in

ఆర్జీవీ వివాదస్పదమైన ట్వీట్ కి టీడీపీ నేత బండారు సత్యనారాయణ గాటు సమాధానం.

తన వింతైన సమాధాన శైలిలో ప్రతి దానిపై స్పందిస్తూ, సంచలన వ్యాఖ్యలు చేస్తూ ఎప్పుడూ హెడ్ లైన్స్ లో ఉండే ఒకే వ్యక్తి దర్శకుడు(ఆర్జీవీ) రామ్ గోపాల్ వర్మ.అలాంటి రామ్ గోపాల్ వర్మ మరో సారి మరో వివాదంతో హెడ్ లైన్స్ లోకి వచ్చారు.
వివరాల్లోకి వెళ్తే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇటీవల ట్విట్టర్ మాధ్యమం ద్వారా కాపులూ,కమ్మలూ అంటూ ట్విట్టర్ లో ఒక ట్వీట్ ని పోస్ట్ చేశారు.”కేవలం డబ్బు కోసం తన సొంత కాపుల్ని ,కమ్మోళ్లకి అమ్మేస్తాడని ఊహించలేదు ” అంటూ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు.
అయితే ఈ వ్యాఖ్యలపై స్పందిస్తూ టీడీపీ నేత బండారు సత్యనారాయణ ఆర్జీవీకి ఘాటుగా సమాధానమిచ్చారు. రామ్గోపాల్వర్మ ఒక కామ మృగమని,దరిద్రుడని బండారు మండిపడ్డారు.కులాల గురించి ఆర్జీవీ మాట్లాడడం ఏమిటని,కమ్మ, కాపు కలిస్తే ఆర్జీవీకి వచ్చిన ఇబ్బంది ఏంటని ప్రశ్నించారు.ఆర్జీవీకి అసలు మాట్లాడే అర్హత లేదన్నారు.ఆయన భార్య ఎక్కడుందో ఆయనకే తెలియని రామ్ గోపాల్ వర్మ,కూతురుతో మాట్లాడని రామ్ గోపాల్ వర్మ రాజకీయాల గురించి మాట్లాడేంత స్థాయి ఉన్న వాడా.. అని ప్రశ్నిస్తూ సత్యనారాయణ మండి పడ్డారు.తన భార్య,కూతురే ఆర్జీవీని అసహ్యించుకుంటున్నారని ఆయన వ్యాఖ్యానించారు.

What do you think?

84 Points
Upvote Downvote

గుండెపోటుతో ఆరో తరగతి బాలుడు మృతి, తల్లడిల్లిన తల్లిదండ్రులు.

ఐపీఎల్ కి దూరమైన రిషబ్ కి బీసీసీఐ శుభవార్త.రూ.16 కోట్ల వేతనాన్ని ఇవ్వనున్నట్లు బోర్డ్ ప్రకటన.