in ,

ఆగని సైకిల్ చక్రానికి … జనం సలాం

ఆగని సైకిల్ చక్రానికి … జనం సలాం

ఏపీ రాజకీయాల్లో పశ్చిమగోదావరి జిల్లాది ప్రత్యేక స్థానం. రాజకీయ చైతన్యవంతులు అని జిల్లా జనానికి పేరు. అందుకు తగ్గట్టుగానే ఇక్కడి జనం ఎవరి వైపు మొగ్గు చూపితే అధికారం అదే పార్టీకి దక్కుతూ వస్తోంది.

పాలకొల్లు నియోజకవర్గం నుండి 2014, 2019 ఎన్నికల్లో వరుసగా తెలుగు దేశం పార్టీకి చెందిన నిమ్మల రామానాయుడు గారు ఎం ఎల్ ఏ గా గెలిచారు. వైసీపీ గాలి ఉధృతంగా వీచినప్పటికీ 2014 ఎన్నికలకన్నా మరింత ఎక్కువ ఓట్లను నిమ్మల 2019 ఎన్నికల్లో సాధించారు.

ఏపీ టీడీపీలో చాలా యాక్టివ్ గా, ప్రజా సమస్యలపై తనదైన శైలిలో స్పందిస్తుంటారు. సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడానికి చేసే కార్యక్రమాలు, నిరసనలు చేపడుతుంటారు.

*ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై సైకిల్ యాత్రలు చేశారు.

*రైతుల సమస్యలపై ఉరితాడుతో నిరసన తెలిపారు.

*అధ్వాన్నంగా తయారైన రోడ్ల దుస్థితిని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లడానికి రోడ్లపై ఏర్పడిన గుంతల్లో చేపలు పట్టి నిరసన తెలిపారు.

*ఏపీలో కల్తీ మద్యం విక్రయిస్తున్నారంటూ జగన్ సర్కార్ కు వ్యతిరేకంగా తాళిబొట్లతో నిరసన వ్యక్తం చేశారు.

*ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించేందుకు ప్రతీ నెలా నాలుగు రోజులు పాటు పేపర్ బాయ్ గా పనిచేస్తారు.

*మరో నాలుగు రోజులు పారిశుద్ధ్య పనులు చేస్తూ నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండే ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు.

ఆంధ్రప్రదేశ్లో రాబోయే ఎన్నికలు హెూరాహరీగా. సాగనున్నాయనే విషయం సుస్పష్టం. మొత్తం 175 నియోజకవర్గాలను గెలుచుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ లక్ష్యంగా నిర్దేశించుకోవడంతో గత ఎన్నికల్లో విజయం సాధించలేకపోయిన వాటిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం దృష్టిసారించింది.. కుప్పం నుంచి చంద్రబాబును ఓడించడంకన్నా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న నిమ్మల రామానాయుడును ఓడించడమే కష్టమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

అన్ని దానాలలో కన్నా అన్నదానం గొప్పదంటారు. అలానే పాలకొల్లు నిమ్మల రామానాయుడు మదిలో మెదిలిన ఆలోచన. గతంలో టీడిపి ప్రభుత్వ హయంలో అక్షయపాత్రా ఫౌండేషన్, అన్న కాంటీన్ ద్వారా నాణ్యతతో కూడిన ఆహారాన్ని అందించింది. రాష్ట్రములో అధికార మార్పిడి జరిగిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా ఈ కాంటీన్ లు రద్దయి పోయాయి. అయితే పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు ఎం ఎల్ ఏ తెలుగుదేశం పార్టీ శాసనసభాపక్ష ఉపనేత నిమ్మల రామానాయుడు మాత్రం ప్రభుత్వంతో నిమిత్తం లేకుండా అన్నా కాంటీన్ ను కొనసాగిస్తూ వస్తున్నారు. రోజుకు సుమారు నాలుగు వందలమంది ఆకలి తీరుస్తున్నారు.

పాలకొల్లులో అన్నా కాంటీన్ ను నిర్విరామంగా కొనసాగిస్తూ ఉండడానికి ఎం ఎల్ ఏ నిమ్మల రామానాయుడు ఆలోచన చాల దోహద పడిందట. వాస్తవానికి రాష్ట్ర వ్యాప్తంగా అన్నా కాంటీన్ లు మూసివేసిన వెంటనే నాలుగైదు రోజులపాటు రామానాయుడు సొంత నిధులు వెచ్చించి కొనసాగించారు అ తర్వాత ఆయనకు ఒక ఐడియా వచ్చిందట…నియోజకవర్గంలో ఎవరింట్లోనైనా శుభకార్యంలు, వివాహ వార్షికోత్సవాలు, బర్త్ డే వేడుకలు జరుపుకునే వాళ్ళు అలాగే సంవత్సరకాలు నిర్వహించే వాళ్లు అన్నా కాంటీన్ కు నేరుగా వచ్చి భోజనం వడ్డించి పేదల ఆకలి తీర్చవచ్చని ఎం ఎల్ ఏ రామానాయుడు పిలుపునిచ్చారు. దీనితో నియోజకవర్గం లో ప్రజానీకం తమ ఇంట్లో ఎటువంటి కార్యక్రమం జరిగినా స్వచందంగా ముందుకు వస్తున్నారు.

పాలకొల్లు ఎం ఎల్ ఏ నిమ్మల రామానాయుడు ఈ విధంగా అన్నా కాంటీన్ ను నిర్వహిస్తున్న విషయం టీ డి పి అధినేత చంద్రబాబు, ఇతర ముఖ్య నేతల దృష్టికెళ్లింది..దీనితో వారంతా ఆయనను అభినందించారట.
వరుసగా రెండు ఎన్నికల్లో గెలుపొందిన రామానాయుడు నియోజకవర్గంలో కలియదిరుగుతూ తన వ్యక్తిగత శైలితో బలం పెంపొందించుకోవడమేకాకుండా పార్టీ బలాన్ని పెంచుతున్నారు.

నిరంతరం ప్రజల్లో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషిచేయడమే ఆయనకు ప్లస్ పాయింట్ గా మారిందని, ఈ మూడు సంవత్సరాల్లో నియోజకవర్గంలో నిమ్మల తన పట్టును మరింత పెంచుకున్నారనే అభిప్రాయం కూడా స్థానికుల్లో వ్యక్తమవుతోంది.
ఇక ఈ ‘సైకిల్ చక్రం ఆగేదే లే అంటూ … జనం సలాం ‘ కొడుతున్నారు.

What do you think?

శ్రీలంక సంక్షోభం ప్రపంచ దేశాలకు ఓ హెచ్చరిక

అందాలతో, అద్భుతాలలో అలరించే సముద్రం ‘రెడ్ సీ’…