in

విజయవంతమైన ఆదిత్య ఎల్ 1 శాటిలైట్‌ ప్రయోగం

విజయవంతమైన ఆదిత్య ఎల్ 1 శాటిలైట్‌ ప్రయోగం

ఈ రోజు (సెప్టెంబరు 2) ఉదయం 11.50 గంటలకు ఆదిత్య ఎల్ 1 శాటిలైట్‌ను నింగిలోకి పంపే ప్రయోగం సక్సెస్ అయినట్లు ఇస్రో చైర్మన్ సోమనాథ్ ప్రకటించారు. ఆదిత్య ఎల్ 1 నిర్దేశిత కక్ష్యోలోకి ప్రవేశించినట్లు పేర్కొన్నారు. దీంతో అమెరికా, జపాన్, చైనా, యూరప్ తర్వాత సూర్యుడిపైకి విజయవంతంగా రాకెట్ పంపిన దేశంగా భారత్ నిలిచింది. ప్రయోగం విజయవంతం కావడంతో శాస్త్రవేత్తలు ఆనందంలో మునిగిపోయారు.

కాగా ఈ ఆదిత్య ఎల్ 1 అంతరిక్షంలో 4 నెలలపాటు 15 లక్షల కిలోమీటర్లు ప్రయాణించనుంది. ఆపై 5 ఏళ్లకు పైగా సూర్యుడిపై పరిశోధనలు చేపట్టనుంది. ఈ శాటిలైట్ సూర్యుడి పొరలైన ఫొటో స్పియర్, క్రోమో స్పియర్, సూర్యుడి వాతావరణాన్ని అధ్యయనం చేయనుంది. దీని వల్ల సౌర తుపానులపై ఓ అవగాహన ఏర్పడనుంది.

What do you think?

పవన్ కళ్యాణ్ కు “పవర్ స్టార్” టైటిల్ ఎలా వచ్చింది?

సనాతన ధర్మంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఉదయనిధి స్టాలిన్