గ్యాస్ వినియోగదారులకు గుడ్ న్యూస్. రూ.200 తగ్గించిన కేంద్రం
గ్యాస్ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఎల్పీజీ ధరలు తగ్గించాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించింది.
రాఖీ పండుగను పురస్కరించుకుని మహిళలకు ఈ కానుక ఇవ్వాలని కేంద్రం భావించింది. దీంతో ఎల్పీజీ ధరలు రూ.200 తగ్గించాలని నిర్ణయించింది. ప్రస్తుతం ఢిల్లీలో గ్యాస్ ధర రూ.1103గా ఉండగా.. తగ్గిన ధరల ప్రకారం రూ.903 కు చేరనుంది. దీనివల్ల 5 కోట్ల మందికి ప్రయోజనం చేకూరనుంది. ఈ విషయాన్నే కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ మీడియాకు వెల్లడించారు.