in ,

అందాలతో, అద్భుతాలలో అలరించే సముద్రం ‘రెడ్ సీ’…

అందాలతో, అద్భుతాలలో అలరించే సముద్రం ‘రెడ్ సీ’….

ఈ ప్రపంచంలోని ప్రతి ప్రదేశంలోనూ వింతలు,అద్భుతాలు దాగున్నాయి. భూమి పై నుంచి సముద్రం లోతుల వరకు మనషి ఆశ్చర్య పరిచే విడ్డూరాలు,మైమరపించే అద్భుతాలు ఇలా ఎన్నో. అటువంటి అద్భుతాలలో ఒకటి రెడ్ సీ. ఈ సముద్రంలో నీళ్లు రంగు మారుతూ ఎర్రగా కనిపించడంతో దీనికి రెడ్ సీ అని పేరొచ్చింది.

ఆసియాకు,ఆఫ్రికాకు మద్యలో ఉన్న ఈ సముద్రం దాదాపుగా 490 మీటర్ల లోతు కలిగి ఉంటుంది. ఈ సముద్రంలో 1200 రకాల చేపల నివసిస్తుండగా వీటిలో 44 రకాల సొర చాపలు కూడా ఉంటాయి. ఈ చేపలలో 20 శాతం చేపలు ఈ రెడ్ సీలో మాత్రమే కనపడటం విశేషం.

ఈ సముద్రం చుట్టూ సౌదీ అరేబియాలాంటి ఎడారి ప్రాంతాలే ఎక్కువగా ఉండటం వల్ల ప్రతి సంవత్సరం 80 ఇంచుల నీళ్లు మాయమైపోయినప్పటికీ అవి సముద్రంలో కొనసాగుతూ వచ్చే నీళ్ళతో కానీ కొద్దో గొప్పో పడే వర్షాలతో కానీ నిండడం జరగదు. ఆడెన్ నుంచి గాలుల వల్ల వచ్చే నీళ్ళతో మాత్రమే ఆ సముద్రం తిరిగి నిండుతుంది. ఈ విధంగా ప్రతి 20 సంవత్సరాలకి ఒకసారి జరుగుతుంది. ఈ సముద్రంలో అన్ని సముద్రాల కంటే 35 శాతం ఉప్పు నీళ్లుండటం వల్ల అవి చర్మ సమస్యలు,ఆర్థరైటిస్ లాంటి రోగాలను తగ్గించడంలో సహాయపడతాయి. అదే విధంగా ఎక్కువ లవనీయత ఉండటం వల్ల మనుషులు తేలడానికి కూడా సముద్రంలోని నీళ్లు సహాయపడతాయి.

ఈ సముద్రంలోని నీళ్ళ ఉష్ణోగ్రత సంవత్సరం మొత్తం 18°సి నుంచి 28°సి వరకు ఉండటం వల్ల వెళ్ళి చూడటానికి వీలుగా ఉంటుంది. 1869 లో సుజ్ కెనాల్ తెరిచినప్పటినుంచి రెడ్ సీ, మెడిటెరియన్తో కలవడం వల్ల యూరోప్కి,ఆసియాకి మధ్య రావాణా మరింత సులభతరం అయ్యింది. ఈ సముద్రంలో ఉండే వింత చేపలు రంగు రంగుల రాళ్ళు చెట్లు స్కూబా డైవింగ్ కి వెళ్ళే ప్రతి ఒక్కరినీ ఎల్లపుడూ అబ్బురుపరుస్తూనే ఉంటాయి. ఇలా ఈ సముద్రంలో ఉండే అందాలు,జరిగే విడ్డూరాలు ఎన్నో.

What do you think?

ఆగని సైకిల్ చక్రానికి … జనం సలాం

అతని మరణంతో మానవాళి నుంచి మరొక తెగ అంతరించిపోయింది