in

రూ.10 నాణాలు చలామణీలో ఉన్నాయి – ఆర్బీఐ

రూ.10 నాణాలు చలామణీలో ఉన్నాయి – ఆర్బీఐ

రూ.10 నాణాలు విడుదలైనప్పటి నుండి ఆ నాణాలు చెల్లవని బ్యాంకులో కూడా వాటిని తీసుకోరని ప్రజలు పూర్తిగా వాటిని అంగీకరించడం మానేసారాన్న విషయం తెలిసిందే. ఇప్పటికీ బ్యాంకులలో రూ.10 నాణాలు అంగీకరించవచ్చని పోస్టర్లు చూస్తూనే ఉన్నా వాటిని ఎవరూ పట్టించుకోరు. అయితే తాజాగా ఇప్పుడు మరో సారి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెబుతూ ఈ విషయంపై స్పష్టతనిచ్చింది.

రూ. 10 నాణాలు చలామణీలో ఉన్నాయని ఆర్బీఐ తెలిపింది. దుకాణాలు, వ్యాపారులు, సామాన్య ప్రజలు సహకరించి వాటిని అంగీకరించాలని కోరింది. వాటిపై ఎలాంటి పుకార్లు నమ్మవద్దని, లావాదేవీలకు ఎవరైనా వ్యతిరేకిస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునే హక్కు ప్రభుత్వానికి ఉందని తెలిపింది. బ్యాంకులు కూడా సహకరించాలని చెప్పింది. ఆర్బీఐ (RBI) ప్రజల ప్రయోజనార్థం రూ.10 నాణేలను విడుదల చేసిందని పేర్కొంది. నాణాల వినియోగంలో ప్రజలు బ్యాంకు సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరింది.

What do you think?

దేశంలో భారీగా పెరిగిపోయిన పసిడి ధర

పవన్ కళ్యాణ్ కు “పవర్ స్టార్” టైటిల్ ఎలా వచ్చింది?