in

కోడి రెట్టతో విద్యుదుత్పత్తి చేస్తున్న హర్యానా వాసి

కోడి రెట్టతో విద్యుదుత్పత్తి చేస్తున్న హర్యానా వాసి

ఓ వ్యక్తి కోడి రెట్ట నుంచి విద్యుదుత్పత్తి చేసే ప్లాంట్ తయారుచేశాడు. దీంతో ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

వివరాల్లోకి వెళ్తే హర్యానా ఝజ్జర్ లోని సిలానీ కేషో గ్రామానికి చెందిన రామ్మోహన్ గతంలో భారత సైన్యంలో పని చేసేవాడు. ఆయన పదవీ విరమణ తరువాత పౌల్ట్రీ ప్రారంభించాడు.

అయితే రామ్మోహన్ విద్యుత్ కనెక్షన్ కోసం చాలా సార్లు అధికారులను సంప్రదించాడు. కానీ రామ్మోహన్ సమస్యను వాళ్ళు ఏమాత్రం పట్టించుకోలేదు. దీంతో అధికారుల వైఖరితో విసిగిపోయిన అతను కోడి రెట్ట నుంచి విద్యుదుత్పత్తి చేసే ప్లాంట్ తయారుచేశాడు. గతంలో గ్యాస్ ఉత్పత్తి చేసిన రామ్మోహన్, ఇప్పుడు విద్యుదుత్పత్తి చేస్తూ ఇంటి అవసరాలకు వాడుతున్నాడు.

దీంతో ఇది సోషల్ మీడియా వైరల్ అవుతుండగా.. నెటిజనులు ఓహో..! అంటూ అతని ఆలోచనని అభినందిస్తున్నారు.

What do you think?

అస్సాంలోని ఓ ఇంట్లో కలకలం రేపిన 30 నాగుపాములు.

తెలుగు మిస్టరీ స్టోరీ ‘వర్ణ’- చాప్టర్ 1- మర్డర్స్