మునుపటి కాలంలో 50 ఏళ్ల వయసు వచ్చేంత వరకు ఎటువంటి ఆరోగ్య సమస్యలు వచ్చేవి కాదు.ఇంకా చెప్పాంటే 50 ఏళ్ల తరువాత కూడా ఆరోగ్య సమస్యలేమీ ఎక్కువ ఉండేవి కాదు.కానీ ఇప్పుడు 6 ఏళ్ల పిల్లోడి నుంచి 60 ఏళ్ల పెదోళ్ళ వరకు ఏ వయసు వారైనా సరే బీపీ అని,మధుమేహం, గుండెపోటుతో అని ఇలా రకరకాల ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు.ఒకోసారి హఠాత్తుగా కళ్ళు తెలేసి చనిపోతున్నారు.ఇప్పుడు ఇలాంటి సంఘటనే కర్ణాటకాలో చోటు చేసుకుంది.పన్నెండేళ్ళ చిన్న పిల్లోడు గుండె పోటుతో చనిపోయి తల్లిదండ్రులకు తీరని బాధను మిగిల్చాడు.
కర్ణాటకలోని మడికేరి జిల్లాలో కుశాలనగర తాలూకా కూడుమంగళూరులో పాఠశాల బస్సు డ్రైవర్గా పని చేసే మంజాచారి కుమారుడు కీర్తన్.ఈ పన్నెండేళ్ల ఆరో తరగతి చదువుతున్న చిన్న పిల్లోడికి ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేవు.ఉదయం ఆడుతూ పడుతూ స్కూల్ కి వెళ్ళే వాడు.తిరిగి ఇంటికి వచ్చి అమ్మానాన్నల దగ్గర అల్లరి చేసేవాడు.
అలాంటి ఎటువంటి ఇబ్బందీ లేని కీర్తన్ శనివారం సాయంత్రం ఆడుకుని,అలసిపోయి రాత్రి అవుతుందనగా ఇంటికి వచ్చాడు.అప్పటి వరకు బానే ఉన్న తను ఆ రోజు రాత్రి నిద్రలో ఉలిక్కి పడి గుండెలో నొప్పిగా ఉందని తల్లిదండ్రులకు చెప్పి బాధతో తల్లడిల్లిపోయాడు.పిల్లోడి బాధను చూసిన కుటుంబ సభ్యులు భయపడి వెంటనే కుశాలనగర ఆసుపత్రికి తీసుకెళ్లారు.అయితే ఆసుపత్రిలో పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆలస్యమైపోయిందని,గుండెపోటు వల్ల కీర్తన్ చనిపోయాడనీ ధ్రువీకరించారు.అప్పటి వరకు ఆడుతూ పడుతూ హుషారుగా తిరిగిన తమ బిడ్డ ఒక్క సారిగా కుప్పకూలిపోవడం చూసిన తల్లిదండ్రులు మరియు కుటుంబ సభ్యులు గుండెలు బాదుకుంటూ తల్లడిల్లి పోయారు.
గుండెపోటుతో ఆరో తరగతి బాలుడు మృతి, తల్లడిల్లిన తల్లిదండ్రులు.
