in

పవన్ కళ్యాణ్ కు “పవర్ స్టార్” టైటిల్ ఎలా వచ్చింది?

పవన్ కళ్యాణ్ కు “పవర్ స్టార్” టైటిల్ ఎలా వచ్చిందో తెలుసా?

ఈ శనివారం పవన్ కళ్యాణ్‌ పుట్టిన రోజు. ఈ సందర్బంగా సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు ఆయనకు విషెస్ తెలుపుతున్నారు. ఆయన సినిమా రిలీజ్ అవుతున్నా, లేక ఆయన పుట్టిన రోజు వస్తున్నా దాన్ని ఒక పండగలా జరుపుకుంటారు. అందరి హీరోల అభిమానులు ఇదే విధంగా జరుపుకుంటారు అనుకోండి. కాకపోతే పవన్ కళ్యాణ్ అభిమానులు ఒకింత ఎక్కువ సెలబ్రేట్ చేస్తారు. అది పవర్ స్టార్ క్రేజు.

అయితే పవన్ కళ్యాణ్‌కు పవర్‌స్టార్ అనే పేరు ఎలా వచ్చింది? అనేది సరిగ్గా తెలియదు కానీ మొదటగా ‘గోకులంలో సీత’ సక్సెస్ మీట్‌లో పోసాని కృష్ణ మురళి ‘పవర్ స్టార్’ అనే పదాన్ని వాడుతూ పవన్ గురించి మాట్లాడారు. ఆ తరువాత ‘సుస్వాగతం’ సినిమా టైటిల్స్‌లో మొదటి సారిగా ఆయన పేరు పక్కన పవర్ స్టార్ అనే స్టార్ టైటిల్ వేశారు. ఆ పేరుకు తగ్గటే ఆయన యాక్టింగ్ పవర్ తో “పవర్ స్టార్” గా నిలబడిపోయారు.

What do you think?

రూ.10 నాణాలు చలామణీలో ఉన్నాయి – ఆర్బీఐ

విజయవంతమైన ఆదిత్య ఎల్ 1 శాటిలైట్‌ ప్రయోగం