సనాతన ధర్మంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఉదయనిధి స్టాలిన్
ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సనాతన ధర్మాన్ని డెంగ్యూ, మలేరియా, కరోనాలతో పోల్చారు.
వివరాల్లోకి వెళ్తే ‘తమిళనాడు ప్రొగ్రెసివ్ రైటర్స్ ఆర్టిస్ట్స్ అసోసియేషన్’ శనివారం ‘సనాతన నిర్మూలన’ అనే ఇతివృత్తంతో సదస్సు నిర్వహించింది. దీనికి తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ (Udhayanidhi stalin) హాజరై ప్రసంగించారు. ఈ ప్రసంగంలో సనాతన ధర్మం అనేది సామాజిక న్యాయానికి వ్యతిరేకమని పేర్కొన్నారు.
ఆయన సనాతన దర్మాన్ని వ్యతిరేకించడమే కాకుండా.. దాన్ని సమూలంగా నిర్మూలించాలని పిలుపునిచ్చారు. ‘సనాతన అనేది సంస్కృత పదం. సామాజిక, సమానత్వానికి విరుద్ధం. నిర్మూలించాల్సిందే’ అని ఉదయనిధి అన్నారు.
అయితే ఈ వ్యాఖ్యలను ఆ రాష్ట్ర భాజపా నేతలు తీవ్రంగా ఖండించారు. 80 శాతం జనాభా సనాతన ధర్మాన్ని అనుసరిస్తున్నట్లు చెప్పారు. వారి మారణహోమానికి ఉదయనిధి పిలుపునిచ్చారని భాజపా నేతలు మండిపడ్డారు.