in

ఒక వైపు నిఫా వైరస్.. మరో వైపు ‘స్క్రబ్ టైఫస్’

ఒక వైపు నిఫా వైరస్.. మరో వైపు ‘స్క్రబ్ టైఫస్’

ఒక వైపు కేరళలో నిఫా వైరస్ వణికిస్తున్న ఈ సమయంలో మరో వైపు ఒడిశా రాష్ట్రంను ‘స్క్రబ్ టైఫస్’ వణికిస్తోంది. తాజాగా సుందర్‌గఢ్ జిల్లాలో 11 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 180 కి చేరుకుంది.

ఈ వ్యాధి లక్షణాలతో బాధపడుతున్న 59 మంది శాంపిళ్లను పరీక్షించగా.. అందులో 11 మందికి వ్యాధి నిర్ధారణ అయిందని ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు.

ఎవరికైనా నాలుగు, ఐదు రోజులుగా జ్వరంతో బాధ పడుతుంటే వారు వెంటనే పరీక్షలు చేయించుకోవాలని అధికారులు సూచించారు.

What do you think?

టీమిండియా ఫాస్ట్ బౌలర్ సిరాజ్ అరుదైన రికార్డ్

కిలో టమాట 50 పైసలకే.. మళ్ళీ మొదలైన రైతుల తిప్పలు.