in

నిర్లక్ష్యమైన డ్రైవింగ్ తో ప్రాణాలు తీయబోయిన 25 ఏళ్ల బెంగుళూరు యువకుడు.

పరుల మంచి కోరితే మన ప్రాణాల మీదకు తెచ్చుకున్నట్టే.. అన్నట్టుంది ఈ రోజులలో పరిస్థితి. ఎప్పుడు ఎవరికి ఏం జరుగుతుందో ఎవరూ ఊహించ లేక పోతున్నారు.నిర్లక్ష్యమైన డ్రైవింగ్ చేస్తూ కళ్ళ ముందే కాటికి లాకెల్లి పోతున్నారు.దానికి ఢిల్లీ, బెంగళూరులలో ఇటీవల జరిగిన సంఘటనలే ఉదాహరణ.
ఢిల్లీలో అంజలి అనే యువతిని కారుతో 12 కి.మీ. ఈడ్చుకెళ్లిన సంఘటనను మరవక ముందే అదే తరహా దారుణం బెంగుళూరులో మరొసారి చోటు చేసుకుంది. నిర్లక్ష్యంగా డ్రైవ్ చేయడం మంచిది కాదు అని చెప్పాలని ప్రయత్నించిన 71 ఏళ్ల పెద్దాయన్ని ఒక యువకుడు స్కూటీ రోడ్డుపైన ఈడ్చుకెల్లాడు.
71 ఏళ్ల ముత్తప్ప అనే వ్యక్తి తన కారులో వెళ్తున్న సమయంలో 25 ఏళ్ల సాహిల్ అనే యువకుడు స్కూటీపై వచ్చి కారును ఢీకొట్టడంతో కారుకు గీతలు పడ్డాయి.ముత్తప్ప కారు దిగి,యువకుడిని నిలదీశారు.ఆ యువకుడు నిర్లక్ష్యంగా సమాధానం చెప్పి,తన స్కూటర్‌పై వెళ్లేందుకు ప్రయత్నించగా.. ఆ సమయంలో ముత్తప్ప స్కూటర్ వెనుక భాగంలో పట్టుకొని అతడిని సాహిల్ అడ్డుకునే ప్రయత్నం చేశాడు.సాహిల్ తన స్కూటీను ఆపక పోగా ముత్తప్పను రోడ్డు పాటు ఈడ్చుకెళ్లాడు.బెంగళూరులో నిత్యం రద్దీగా ఉండే రోడ్డుపై మంగళవారం జనవరి 17న పట్టపగలు ఈడ్చుకు వెళ్ళాడు.ఆ తరువాత తోటి వాహనదారులు ఇది గమనించి సాహిల్ ను ఆపడంతో ముత్తప్ప బతికి బట్టకట్ట గలిగాడు.
ఈ సంఘటనను ఎవరో విడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఇది వైరల్ గా మారింది.
ఇక ఈ ఘోరానికి పాల్పడిన సాహిల్ ను పోలీసులు అరెస్ట్ చేయగా.. స్కూటీ, బొలెరో రెండూ ప్రమాదవశాత్తు టచ్ కావడం వల్లనే ఈ ఘటన జరిగిందని డీసీపీ లక్ష్మణ్ నిర్బర్గి తెలిపారు.గాయాల పాలైన ముత్తప్ప ఈ సంఘటనపై మాట్లాడారు.”నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం మంచిది కాదని ఆ యువకుడికి చెబుదామని ప్రయత్నం చేశాను,కానీ ఈలోపే అతను ఇలా ఈడ్చుకు వెళ్ళాడు.ఆ యువకుడు ఇంకెవరితోనూ ఇలా చేయకూడదని కోరుకుంటున్నాను” అంటూ ముత్తప్ప అన్నారు.

What do you think?

235 Points
Upvote Downvote

అర్ధిక సంక్షోభంతో విలవిల లాడుతున్న పాక్ పరిస్తితి మెరుగైయేనా?

ఉక్రెయిన్ తో యుద్దం వల్ల రష్యా నష్టపోతుందా?పుతిన్ మాటలు బడాయి కబుర్లేనా?