in ,

తెలంగాణ లిక్కర్ పాలి’ట్రిక్స్’లో మద్యం మరకతో కవితక్క

తెలంగాణ లిక్కర్ పాలి ‘ట్రిక్స్ ‘లో మద్యం మరకతో కవితక్క

మద్యం ఇప్పుడు దేశ రాజకీయాలను శాసిస్తుంది. ఒకప్పుడు ఇదే మద్యం కొన్ని పార్టీలను నిలబెడితే మరికొన్ని పార్టీలను కూల్చివేసింది. ఎన్ టి ఆర్ సమయం లో సంపూర్ణ మధ్య నిషేధం అనేది టి డి పి ని నిలబెడితే కాంగ్రెస్ ను కూల్చేసింది. మరి ఇప్పటి పరిస్థితుల్లో ఈ మద్యం దేశవ్యాప్తంగా ప్రతి ఒక రాష్ట్రానికి అక్షయ పాత్రగా మారింది. మద్యం ద్వారా మాత్రమే రాష్ట్రాలు పరిపాలన సాగించే స్థితికి చేరింది. మద్యం ద్వారా మాత్రమే ఆదాయాన్ని రాబట్టుకుంటేనే రాష్ట్రాలు నడిచే పరిస్థితిలోకి వచ్చేసాయి. మంచి నీళ్లు ఇచ్చి అధికారం లోకి వచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీ సామాన్యమైన పార్టీ అనేటువంటి కేజీవాల్ ప్రభుత్వానికి కూడా ఈ మద్యం మరకలు తప్పలేదు.

అందులోని వాస్తవాలు రుజువు కానప్పటికీ మద్యం కొత్తపాలసీని చేసుకున్నప్పుడు అందులో అవకతవకలు జరిగాయని, అక్రమాలు జరిగాయని, కోట్లాది రూపాయలు చేతులు మారాయని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ఆరోపించడంతో సి బి ఐ దాడులు ముమ్మరమయ్యాయి. ఈ దాడుల తర్వాత మరికొన్ని విషయాలు వెలుగులోకొచ్చాయి. మన తెలుగు రాష్ట్రమయినటువంటి తెలంగాణ లో కూడా దీనికి లింకులున్నట్లుగా కొంతమంది ప్రముఖుల పేర్లు బయటకి వచ్చాయి. అందులో తెలంగాణాలో కవిత పేరు బయటికి రాగానే రాజకీయ దుమారమే రేగింది.

మరి ఈ రాష్ట్రాలు చేసుకున్న ఈ మద్యం పాలసీల్లో నిజంగానే అక్రమాలు జరుగుతున్నాయా అనే కోణం లో విచారణ జరుగుతున్నప్పటికీ రాష్ట్రానికి, మద్యానికి ఉన్న సంబంధమేంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వాస్తవానికి తెలంగాణ ను తీసుకుంటే 2018-19 గాను నాలుగు వేల కోట్లు ఉన్నటువంటి మద్యం పై ఆదాయం 2021 -22 కల్లా ముప్పైవేల కోట్లకు చేరింది. అంటే ఎంతస్థాయి లో ప్రభుత్వాలు మద్యం తాగిస్తున్నాయి. ప్రజలకు మద్యం వడ్డించి మరీ డబ్బు చేసుకుంటున్నాయి అన్నది గమనించాలి.

మద్యం దుకాణాలు రాష్ట్రప్రభుత్వాల అద్వర్యం లో నడుస్తాయి. అమ్మకం రేట్ ఫిక్స్ చేయడం దగ్గరనుండి మద్యం కు సంబందించిన అన్ని రాష్ట్రప్రభుత్వ అద్వర్యం లో నడుస్తాయి. అయితే దీనిని ప్రైవేట్ పరం చేస్తే మూడు వందలకోట్ల రూపాయలు అదనపు ఆదాయం వస్తుంది అని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ కు ప్రభుత్వం ఒక లేఖ రాస్తే గవర్నర్ ఆమోద ముద్ర వేస్తూ దాన్లో ఒక పాయింట్ మెన్షన్ చేయటం జరిగింది. కొత్త మద్యం దుకాణాలకు కానీ, కొత్త బార్లకు గాని అనుమతి ఇవ్వొద్దు ఆలా ఇవ్వాలంటే లోకల్ గ ఉన్నటువంటి దానికి సంబంధించిన అధికారుల పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుందని రాయడం జరిగింది. ఎందుకంటే రాజ్యాంగం ప్రకారం మద్యం, పొగాకు వంటి మత్తు పదార్ధాలని ఎంకరేజ్ చేయకుండా డిస్కరేజ్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే. రాజ్యాంగ బద్ధ పదవిలో లెఫ్టినెంట్ గవర్నర్ ఉంటారు కాబట్టి ఢిల్లీ లో ఉన్న లెఫ్టినెంట్ గవర్నర్ కు స్వతంత్రత ఉంటుంది. సంబంధిత అధికారుల పర్మిషన్ తీసుకోకుండా తర్వాత బార్లు, వైన్ షాప్ లు విపరీతం గ వచ్చాయి.

దానిమీద వచ్చిన ఒక కంప్లైంట్ ఆధారంగా లెఫ్టినెంట్ గవర్నర్ విచారణకు ఆదేశించారు. చీఫ్ సెక్రటరీ నేతృత్వం లో కమిటీ ఇంతకుముందు ఉన్న బార్లు, వైన్ షాప్ లకన్నా ఎక్కువగా పెరిగినాయి అని నివేదిక ఇచ్చింది. ఈ బార్లకు అనుమతులు ఎవరు ఇచ్చారు అని చూస్తే ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రివాల్ మరియు అతనికి అత్యంత సన్నిహితుడయిన డిప్యూటీ సి ఎం మనీష్ సిసోడియా అని తేలింది. అప్పుడు సిబిఐ కి దీనిపై దర్యాప్తు చేయమని ఆదేశాలు జారీచేశారు. సి బి ఐ తో పాటు ఈ డి కూడా రంగం లో దిగింది.

ఇలా లిక్కర్ స్కాం ఢిల్లీ నుండి తెలంగాణకు పాకింది.

వాస్తవంగా కొంతమంది మద్యం సిండికేటే కింగ్ లు హైదరాబాద్ లో సమావేశమయ్యారు. వాళ్లందరికీ కూడా మద్యం ఎలా అమ్మాలి, ప్రైవేటికీకరణ చేస్తే ఎలా లాభం వస్తుంది. ఢిల్లీ లో మాత్రమే కాదు, పంజాబ్ లో కూడా ఎలా చేయాలి అనేవిషయాల మీద సమావేశాలు కవిత నిర్వహించారు అనే ఆరోపణ వచ్చింది.

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఈడీ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఇప్పటికే దేశవ్యాప్తంగా సోదాలు చేసిన ఈడీ.. సీబీఐ నమోదు చేసిన కేసు ఆధారంగా దర్యాప్తు చేస్తోంది. లిక్కర్ స్కాం కేసులో ఢిల్లీ పెద్దలకు.. పెద్ద ఎత్తున ముడుపులు చెల్లించినట్లు ఈడీ ఆధారాలు సేకరించింది.

హైదరాబాద్లో సోదాల అనంతరం, ఈడీ పలువురికి నోటీసులిచ్చింది కవితకు ఈ డి విచారణకు హాజరవమని ఆదేశాలు ఇచ్చారు. కొసమెరుపు: కరోనా కారణంగ కవిత ఐసొలేషన్ లో ఉన్నారని, అయన ఆడిటర్ కు నోటీసులు అందజేయటం జరిగింది.

తెలంగాణ పాలి ‘ట్రిక్స్ ‘లో కవితక్క కు ఇది ఒక లిక్కర్ మరకే.

What do you think?

జీవో నం1ను కొట్టేసిన హైకోర్ట్.షాక్లో ఏపీ ప్రభుత్వం

2024 రాష్ట్ర అధికార కిరీటం ఎవరిని వరించబోతుంది..