కిలో టమాట 50 పైసలకే.. మళ్ళీ మొదలైన రైతుల తిప్పలు.
నెల క్రితం కిలో టమాటా ధర రూ.250 వరకు పలికిన సంగతి తెలిసిందే. ఆ టమాటాలు దోపిడీలు, దొంగతనాలు కూడా జరిగాయి. అప్పటి వరకు ఉత్తినే టమాటలను పారేసుకున్న రైతులు వాటి రేట్ పెరగగానే కోటీశ్వరులు అయిపోయారు.
అలాంటి టమాటా ధర ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో 50 పైసలకు పడిపోయింది. దీంతో దిగుబడి వచ్చినప్పుడే ఇలా ధరలు పడిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ ధర వద్ద విక్రయిస్తే కనీసం పెట్టుబడులు కూడా దక్కవని వాపోతున్నారు. మరోవైపు రైతుల వద్ద 50 పైసలకు కొంటున్న దళారులు.. బహిరంగ మార్కెట్ లలో కిలో రూ.30 వరకు అమ్ముతున్నారు. ఈ విషయంపై వెంటనే ప్రభుత్వం కలగజేసుకోవాలని రైతులు కోరుతున్నారు.