in

వాటంతట అవే కదిలే రాళ్ళు. వాటి రహస్యం ఇదేనా..

వాటంతట అవే కాదులే రాళ్ళు. వాటి రహస్యం ఇదేనా..

కాలిఫోర్నియాలోని డెత్ వాలీ లో రేస్ ట్రాక్ ప్లాయా (Racetrack playa) అనే ఓ డ్రై లేక్ బెడ్ (dry lake bed) ఉంది. 1940 లో అక్కడ ఉండే రాళ్లు (ఒక్కో రాయి దాదాపు 318 కే జీలు ఉంటుంది) వాటంతట అవే కదలడం కొందరు రీసర్చర్లు గమనించారు. అప్పటి నుంచి అంత పెద్ద రాళ్ళు ఎలా కదులుతున్నాయన్న ప్రశ్న రీసర్చర్లలో మొదలైంది. ఆ ప్రశ్నకు ఆల్గే నుంచి దయ్యాల వరకు సమాధానాలుగా చాలా ఎక్స్ప్లనేషన్లు (explanations) ఇచ్చారు. కానీ దాంట్లో ఏది సరైనది అనేది ప్రూవ్ కాలేదు.

అయితే, చివరిగా 2011లో యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా-శాన్ డియాగోలోని స్క్రిప్స్ ఇన్‌స్టిట్యూషన్ ఆఫ్ ఓషనోగ్రఫీకి చెందిన పరిశోధకులు ఆ రాళ్ల మిస్టరీని సాల్వ్ చేయాలని నిర్ణయించుకున్నారు.

ఆ రాళ్ల కదలికలను గమనించడం వాటికి జీపీఎస్ (GPS) పరికరాలను అటాచ్ చేద్దాం అనుకున్నారు. కానీ నేషనల్ పార్క్స్ సర్వీస్ దానికి అనుమతి ఇవ్వకపోవడంతో ఆ రాళ్ళ సైజులో ఉండే మరో 15 రాళ్ళను అక్కడ పర్యవేక్షణకు ఉంచారు.

ఆ తరువాత వాటి కదలిక కోసం జాగ్రత్తగా పర్యవేక్షించారు. చివరకి రెండేళ్ల తరువాత వారి పరిశోధన ఫలించింది. అసలు విషయం బయటపడింది.

శీతాకాలంలో, ప్లేయా కొన్నిసార్లు వర్షపాతంతో పలుచని నీటి పొరతో నిండిపోతుంది. అయితే ఆ నీరు రాత్రి పూట గట్ట కట్టుకుంటుంది. మరుసటి రోజు సూర్యుడు బయటకు వచ్చినప్పుడు, ఎండకు మంచు కరిగి పగుళ్లు ఏర్పడి ఫలకాలు (ప్యానెల్స్) గా మారుతాయి. ఆ తరువాత వీచే తేలికపాటి గాలులు ఆ రాళ్లను కొద్ది కొద్దిగా ముందుకు నెడతాయి. ఇది తెలియక మనం ఆ రాళ్లు వాటంతట అవే కదులుతున్నాయని భ్రమ పడుతుంటాం.

అయితే వాటి కదలికలను చూడలని మనం అనుకున్నప్పటికీ ఆ రాళ్ళు సాధారణంగా సెకనుకు కొన్ని అంగుళాల వేగంతో మాత్రమే జారడంతో, వాటిని గమనించడం కష్టం అవుతుంది.

What do you think?

గుడ్ న్యూస్ చెప్పిన ఎస్బీఐ. 2000 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్!

టాలీవుడ్ ఇండస్ట్రీకి పైరసీ వెబ్సైట్ స్ట్రాంగ్ వార్నింగ్!