జీవో నం 1ను కొట్టేసిన హై కోర్ట్.
ఏపీ: ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం తెచ్చిన జీవో నం 1ను హై కోర్ట్ కోట్టేసింది. ఈ జీవో రాజ్యాంగమంలోని ప్రాథమిక హక్కులకు భంగం కలిగించేలా ఉందని హైకోర్ట్ అభిప్రాయ పడింది. ఈ నిర్ణయంతో ఏపీ ప్రభుత్వానికి షాక్ తగిలినట్టైంది.
ప్రతిపక్ష నేత చంద్రబాబు ఈ ఏడాది జనవరి నెలలో నిర్వహించిన సభలో జరిగిన తొక్కిసలాటలో కొంథ మంది ప్రజలు చనిపోయారు. దీంతో మరో సారి ఇలా జరగకూడదనే ఉద్దేశంతో ఏపీ ప్రభుత్వం జీవో నం 1ని తీసుకువచ్చింది. అయితే ఈ జీవో రాజ్యాంగమంలోని ప్రాథమిక హక్కులకు భంగం కలిగిస్తుందంటూ టీడీపీ,బీజేపీ,సిబీఐ,AISF పిటిషన్ వేశాయి.
దీనిపై ఈ రోజు విచారణ జరిపిన హై కోర్ట్ జీవో నం 1 ను కొట్టేసింది. హైకోర్ట్ ప్రతిపక్షానికి అనుకూలంగా తీర్పునిస్తూ ఇది రాజ్యాంగమంలోని ప్రాథమిక హక్కులకు భంగం కలిగిస్తుందని అభిప్రాయపడింది. ఈ నిర్ణయంతో ఏపీ ప్రభుత్వానికి షాక్ తగిలినట్టైంది.
మరో పక్క కోర్ట్ తీర్పుతో ప్రతిపక్షాలు సంతోషిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికలకు టైమ్ దగ్గర పడుతుండడంతో ప్రజల్లోకి వెళ్లాలనీ, రోడ్ షోలు చెయ్యాలని సిద్ధమవుతున్నాయి.