in

తారక రత్న అవయవాలు ప్రస్తుతం బాగానే ఉన్నాయని తెలిపిన వైద్యులు. అయన ఆరోగ్యంపై ఇంకా పూర్తి స్పష్టత రావాల్సి ఉంది.

బెంగుళూరు: నటుడు నందమూరి తారక రత్న బెంగుళూరులోని హృదయాలయ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే తాజాగా ఇప్పుడు ఆయన ఆరోగ్యానికి సంబంధించి మరిన్ని విషయాలపై సమాచారం అందింది.
తారక రత్నకు మరిన్ని వైద్య పరీక్షలు నిర్వహించడంతో కొన్ని విషయాలు వెల్లడయ్యాయి. ప్రస్తుతం ఆయన గుండె, కిడ్నీ మరియు కాలేయం మామూలుగానే ఉన్నట్టు ఆ పరీక్షలలో తేలింది. అయితే ఇప్పుడు ఆయనకు సిటీ స్కాన్ నిర్వహిస్తున్నట్టు వైద్యులు తెలుపగా, ఇంకా ఆ పరీక్ష పలితాలు రావల్సివుంది. ఆ పరీక్ష పలితాలు వచ్చిన తరువాత ప్రస్తుతం పెట్టి ఉంచిన వెంటిలేటర్ ఉంచాలా.. లేక తీసి వేయాలా.. అన్న విషయాలపై స్పష్టత వచ్చే అవకాశంముంది.
మరో పక్క ఇటీవల కర్ణాటక హెల్త్ మినిస్టర్ కె.సుధాకర్ తారక రత్న ఆరోగ్య పరిస్థితిపై మాట్లాడారు. తారక రత్న మెదడు పనితీరు సాధారణ స్థితిలో లేదని, గుండెపోటు వచ్చిన తర్వాత 30 నిమిషాలపాటు రక్త ప్రసరణ నిలిచిపోవడంతో మెదడు పనితీరుపై ప్రభావం పడినట్లు పరీక్షల ద్వారా గుర్తించామని ఆయన తెలిపారు. నిమ్హాన్స్ న్యూరోసర్జన్ ప్రొఫెసర్ గిరీష్ కులకర్ణి నేతృత్వంలో ఇద్దరు న్యూరో సర్జన్లు తారకరత్న ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తున్నారని ఆయన వివరించారు.

What do you think?

ఒక కొత్త రికార్డును తన కాతాలో వేసుకుని అందర్నీ అవాక్కయ్యేలా చేసిన టీంమిండియా స్పిన్నర్ యూజ్వేంద్ర చహల్.

పోలీస్ ఫోర్స్ (CRPF) ఉద్యోగాలకు దరఖాస్తు గడువు ముగిసింది. ఇక ఎగ్జామ్స్ ఎప్పుడంటే..