకు 60 మందికి పైగా చనిపోయారు. ఎవరో త్వరగా కనిపెట్టకపోతే ఇక పై కూడా చనిపోతారు. కానీ చనిపోయినా వారిలో ఒకరికి ఒకరితో ఏ సంబంధం లేదు. వారి మర్డర్స్ (murders) లో ఒక పాటర్న్ (pattern) లేదు.

పొలీసులు ఈ కేసులను సాల్వ్ చేద్దామని ఎంత ప్రయత్నించినా వారికి ఒక్క క్లూ కూడా దొరకలేదు. రోజు రోజుకి చావులు పెరిగిపోవడం, ప్రజలలో భయం ఇంకా ఎక్కువ అవుతుండడంతో అధికారుల పైన ప్రెజర్ (pressure) ఎక్కువైంది. దీంతో ఈ కేసులను ఇన్వెస్టిగేట్ చేయడానికి రవింద్రని స్పెషల్ ఆఫీసర్ గా అప్పాయింట్ చేశారు. రవింద్రకి 35 ఏళ్లు ఉంటాయి. తను ఏ కేసు టేకప్ చేసినా మాక్సిమమ్ (maximum) సాల్వ్ చేసేస్తాడని డిపార్ట్మెంట్ లో ఒక మంచి నమ్మకం ఉంది. ఆ నమ్మకంతోనే ఈ కేసును రవింద్రకి అప్పగించారు.

కానీ తను ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసి 6 months అయినా ఇంకా కేసును సాల్వ్ చేయగలిగే ఒక్క ఆధారం కూడా దొరకలేదు. దీంతో ఫస్ట్ టైం రవింద్ర కూడా ఓ కేసును సాల్వ్ చేయడంలో ఫెయిల్ అయ్యాడని డిపార్ట్మెంట్ లో గుసగుసలు మొదలయ్యాయి.

అందుకే డిపార్ట్మెంట్ మీద ప్రజలకు నమ్మకం పోయేలోపే ఏదొకటి చేయాలని హైయర్ అప్స్ (higher – up’s) ఈ రోజు ఓ మీటింగ్ అరేంజ్ (arrange) చేశారు.

******

రాత్రి 7 గంటలు,

అనుకున్న విధంగానే అందరూ మీటింగ్ కి అటెండ్ అయ్యారు. హోమ్ మినిస్టర్ హరీష్ చంద్ర, మేయర్ భగవాన్ కృష్ణ, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ హెడ్ జి. ఆనంద్, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ లీడర్ రవింద్ర, ఆయన టీమ్ మెంబర్స్ వినయ్, కిషోర్, షేకర్ అందరూ ఒక క్లోజ్డ్ (closed) రూంలో కూర్చున్నారు. రవింద్ర మాత్రం నిల్చునే ఉన్నాడు.

రవింద్ర మైండ్లో రకల రకాల ఆలోచనలు నడుస్తున్నాయి. ఆ ఆలోచనలలో “ఎవరు? ఏంటి? ఎందుకు?” అన్న మూడు ప్రశ్నలు ఎక్కువగా వినిపిస్తున్నాయి.

మరో పక్క మీటింగ్ స్టార్ట్ అయిన రెండు నిమిషాలకే హైయర్ అప్స్ (higher – up’s) ప్రశ్నల దాడి మొదలైంది.

” క్లూస్ ఏమైనా దొరికాయా?,

కిల్లర్ మోటివ్ (motive) ఏంటో తెలిసిందా?,

చనిపోయిన వాళ్ళతో అతనికి సంబంధం ఏంటి?”

ఇలా సెకెండ్ (second) కి ఒక ప్రశ్న..

కానీ రవింద్ర నుంచి అన్ని ప్రశ్నలకి “ఇంకా తెలీదు.” అనే సమాధానమే వచ్చింది.

రవింద్ర చెబుతున్న సమాధానాలకి హోం మినిస్టర్ ఓపిక నశించింది. తన కోపాన్ని స్పెషల్ టీమ్ హెడ్ ఆనంద్ పైన చూపించాడు. “6 నెలల ఇన్వెస్టిగేషన్ టైంలో ఇదా మీ ఇన్ఫర్మేషన్? ఇదా మీ సమాధానం? నేను మీ నుంచి ఇలాంటి రిజల్ట్ ఎక్స్పెక్ట్ (expect) చేయలేదు ఆనంద్. మీరు రిఫర్ చేశారనే ఈ కేసును మీరు బెస్ట్ ఆఫీసర్ అనే రవీంద్రకి అప్పగించాం. ” అంటూ మండి పడ్డాడు.

“తిని తిరగడానికి కాదు మీకు ఈ కేసు అప్పగించింది.” అని పక్కన ఉన్న మేయర్ ఓ మాట విసిరేశాడు.
ఈ ప్రశ్నలకి, మేయర్ మాటలకి ఆనంద్, రవింద్రలు తలలు దించుకున్నారు. రూమంతా నిశబ్దం అయిపోయింది.

“నాకు కావాల్సింది నిశబ్దం కాదు. సమాధానం. ఇంకో 10 డేస్ లో ఈ కేసు సాల్వ్ అవ్వాలి.” అని హోం మినిస్టర్ కోపంగా లేచి రవీంద్రని చూశాడు. రవింద్ర మౌనంగా నిల్చున్నాడు. హోం మినిష్టర్ తన దగ్గరకి వెళ్లి “ఇంకో 10 డేస్ లో” అని ఆ ఒక్క మాటను మళ్ళీ ప్రెస్ చేసి చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. హోం మినిస్టర్ వెంటే మేయర్ కూడా వెటకారంగా నవ్వుకుంటూ వెళ్లిపోయాడు.

వాళ్లు వెళ్ళిపోవడమే స్పెషల్ టీమ్ హెడ్ ప్రశ్నలందుకున్నాడు.

“ఒక్క క్లూ కూడా దొరకకపోవడం ఏంటి రవింద్ర? What are you doing?” అని విసుగ్గా అడిగాడు ఆనంద్.
రవింద్ర ఇంత సేపట్లో మొదటి సారిగా నోరు విప్పాడు.

” నా దగ్గర కొంత ఇన్ఫర్మేషన్ ఉంది సార్. కానీ అది ఎంత వరకు నిజమో నాకు తెలీదు. But I want to explain it to you.” అని మనసులో మాటలు బయట పెట్టాడు. రవీంద్ర మాటలు విన్న ఆనంద్ తను ఏమనుకుంటున్నాడో చెప్పాడానికి పర్మిషన్ ఇచ్చాడు.

ఇక వెంటనే రవింద్ర మాటలందుకున్నాడు. తను చెబుతున్న ప్రతి విషయాన్ని స్క్రీన్ మీద రాస్తూ వాటికి సంభందించిన ఇమేజెస్ ని ప్లే చేస్తూ చెప్పడం మొదలు పెట్టాడు.

“ముందుగ ఈ చావులకి ఒక పాటర్న్ (pattern) లేదు. క్రూర మృగాలు దొరికిన జంతువులను దొరికినట్లు వేటాడి ఎలా చంపుతాయో.. అలాగే ఈ మర్డర్స్ జరుగుతున్నాయి. అండ్ (and) ఇవి అన్నీ వర్ణ సిటీ ఔట్ కట్స్ (out- cuts) లో బీచ్ దగ్గరగా ఉన్న ప్రదేశంలోనే ఎక్కువగా జరుగుతున్నాయి. అదీ ఒకరు ఒంటరిగా ఉన్నప్పుడు రాత్రి పూట జరుగుతున్నాయి. అండ్ (and) ఈ మర్డర్స్ చేసేది ఒక్కడే అనిపించడం లేదు. మేబి (maybe) ఒక గ్రూప్ అయ్యుండొచ్చు. ప్లాన్ చేసి చెస్తున్నారు అనిపిస్తుంది. చనిపోయిన 60 మందిలో 27 మంది బాడీలు రెండు ముక్కలై దొరికాయి. అవి జరిగిన విధానం చూస్తే ఒకే వేటుతో జరిగినట్లు అనిపిస్తుంది. అంటే కిల్లర్ దగ్గర ఒక పెద్ద కత్తి ఉండొచ్చు. లేదు ఉంటుంది. అండ్ దాన్ని అలా హ్యాండిల్ చేస్తున్నారు అంటే వాళ్ళ బాడీ స్ట్రెంత్ (strength) extraordinary గా ఉండాలి.” అంటూ చెబుతున్న రవింద్ర మాటలకి ఆనంద్ అడ్డొచ్చాడు.

“ఇదంతా హోం మినిస్టర్ ముందు ఎందుకు చెప్పలేదు?” అని ప్రశ్నించాడు. రవింద్ర నెమ్మదిగా ఆనంద్ వైపుకి తిరిగి చూశాడు.

“ఇది ఇన్ఫర్మేషన్ లెక్కలోకి రాదు కద సార్. నాకు కిల్లర్స్ మోటివ్ ఏంటో తెలీదు. కేసులను కనెక్ట్ చేస్ కామన్ పాయింట్ కానీ, సాల్వ్ చేస్ ఒక్క క్లూ కానీ నాకు ఇంకా దొరక లేదు. నేను ఇప్పుడు మీకు చెప్పినదంతా ఆయన దృష్టిలో ఒక నాన్సెన్స్ కిందకి వస్తది. అండ్ వాడు ఒక్కడైతే ఏంటి? ఒక గ్రూప్ అయితే ఏంటి? ఆయనకి రిజల్ట్ కావాలి. ఆ రిజల్టే ఇద్దాం” అని మౌనం వెనుక మాటలు చెప్పాడు రవింద్ర.

“మన దగ్గర సరైన ఇన్ఫర్మేషన్ లేదని నువ్వే అంటున్నావు కద రవీంద్ర, మరి రిజల్ట్ ఎలా ఇస్తాం?” అని అడిగాడు ఆనంద్.

ఈ ప్రశ్నకి రవింద్ర తన దగ్గరున్న ఐడియాని ఆనంద్ ముందు పెట్టాడు.

“ఇవ్వగలం సార్. ఇప్పటివరకు మనం కూడా పిరికి వాళ్ళలా ఇళ్లలో దాక్కుని పగటి పూట ఇన్వెష్టిగేట్ చేస్తున్నాం. మనమే భయపడితే ప్రజల పరిస్తితి ఏంటి. ఈ సారి భయాన్ని పక్కన పెట్టి రాత్రి ఇన్వెస్టిగేట్ చేదాం.”

ఈ మాటలకు ఆనంద్ మళ్ళీ అడ్డుపడ్డాడు.

” నైట్ ఇన్వెస్టిగేషనా..? మనం ఎందుకు నైట్ ఇన్వెస్టిగేషన్ మానేసామో నీకు తెలుసు కద రవింద్ర. ఈ మర్డర్స్ మొదలైన మొదట్లో పొలీసులు సిటీ నలువైపులా కాపలా కాశారు. దాని ఫలితం 10 రోజుల్లో (days) 20 మందికి పైగా పోలీసులు ప్రాణాలు కోల్పోయారు. కిల్లర్ ని చూసిన ఒక్కడు మిగల్లేదు. ఈ ఇన్సిడెంట్ తో అంతా మారిపోయింది. మనం ఒక అడుగు వెనక్కి వేయాల్సి వచ్చింది. ఇప్పుడూ మళ్ళీ నైట్ ఇన్వెస్టిగేషన్ అంటే కష్టం.” అంటూ రవింద్ర ప్లాన్ రిస్క్ అని చెప్పాడు ఆనంద్.

ఈ మాటలకి రవింద్రకి ఏమీ చేయలేకపోతున్నాననే నిస్సహాయతతో పట్టలేనంత కోపం వచ్చింది.
“రిస్క్ తీసుకుందాం సార్. అంతకంటే మనం ఏమీ చేయలేం. మనం ఈ రిస్క్ తీసుకోకపోతే ఈ కేసు ఎప్పటికీ సాల్వ్ అవ్వదు. కానీ ఆ రిస్క్ కూడా జాగ్రత్తతోనే తీసుకుందాం. ఈ ఒక్క సారి నన్ను నమ్మి నా ఐడియా వినండి” అని కోపంగా రిక్వెస్ట్ చేశాడు.

ఆనంద్ కీ, రవింద్ర మాటల్ని ఫాలో (follow) అవ్వడం తప్ప ఇంకో మార్గం కనిపించలేదు. ఇక చేసేదేమీ లేక సరే అన్నాడు.

ఆనంద్ కూడా సరే అనడంతో రవింద్ర ప్లాన్ వివరించాడు. రేపు అంటే జులై 17 నుంచి రవింద్ర 25 మంది టీమ్ తో వర్ణ సిటీ ఔట్ – కట్స్ లో స్ప్రెడ్ (spread) అయిపోయి ఉంటాడు. టీమ్ ఒక్కో టీంకి ఐదుగురు గ్రూప్ కింద డివైడ్ అయ్యుంటుంది. అందరూ గ్రూప్ గానే ఉండాలి. ఒంటరిగా ఎక్కడికి వెళ్ళకూడదు. అయితే అందరూ ఒకే చోట ఉండకుండా ఎప్పటికప్పుడు స్లోగా మూవ్ (move) అవుతూనే ఉండాలి. ప్రతి ఒక్కరి దగ్గరా ఒక గన్ ఉంటుంది. దాన్ని ఎవరైనా డేంజర్ లో ఉన్నామని వాళ్ళకి అనిపిస్తే వాడొచ్చు. కానీ కిల్లర్ కనిపిస్తే మాక్సిమమ్ అతన్ని క్యాప్చర్ (capture) చేయడానికే చూడాలి.

ఈ ప్లాన్ సక్సెస్ అయితే ఈ ఇన్వెస్టిగేషన్ లో ఎంతో కొంత ప్రోగ్రెస్ చూడొచ్చు. దీనికోసం ప్రాణాలను కూడా రిస్క్ చేయడానికి రవింద్ర డిసైడ్ అయ్యాడు.

******

మరో వైపు ఇదే సమయంలో చీకటి పడి 2 గంటల పైనే అవుతున్నా 26 ఏళ్ల విక్రమ్ ధైర్యంగా తిరుగుతున్నాడు. ప్రతి క్షణం నలుమూలల్ని గమనిస్తూ నిమిషానికి ఒకసారి చీకటిలో కలిసిపోతూ వేటాడే జంతువుల కిల్లర్ కోసం ఎదురుచూస్తున్నాడు. అతని కళ్ళలో కోపం, బాధ కలగలిపి కనిపిస్తున్నాయి. అతను వేగంగానే నడుస్తున్నా అతని ప్రతి అడుగు చిన్న శబ్దం కూడా రాకుండా పడుతున్నాయి. అతని చేతిలో ఓ చిన్న కత్తి చీల్చే మెడ కోసం వెతుకుతుంది.

విక్రమ్ బాడీ అలుపు లేకుండా కదులుతున్నా కళ్ళల్లో వెయ్యి ఆలోచనలు కనిపిస్తున్నాయి. ఎందుకో అతని కళ్ళలలో నీళ్ళు తిరిగాయి. ఇప్పుడు వాటి అవసరం లేదని పక్కకి నెట్టేసాడు. ఒక్కసారి తలెత్తి ఆకాశంలోకి చూశాడు. కారు మబ్బులతో నిండి కనిపించింది. ప్రస్తుతం తనున్న పరిస్థితినినే చూపిస్తునట్లు విక్రమ్ కి అనిపించింది. మళ్ళీ తల దించి నడవం మొదలు పెట్టాడు. అప్పుడే ఓ శబ్దం వచ్చింది. ఎవరో పరిగెడుతున్న శబ్దం వినిపించింది. వెంటనే తన పక్కనున్న ఇంటి వైపుగా దూకి ఒక మూల దాక్కున్నాడు.

ఇంకా పరుగుల శబ్దం వస్తూనే ఉంది. విక్రమ్ తన చేతిలో కత్తిని గట్టిగా పట్టుకున్నాడు. శబ్దం ఒక్క సారిగా ఆగిపోయింది. ఇంకో 2-3 నిమిషాలు ఏ శబ్దం రాలేదు. ఏంటా..? అని విక్రమ్ రెండడుగులు ముందుకేసాడు. తన కళ్ళ ముందు ఓ నల్లటి ఆకారం కనిపించింది. ఆ చుట్టు పక్కల సరైన వెలుతురు లేకపోవడంతో ఎవరనేది సరిగ్గా తెలియలేదు. అయినా అవకాశం కోసం చూస్తున్న నక్కలా వేచి చూస్తున్నాడు. ఇంకో క్షణంలో ఆ ఆకారం చిన్నగా కదిలింది. వెనుదిరగడానికి అన్నట్లు.

వెంటనే విక్రమ్ ఆకారం మీదకి దూకాడు. అతను దోకిన ఫోర్స్ కి ఇద్దరూ కింద పడ్డారు. విక్రమ్ అతన్ని గట్టిగా కదలకుండా పట్టుకోడానికి చూశాడు. కానీ అతను సులభంగా విక్రమ్ ని అవతలకి తోసి పైకి లేచి నిల్చున్నాడు. అతని అబ్నార్మల్ (abnormal) స్ట్రెంత్ చూసి (strength) విక్రమ్ కి ఆశ్చర్యమేసింది. విక్రమ్ కూడా లేగిసే ప్రయత్నం చేశాడు. కానీ అతను ఈ లోపే తన చేతిలో ఉన్న ఓ పెద్ద కత్తితో విక్రమ్ ని చంపడానికి ప్రయత్నించాడు.

విక్రమ్ తన చేత్తో అతని చేతిని అడ్డుకుని వెనక్కి నెట్టి, అతను వెనక్కి పడగానే పైకి లేచాడు. ఆ తరువాత వెంటనే అతను తేరుకునే అవకాశం ఇవ్వకుండా విక్రమ్ తన దగ్గరున్న కట్టితో దాడి చేశాడు. అతను విక్రమ్ ని అడ్డుకున్నాడు. వారిద్దరి మధ్య స్ట్రగుల్ (struggle) మొదలైంది. విక్రమ్ ఎన్ని సార్లు అతని పై ఆటాక్ చేసినా అతను వాటి నుంచి సులభంగా (easy) తప్పించుకున్నాడు. తిరిగి తన కత్తితో దాడి చేస్తున్నాడు. విక్రమ్ చేతులపై కొన్ని చోట్ల కోసుకుని రక్తం కారుతోంది.

ఆ సమయంలో ఎందుకో విక్రమ్ చీకటి నుంచి వీది దీపాల వెలుగులోకి దూకాడు. అతను కూడా దూకుతాడని భావించాడు. కానీ అతను వెను దిరిగి పరిగెట్టాడు. విక్రమ్ కి అతను వెలుగులోకి ఎందుకు రాలేదో అర్ధం కాలేదు. అయినా వెంటనే విక్రమ్ తన చేతిలోని కత్తితో అతని పై దాడి చేయడానికి ముందుకు దూకాడు. విక్రమ్ పడిన ఫోర్స్ కి ఆ కత్తి అతని కుడి తొడలో దిగి కాలుని చీల్చుకుంటూ బయటకి వచ్చింది. విక్రమ్ కింద పడిపోయాడు. అతను కూడా కింద పడిపోయాడు. విక్రమ్ లేచి అతని వైపు వెల్దామని నిల్చోబోయాడు. ఈ లోపు అతను నేలమీద గాయపడిన జంతువుల అరవడం మొదలు పెట్టాడు.

ఆ అరుపుల్లో ఏదో వింత శబ్దం వినిపించింది. ఎవరినో పిలుస్తున్నట్లు అనిపించింది. విక్రమ్ ఏం జరుగుతుందా అని అలా చూస్తూ ఉండి పోయాడు. అతను ఆ గాయంతో అరుస్తూనే నెమ్మదిగా లేచి వెనుదిరిగాడు. ఈ లోగా అతని ముందు వేగంగా ఇంకో ఆకారం ప్రత్యక్షమైంది. గాయపడిన అతన్ని బుజంపై పెట్టుకుని పరుగెట్టింది.
ఇదంతా చూస్తున్న విక్రమ్ కి వాళ్లు ఎవరు? అన్న ప్రశ్నకంటే ఒక వ్యక్తి బరువుని తనపై వేసుకుని అతను పరిగెడుతున్న వేగం చూసి ఆశ్చర్యమేసింది.

వాళ్ళెవరు? ఎందుకు చంపుతున్నారు? తెలుసుకోవాలను కున్నాడు. దీని కోసం తన ప్రాణాలైనా ఇవ్వడానికి డిసైడ్ అయ్యాడు.

ఇది ఇతని కథ. చావును లెక్కచేయకుండా ఒంటరి యుద్ధం మొదలు పెట్టిన విక్రమ్ కథ.

What do you think?

కోడి రెట్టతో విద్యుదుత్పత్తి చేస్తున్న హర్యానా వాసి

గ్యాస్ వినియోగదారులకు గుడ్ న్యూస్. రూ.200 తగ్గించిన కేంద్రం